Kia Seltos petrol automatic version mileage: కొత్త తరం Kia Seltos మార్కెట్లోకి వచ్చినప్పటి నుంచి, సైజ్‌, డిజైన్‌, ఫీచర్ల పరంగా ఇది గత మోడల్‌తో పోలిస్తే స్పష్టమైన అప్‌గ్రేడ్‌లా అనిపిస్తోంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ SUVకి మంచి డిమాండ్ ఉంది. అయితే SUV కొనుగోలు ముందు చాలా మంది అడుగుతున్న ప్రశ్న ఒక్కటే - రియల్ వరల్డ్‌లో మైలేజ్ ఎంత ఇస్తుంది?

ఈ కథనంలో Kia Seltos 1.5 పెట్రోల్ IVT (ఆటోమేటిక్) వెర్షన్‌కు సంబంధించిన నిజమైన మైలేజ్ వివరాలను స్పష్టంగా చూద్దాం.

2026  Kia Seltos ఇంజిన్‌, గేర్‌బాక్స్ వివరాలు

New Kia Seltos‌లో మూడు ఇంజిన్ ఆప్షన్లు ఉన్నాయి.

115hp 1.5 లీటర్ పెట్రోల్

160hp 1.5 లీటర్ టర్బో పెట్రోల్

116hp 1.5 లీటర్ డీజిల్

వీటిలో 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్ + IVT (CVT) ఆటోమేటిక్ గేర్‌బాక్స్ కాంబినేషన్‌ను చాలా మంది బ్యాలెన్స్‌డ్ ఎంపికగా భావిస్తున్నారు. ఈ ఇంజిన్ 115hp పవర్‌, 144Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. డ్రైవింగ్ అనుభవం చాలా స్మూత్‌గా, రిఫైన్‌గా ఉంటుంది.

ఈ వెర్షన్‌లో Eco, Normal, Sport అనే మూడు డ్రైవ్ మోడ్‌లు ఉన్నాయి. అయితే ఇందులో ఆటో ఇంజిన్ స్టాప్-స్టార్ట్ ఫీచర్ లేదు, ఇది మైలేజ్‌పై కొంత ప్రభావం చూపించే అంశమే.

మైలేజ్‌

ARAI రేట్‌ చేసిన ప్రకారం, 2026 కియా సెల్టోస్‌ మైలేజ్‌ లీటరుకు 17.7 కిలోమీటర్లు.

రియల్ వరల్డ్ మైలేజ్ ఫలితాలు

రియల్ వరల్డ్ టెస్టుల్లో, ఎక్స్‌పర్ట్‌లు ఈ కారును Eco మోడ్‌లో మాత్రమే నడిపారు. సాధారణ వినియోగదారుడు ఎలా నడుపుతాడో అలాగే టెస్టులు నిర్వహించారు. ఇలా చేసినప్పుడు...

సిటీలో మైలేజ్: 10.3 కి.మీ./లీటర్‌

హైవే మీద మైలేజ్: 14.22 కి.మీ./లీటర్‌

సగటు మైలేజ్: 12.26 కి.మీ./లీటర్‌

ARAI సర్టిఫై చేసిన మైలేజ్‌ (17.7 km/l)కు, రియల్‌ వరల్డ్‌ మైలేజ్‌కు (12.26 km/l) దాదాపు లీటరుకు 5.5 km/l తేడా ఉంది. అయితే, ఒక SUVకి రియల్‌ వరల్డ్‌లో ఈ సంఖ్యలు సరైన స్థాయిలోనే ఉన్నాయని చెప్పాలి. ముఖ్యంగా ట్రాఫిక్ ఎక్కువగా ఉండే నగరాల్లో 10 kmpl దాటడం మంచి ఫిగర్‌గా పరిగణించవచ్చు.

ఈ టెస్టులు ఎలా చేశారు?

ఫ్యూయల్ ఎఫిషియెన్సీ టెస్టులకు ముందు ట్యాంక్‌ను పూర్తిగా నింపారు.

టైర్ ప్రెషర్‌ను కంపెనీ సూచించిన విధంగా ఉంచారు.

ఒకే డ్రైవర్‌, 22 డిగ్రీల ఎయిర్‌కండిషన్ ఆన్‌లో, నవీ ముంబై పరిసరాల్లోని సిటీ, హైవే రూట్లలో టెస్ట్ చేశారు.

చివర్లో మళ్లీ ట్యాంక్ నింపి మైలేజ్ లెక్కించారు.

Hyundai Cretaతో పోలిక

గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇదే ఇంజిన్‌, గేర్‌బాక్స్ సెటప్‌ను ఉపయోగిస్తున్న Hyundai Creta 1.5 పెట్రోల్ IVT కూడా దాదాపు ఇలాంటి మైలేజ్‌నే ఇస్తుంది. అంటే Seltos మైలేజ్ విషయంలో Creta స్థాయిలోనే ఉందని అర్థం.

స్మూత్ డ్రైవింగ్‌, రిఫైన్‌మెంట్‌, నమ్మదగిన ఆటోమేటిక్ గేర్‌బాక్స్ కోరుకుంటే Kia Seltos 1.5 పెట్రోల్ IVT మంచి ఎంపిక. కానీ మైలేజ్ మీకు టాప్ ప్రాధాన్యం అయితే, డీజిల్ ఆప్షన్ లేదా హైబ్రిడ్ వాహనాల వైపు కూడా ఒకసారి దృష్టి పెట్టడం మంచిది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.