Tata Punch EV Facelift Details: ఎలక్ట్రిక్‌ వాహనాల విభాగంలో టాటా మోటార్స్‌ దూకుడు కొనసాగుతోంది. ఇప్పటికే మార్కెట్లో మంచి ఆదరణ పొందుతున్న Tata Punch EVకు ఇప్పుడు ఫేస్‌లిఫ్ట్‌ రూపంలో కొత్త లుక్‌ ఇచ్చేందుకు కంపెనీ సిద్ధమైంది. అధికారిక లాంచ్‌కు ముందే టాటా పంచ్‌ ఈవీ ఫేస్‌లిఫ్ట్‌ ఎక్స్‌టీరియర్‌ డిజైన్‌ను టాటా వెల్లడించింది. ఈ కొత్త మోడల్‌ ఈ నెల 20న (ఫిబ్రవరి 20, 2026) మార్కెట్లోకి రానుంది.

Continues below advertisement

కొత్త ఫ్రంట్‌ డిజైన్‌ - మరింత ఫ్యూచరిస్టిక్‌

పంచ్‌ ఈవీ ఫేస్‌లిఫ్ట్‌లో ముందు భాగం పూర్తిగా కొత్తగా కనిపిస్తుంది. గ్రిల్‌ ప్రాంతం ఇప్పుడు క్లోజ్డ్‌ ఆఫ్‌ డిజైన్‌తో వచ్చింది. అయితే గత మోడల్‌లో ఉన్న హెడ్‌లైట్స్‌ను కలిపే బ్లాక్‌ ట్రిమ్‌ పీస్‌, కనెక్టెడ్‌ LED DRLs‌ను ఈసారి తీసేశారు. దీంతో ఫ్రంట్‌ లుక్‌ మరింత క్లిన్‌గా, మినిమలిస్టిక్‌గా మారింది. క్రింద భాగంలో ఉన్న స్కఫ్‌ ప్లేట్‌కూ స్వల్ప డిజైన్‌ మార్పులు చేశారు.

Continues below advertisement

కొత్త కలర్‌, కొత్త అలాయ్‌ వీల్స్‌

ఈ ఫేస్‌లిఫ్ట్‌లో మరో ఆకర్షణ కొత్త కలర్‌ ఆప్షన్‌. ఇది హారియర్‌ SUVలో కనిపించిన ‘Sunlit Yellow’ షేడ్‌ను పోలి ఉంటుంది. బ్లాక్‌ రూఫ్‌తో ఈ కలర్‌ పంచ్‌ ఈవీకి ప్రీమియం ఫీల్‌ ఇస్తుంది.

అలాగే, ఎయిరో-ఆప్టిమైజ్డ్‌ అలాయ్‌ వీల్స్‌కు కొత్త డిజైన్‌ ఇచ్చారు. ఇవి పెద్ద నెక్సాన్‌ ఈవీ నుంచి ప్రేరణ పొందినట్లుగా కనిపిస్తున్నాయి. ఇది కారు లుక్‌ను మాత్రమే కాదు, ఎఫిషియెన్సీని కూడా మెరుగుపరచే అవకాశం ఉంది.

ఇంటీరియర్‌లో ఏం మారుతుంది?

టాటా ఇప్పటివరకు ఇంటీరియర్‌ను అధికారికంగా చూపించలేదు. కానీ, పెద్దగా మార్పులు ఉండకపోవచ్చని అంచనా. డ్యాష్‌బోర్డ్‌ డిజైన్‌లో చిన్న మార్పులు ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా నెక్సాన్‌ ఈవీలో ఉన్న 12.3 అంగుళాల టచ్‌స్క్రీన్‌ ఇన్ఫోటైన్‌మెంట్‌ సిస్టమ్‌ ఈ పంచ్‌ ఈవీ ఫేస్‌లిఫ్ట్‌కు కూడా రావచ్చని సమాచారం. ఇది కొత్త సాఫ్ట్‌వేర్‌తో మరింత స్మార్ట్‌ అనుభూతిని ఇవ్వనుంది.

ఫీచర్లు, సేఫ్టీ - మరింత అడ్వాన్స్‌డ్‌

ప్రస్తుత మోడల్‌లో ఉన్న ఫీచర్లను టాటా కొనసాగించనుంది. వీటిలో 10.25 అంగుళాల డిజిటల్‌ డ్రైవర్‌ డిస్‌ప్లే, వెంటిలేటెడ్‌ ఫ్రంట్‌ సీట్లు, వైర్‌లెస్‌ ఫోన్‌ ఛార్జర్‌, 360 డిగ్రీ కెమెరా, ఆటో-డిమ్మింగ్‌ IRVM, కనెక్టెడ్‌ కార్‌ టెక్నాలజీ, అంబియంట్‌ లైటింగ్‌ ఉన్నాయి.

సేఫ్టీ పరంగా ఇది మరింత బలంగా మారనుంది. లెవల్‌ 2 ADAS సూట్‌ను టాటా ఈ ఫేస్‌లిఫ్ట్‌లో అందించే అవకాశం ఉంది. ఇది ఈ సెగ్మెంట్‌లో పెద్ద ప్లస్‌గా మారుతుంది.

బ్యాటరీ, రేంజ్‌

పంచ్‌ ఈవీ ఫేస్‌లిఫ్ట్‌లో పవర్‌ట్రైన్‌ మారే అవకాశం లేదు. ఇది 25kWh, 35kWh బ్యాటరీ ఆప్షన్లతో కొనసాగనుంది. వీటికి వరుసగా 265 కి.మీ, 365 కి.మీ ARAI రేంజ్‌ ఉంటుంది.

25kWh మోడల్‌ 82hp పవర్‌, 114Nm టార్క్‌ ఇస్తే, 35kWh మోడల్‌ 122hp పవర్‌, 190Nm టార్క్‌ను అందిస్తుంది.

ధర అంచనాలు

ప్రస్తుత మోడల్‌ రూ.9.99 లక్షల నుంచి రూ.14.44 లక్షల (ఎక్స్‌షోరూమ్‌) మధ్య ఉంది. ఫేస్‌లిఫ్ట్‌ మోడల్‌ ధర కొద్దిగా పెరగవచ్చని అంచనా.

మొత్తంగా చూస్తే, టాటా పంచ్‌ ఈవీ ఫేస్‌లిఫ్ట్‌ డిజైన్‌, టెక్నాలజీ, సేఫ్టీ విషయంలో ప్రజలు కోరుకున్న అప్‌డేట్స్‌తో వస్తోంది. లాంచ్‌ తర్వాత ఎలక్ట్రిక్‌ SUV సెగ్మెంట్‌లో మరింత పోటీ పెంచడం ఖాయం అనిపిస్తోంది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.