2025 Honda Unicorn Price, Range And Features In Telugu: హోండా యునికార్న్ కొత్త మోడల్ గత సంవత్సరం చివరిలో ఇండియన్ మార్కెట్‌లో లాంచ్ అయింది. ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న మిగిలిన బైక్‌లకు గట్టి పోటీ ఇచ్చేలా ఈ మోటార్ సైకిల్‌లో చాలా కొత్త ఫీచర్లను కంపెనీ యాడ్ చేసింది.
హోండా యునికార్న్ గత 20 సంవత్సరాల నుంచి మార్కెట్‌లో ఉంది. అయితే, ఈ కంపెనీ, ఈ 20 సంవత్సరాలలోనూ యునికార్న్ డిజైన్‌లో ఎటువంటి మార్పులు చేయలేదు. ఈ నేపథ్యంలో, హోండా యునికార్న్ కొత్త మోడల్‌లో ఏం మారింది, కొత్త ఫీచర్లు ఏంటి, కొత్త బండి ధర ఎంతో తెలుసుకుందాం.
హోండా యునికార్న్‌లో ఏ ఫీచర్లు యాడ్ అయ్యాయి? 2025 హోండా యునికార్న్‌లో పుల్లీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఏర్పాటు చేశారు. LED హెడ్‌ల్యాంప్‌లు, సర్వీస్ రిమైండర్, 15 వాట్ల USB టైప్ C ఛార్జింగ్ పోర్ట్ కూడా ఈ మోటార్ సైకిల్‌లో హోండా కంపెనీ అందించింది. ఈ బైక్‌లో గేర్ పొజిషన్ ఇండికేటర్ & ఎకో ఇండికేటర్ కూడా ఉన్నాయి. 2025 హోండా యునికార్న్‌లో తీసుకొచ్చిన ఈ కొత్త ఫీచర్లతో, హోండా, ఈ బైక్ అమ్మకాల ద్వారా తన మార్కెట్ వాటాను పెంచుకోవాలనుకుంటోంది.
కుర్రకారు కోరుకునే పవర్ 2025 హోండా యునికార్న్ బైక్‌లో 163cc సింగిల్ సిలిండర్, ఫ్యూయల్ ఇంజెక్టెడ్ పెట్రోల్ ఇంజిన్ ఉంది. ఈ ఇంజిన్ 13 bhp పవర్‌ను ఇస్తుంది & 14.6 Nm పీక్ టార్క్ జనరేట్ చేస్తుంది. అంటే, కుర్రకారు కోరుకునే పవర్‌ఫుల్ బైక్ ఇది. ఈ బైక్ ఇంజిన్‌ను 5- స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేశారు, ఇది స్మూత్ రైడింగ్‌తో పాటు వేగంగా దూసుకెళ్లే కెపాసిటీని అందిస్తుంది. ఇంకా.. OBD2 (ఆన్-బోర్డ్ డయాగ్నస్టిక్స్ 2) కూడా ఇన్‌స్టాల్ చేశారు, దీని కారణంగా ఈ బైక్ పరిమితికి మించిన కాలుష్యాన్ని విడుదల చేయదు. అంటే, పర్యావరణపరంగానూ మేలు చేస్తుంది.
2025 హోండా యునికార్న్ మైలేజీARAI క్లెయిమ్ చేసిన ప్రకారం, 2025 హోండా యునికార్న్ బండి లీటరు పెట్రోలుకు 60 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. ఈ మోటార్ సైకిల్ ఫ్యూయల్ ట్యాంక్‌లో 13 లీటర్ల పెట్రోల్ నింపవచ్చు. ఈ లెక్కన, ట్యాంక్ ఫుల్ చేసి ఈ పవర్‌ఫుల్ బైక్‌ను 780 కిలోమీటర్ల వరకు ఏకధాటిగా నడపవచ్చు.
2025 హోండా యునికార్న్ ధరహోండా యునికార్న్ కొత్త మోడల్ ఎక్స్-షోరూమ్ ధర (2025 Honda Unicorn ex-showroom price) దాదాపు 1.19 లక్షలు. అన్ని టాక్స్‌లు & ఖర్చులు కలుపుకుని, తెలుగు నగరాల్లో ఈ బండిని రూ. 1.49 లక్షల ఆన్-రోడ్ రేటుకు (2025 Honda Unicorn on-road price) కొనవచ్చు.
కొత్త హోండా యూనికార్న్ బైక్ మూడు రంగుల్లో - మ్యాట్ యాక్సిస్ గ్రే మెటాలిక్ , పెర్ల్ ఇగ్నియస్ బ్లాక్ & రేడియంట్ రెడ్ మెటాలిక్ - మార్కెట్‌లో అందుబాటులో ఉంది.