Kia Seltos IVT Review In Telugu: కియా సెల్టోస్‌ రెండో తరం మోడల్‌ ఇప్పటికే తన లుక్‌, కంఫర్ట్‌, టెక్నాలజీతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు అందులో 1.5 లీటర్‌ నేచురల్లీ ఆస్పిరేటెడ్‌ పెట్రోల్‌ ఇంజిన్‌తో వచ్చిన IVT వేరియంట్‌ నిజంగా కొనదగినదేనా?. ఎక్స్‌పర్ట్‌లు స్వయంగా డ్రైవ్‌ చేసి అందించిన వివరాలు మీ కోసం.

Continues below advertisement

వేరియంట్లు - డిజైన్‌

సెల్టోస్‌ IVT ఇప్పుడు Tech Line, GT Line, X-Line స్టైల్‌ ప్యాకేజీల్లో, మొత్తం 9 ట్రిమ్‌లలో తెలుగు ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. ఈ మోడల్‌ను బయట నుంచి చూస్తే, టర్బో DCT లేదా డీజిల్‌ ఆటోమేటిక్‌ కంటే భిన్నమైన పెద్ద తేడాలేవీ కనిపించవు. 18 ఇంచుల వీల్స్‌, షార్ప్‌ LED DRLs, భారీ గ్రిల్‌తో ప్రీమియం లుక్‌ ఇస్తుంది.

Continues below advertisement

ఇంటీరియర్‌ - స్పేస్‌

కారు లోపల రెండు 12.3 ఇంచుల స్క్రీన్‌లు, ఫిజికల్‌ బటన్లు, మంచి క్వాలిటీ ఫినిషింగ్‌ ఉన్నాయి. ముందు సీట్లు స్టైలిష్‌గా ఉన్నా, పెద్ద శరీరాకృతి ఉన్నవారికి కొంచం చిన్నవిగా అనిపించొచ్చు. వెనుక సీట్లలో మాత్రం లెగ్‌రూమ్‌ బాగుంది. ముగ్గురు పెద్దవాళ్లు సౌకర్యంగా కూర్చోవచ్చు.

ఫీచర్లు - సేఫ్టీ

GTX (A) ట్రిమ్‌లో 12.3 ఇంచుల డిజిటల్‌ క్లస్టర్‌, 360 డిగ్రీ కెమెరా, Bose సౌండ్‌ సిస్టమ్‌, వెంటిలేటెడ్‌ సీట్లు, పవర్డ్‌ డ్రైవర్‌ సీట్‌, పానోరమిక్‌ సన్‌రూఫ్‌, ADAS వంటి ఫీచర్లు ఉన్నాయి.

సేఫ్టీ పరంగా 6 ఎయిర్‌బ్యాగ్స్‌, స్టాబిలిటీ కంట్రోల్‌, TPMS, Isofix మౌంట్స్‌ ఉన్నాయి. Global NCAP లేదా Bharat NCAP రేటింగ్‌ ఇంకా ప్రకటించలేదు.

ఇంజిన్‌ - పనితీరు

1.5 లీటర్‌ పెట్రోల్‌ ఇంజిన్‌ 115hp శక్తి, 144Nm టార్క్‌ ఇస్తుంది. గేర్‌బాక్స్‌ చాలా స్మూత్‌గా పనిచేస్తుంది. సిటీ డ్రైవింగ్‌లో జర్క్‌ లేకుండా సాఫీ అనుభవం ఇస్తుంది. Eco, Normal, Sport మోడ్‌లు ఉన్నాయి.

0-100 కి.మీ. వేగం చేరడానికి సుమారు 13.07 సెకన్లు పడుతుంది. అంటే టర్బో DCT అంత స్పోర్టీగా ఈ కారు అనిపించదు. కానీ ట్రాఫిక్‌లో డ్రైవ్‌ చేసే వారికి ఈ స్మూత్‌నెస్‌ పెద్ద ప్లస్‌.

మైలేజ్‌

సిటీ డ్రైవ్‌లో సుమారు లీటరుకు 10.3 km, హైవేలో 14.2 km వరకు మైలేజ్‌ అందించింది. ఈ సెగ్మెంట్‌కు ఇది సరిపడే స్థాయి అని చెప్పొచ్చు.

రైడ్‌ - హ్యాండ్లింగ్‌

కొత్త సెల్టోస్‌లో సస్పెన్షన్‌ సెటప్‌ను మరింత మెరుగ్గా తీర్చిదిద్దారు. గుంతలు, స్పీడ్‌ బ్రేకర్లను చక్కగా మ్యానేజ్‌ చేస్తుంది. స్టీరింగ్‌ లైట్‌గా ఉంటుంది. పార్కింగ్‌ కూడా సులభం. హైవేలో Sport మోడ్‌లో కొద్దిగా బరువుగా అనిపిస్తుంది.

హైదరాబాద్‌ - విజయవాడ ధరలు

సెల్టోస్‌ IVT ధర రూ.13.39 లక్షల నుంచి రూ.19.49 లక్షల వరకు (ఎక్స్‌-షోరూమ్‌ ధర). హైదరాబాద్‌, విజయవాడలో ఆన్‌రోడ్‌ ధర సుమారు రూ.15.5 లక్షల నుంచి ప్రారంభమవుతాయి.

మీ డ్రైవింగ్‌ ఎక్కువగా సిటీ ట్రాఫిక్‌లోనే ఉంటే, స్మూత్‌, కంఫర్ట్‌ అనుభవం కావాలంటే సెల్టోస్‌ IVT మంచి ఎంపిక. కానీ పవర్‌, స్పోర్టీ ఫీలింగ్‌ కావాలంటే టర్బో DCT వెర్షన్‌ వైపు చూడాలి. 

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.