MeghasandesamSerial Today Episode: శరత్ చంద్రతో కర్రసాముకు రెడీ అయిన గగన్ దగ్గరకు భూమి వెళ్తుంది. ఎలాగైనా గగన్‌ను పందెం నుంచి విరమింపజేయాలని చూస్తుంది. గగన్‌ను కన్వీన్స్ చేయాలనుకుంటుంది. భూమి ఎంత చెప్పినా గగన్ కూడా వినడు.
గగన్: నేను ఆవేదనతో అడుగుతున్నాను భూమి.
భూమి: ఇదే ఆవేదన మా నాన్న కూడా పడుతున్నాడు బావ. ఈ సంవత్సరమే ఆయన ఈ పోటీలల్లో ఆఖరుగా పాల్గొంటాడట. విజయంతో తన ఈ పోటీ ప్రయాణాన్ని ముగించుకోవాలనుకున్నారట. కానీ నీకు ఎదురుపడి ఓడిపోతానని భయపడుతున్నారట. కన్నీరు కూడా పెట్టుకుని ఈ పోటీలో నీ మీద ఆయన గెలిస్తే.. నన్ను కూతురుగా అంగీకరిస్తానని కబురు పెట్టారు బావ. అంతే కాదు బావ. మన రెండు కుటుంబాలు ఒక్కటై పోవచ్చని చెప్పారు. కొన్ని క్షణాలు నీవి కాదనుకుంటే నీకు ఎదురు కాబోతున్న ఈ ఓటమి కాస్త కష్టమైన మర్చిపోగలిగితే మనం అందరం ఒక్కటైపోవచ్చు బావ. ఆ ఆశతోనే నేను నిన్ను ఓడిపోమ్మని అడుగుతున్నాను. ఇన్నాళ్లు శారద అత్తయ్యను అవమానికి గురి చేసిన వాళ్లు ఇప్పుడు అత్తయ్యకు వియ్యపురాలు హోదా ఇచ్చి గౌరవిస్తారు. ఆ కుటుంబం నుంచి ఎప్పుడు ఏ ప్రమాదం వస్తుందోనని భయపడే మనకు ఇక నుంచి ప్రమోదమే తప్ప.. ఇక ప్రమాదం ఉండదని ఇప్పుడు నువ్వు ఓడిపోయే ఓటమి మనకు భరోసా ఇస్తుంది బావ. బావ ఫ్లీజ్ నాకోసం మన ఇంటి ఆనందం కోసం ఈ ఒక్కసారి మా నాన్న చేతిలో ఓడిపో బావ.
అంటూ భూమి గగన్‌ను కన్వీన్స్ చేస్తుంటే.. గగన్ మాత్రం ఏమీ పలకకుండా అక్కడి నుంచి వెళ్లిపోతాడు. దూరం నుంచి అంతా చూస్తున్న అపూర్వ, సుజాత నవ్వుకుంటారు.
సుజాత: అమ్మాయి భూమి.. గగన్‌ను ఓడిపోమ్మని కోడిపుంజును దువ్వినట్టుగా బాగా దువ్వి దువ్వి గ్రౌండ్ లోకి పంపిస్తున్నట్టు ఉంది అమ్మాయి.
అపూర్వ: నాకు అలాగే అనిపిస్తుంది పిన్ని..
సుజాత: అవును అమ్మాయి. అల్లుడు గారి చేతిలో గగన్ గాడు ఓడిపోతాడు సరే మరి రెండు కుటుంబాలు కలుస్తాయి అని మాటిచ్చావు కదా మరి దాని సంగతి ఏంటి…? ఇప్పుడు మరి భూమి అడిగితే ఏం చెప్తావు అమ్మాయి.
అపూర్వ: నేను ఎక్కడ మాటిచ్చాను పిన్ని. అలా బావ మాట ఇచ్చాడని అబద్దం చెప్పా.. బావ మాట ఇవ్వలేదు కనక మాట నిలబెట్టుకోవాల్సిన అవసరం బావకు లేదు. ఇక నేను అంటావా..? మాట ఇచ్చిన నిలబెట్టుకునే మనిషిని కాదు. ఇక చెప్పిన అబద్దాన్ని ఎలా నిలబెట్టుకుంటాను చెప్పు..
సుజాత: అబ్బాబ్బ అమ్మాయి నువ్వు మామూలు దానికి కాదు అమ్మాయి. కంచు కనకరత్నానివి. నిన్ను అంత తేలికగా ఎవ్వరూ అంచనా వేయలేరు.
అపూర్వ: ఇంకా ఇప్పుడేం చూశావు పిన్ని.. ఒకసారి ఈ గగన్ గాడిని బావ చేతిలో ఓడిపోతే గెలిచిన వారి మాట ఓడిన వాడు వినాలి కనక. బావతో చెప్పించి. వాణ్ని వాడి కుటుంబాన్ని ఈ ఊరు నుంచే వెలి వేయిస్తాను.
సుజాత: నువ్వు సూపర్ అమ్మాయి.
అనగానే ఇద్దరూ నవ్వుకుంటూ గుడిలోకి వెళ్తారు. అటూ కర్రసాము పోటీలు మొదలవుతాయి. ఇంతలో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!
