Kia Sorento: సౌత్ కొరియా కార్ల తయారీ సంస్థ 'కియా' భారత మార్కెట్‌లో కొత్త మోడల్ కియా సోరెంటో ఎస్‌యూవీని లాంచ్ చేసింది. భారత్‌లో దీని స్టార్టింగ్ ధర రూ. 27.99 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించారు. కియా సాల్టోస్ కంటే హై రేంజ్‌లో ఈ ఫ్లాగ్‌షిప్ ఐసీఈ ఎస్‌యూవీ, మార్కెట్‌లో టయోటా ఫార్చ్యూనర్, స్కోడా కోడియాక్, జీప్ మెరిడియన్, ఫోక్స్‌వ్యాగన్ టైరాన్‌లకి గట్టి పోటీ ఇస్తుందని ఎక్స్‌ఫర్ట్ అంటున్నారు.  

Continues below advertisement

డిజైన్, డైమెన్షన్స్

కియా సోరెంటో పొడవు 4,815 మి.మీ, వెడల్పు 1,900 మి.మీ, ఎత్తు 1,785 మి.మీ, వీల్‌బేస్ 2,815 మి.మీటర్లు. ఈ సెగ్మెంట్‌లోనే అత్యంత పొడవైన, వెడల్పాటి ఎస్‌యూవీగా ఉంది.  వర్టికల్‌గా ఉండే హెడ్‌లాంప్స్‌, డీఆర్‌ఎల్‌లు, కియా సిగ్నేచర్ 'టైగర్-నోస్' గ్రిల్ దీనికి సూపర్ లుక్‌ని ఇస్తున్నాయి. బ్యాక్ సైడ్ వర్టికల్ టైల్ లాంప్స్‌ ఉన్నాయి. 18 ఇంచుల అల్లాయ్ వీల్స్‌తో బాక్సీ డిజైన్‌లో లభిస్తుంది. ఆల్-బ్లాక్ వర్షన్‌తో సహా మొత్తం 8 కలర్ ఆప్షన్‌లలో ఈ కారు అందుబాటులోకి వస్తుంది. 

ఇంటీరియర్, ఫీచర్లు  

ఈ ఎస్‌యూవీ క్యాబిన్ లేటెస్ట్ టెక్నాలజీతో ప్రీమియం లుక్‌ను అందిస్తుంది. వేరియంట్‌ను బట్టి 12.3-ఇంచ్ ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్, 4 ఇంచుల లేదా 12.3-ఇంచుల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంది. సీసీఎన్‌సీ నావిగేషన్ సిస్టమ్, కియా కనెక్ట్ 2.0, ఓవర్-ది-ఎయిర్ అప్‌డేట్స్, డిజిటల్ కీ, హెడ్-అప్ డిస్‌ప్లే,  జనరేటివ్-AI అసిస్టెంట్‌తో వస్తుంది.మొదటి రెండు వరుసలలో వెంటిలేటెడ్ సీట్లు, రిలాక్సేషన్ సీట్లు, 10 వే ఎలక్ట్రిక్ డ్రైవర్ సీట్, 4 వే పవర్డ్ ఫ్రంట్ ప్యాసింజర్ సీట్, పనోరమిక్ సన్‌రూఫ్, యాంబియంట్ లైటింగ్, పవర్డ్ టెయిల్‌గేట్, 12-స్పీకర్ బోస్ ఆడియో సిస్టమ్ ఉన్నాయి. 6 సీటర్, 7 సీటర్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. రెండో వరుసలో రీక్లైన్, స్లైడ్ ఫంక్షన్లతో పాటు రిమోట్ ఫోల్డింగ్ ఆప్షన్ ఉంది. 

Continues below advertisement

సెఫ్టీ ఫీచర్లు

 బేస్ వేరియంట్లలో 7 ఎయిర్‌బ్యాగ్‌లు, టాప్ వేరియంట్లలో 10 ఎయిర్‌బ్యాగ్‌లు ఉన్నాయి. టాప్-స్పెక్ మోడల్‌లో లెవెల్ 2+ ADAS, సరౌండ్-వ్యూ, బ్లైండ్-వ్యూ మోనిటర్లు, రిమోట్ పార్కింగ్ అసిస్టెన్స్, డిజిటల్ ఇన్‌సైడ్ రియర్-వ్యూ మిర్రర్, ఫ్రంట్ అండ్ రియర్ డాష్‌క్యామ్, మల్టీ కొలిజన్ బ్రేకింగ్ సిస్టమ్ ఉన్నాయి.

పవర్‌ట్రెయిన్, ఇంజిన్ ఆప్షన్లు  

భారత మార్కెట్‌లో కియా నుంచి స్ట్రాంగ్ హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్, ఆల్-వీల్ డ్రైవ్‌తో వచ్చిన మొదటి మోడల్ ఇదే.

1.6 లీటర్ల పెట్రోల్ స్ట్రాంగ్ హైబ్రిడ్:  

2.2 లీటర్ల డీజిల్ ఇంజిన్:

  • పవర్ & టార్క్: 193 hp, 442 Nm టార్క్
  • డ్రైవ్‌ట్రెయిన్: లోయర్ వేరియంట్లు ఫ్రంట్ వీల్ డ్రైవ్, హైయర్ HTX వేరియంట్ ఆల్-వీల్ డ్రైవ్ (AWD) ఆప్షన్‌తో వస్తాయి. 

వివిధ రోడ్ల పరిస్థితులకు అనుగుణంగా డ్రైవింగ్ మోడ్‌లు, టెర్రైన్ మోడ్‌లు కూడా అందుబాటులో ఉన్నాయి. HTE, HTK, HTX అనే మూడు మెయిన్ ట్రిమ్‌లలో ఈ కారు అందుబాటులోకి రానుంది.Also Read: రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Tata Curvv తీసుకుంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి