Kia EV6 facelift: ఢిల్లీలో జరుగుతున్న భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025లో కియా మొదటి ఎలక్ట్రిక్ వాహనాన్ని మరింతగా అప్‌డేట్ చేసి విడుదల చేసింది. ఎక్స్‌పోలో EV6 ఫేస్‌లిఫ్ట్‌ను రివీల్ చేసింది. ప్రీ-ఫేస్‌లిఫ్ట్ EV6 మాదిరిగానే ఇందులో కూడా రెండు GT-లైన్ వేరియంట్‌లు ఉన్నాయి. రియర్-వీల్ డ్రైవ్ (RWD), ఆల్-వీల్ డ్రైవ్ (AWD) కలిగి ఉండి మోడ్రన్ లుక్, కొత్త ఫీచర్ల వస్తోంది. ఇవాల్టి నుంచి దీనికి సంబంధించిన బుకింగ్స్ ప్రారంభించిన కియా ఇండియా మార్చిలో వెహికల్ ధరలు వెల్లడించనుంది.
EV6 అనేది భారతదేశంలో విడుదలైన కియా మొదటి ఎలక్ట్రిక్ వాహనం. ఇక్కడ GT-లైన్ ట్రిమ్‌ను మాత్రమే తీసుకొస్తుంది. విదేశాలలో టాప్-స్పెక్ GT-లైన్ Sను విక్రయిస్తోంది. స్థానికంగా అసెంబుల్ చేసుకునే Ioniq 5 లా కాకుండా CBUగా ఈ మోడల్‌ను తీసుకురానుంది.
Kia EV6 ఫేస్‌లిఫ్ట్ ఫీచర్స్
ఆటో ఎక్స్‌పో 2025లో ప్రదర్శించిన EV6 పెద్ద 84kWh బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంది. ఇప్పటి వరకు ఇలాంటి మోడల్ కారులో 77.4kWh బ్యాటరీ మాత్రమే ఉండేది. ఇది వెహికల్‌కు మరింత శక్తిని ఇస్తుంది. ఈ నాల్గవ తరం సెల్ పవర్స్ రెండు మోటార్లు 325hp, 605Nm పవన్ జనరేట్ చేస్తాయి. ఆల్-వీల్ డ్రైవ్ సామర్థ్యాన్ని పెంచుతాయి. ఒకసారి ఛార్జ్ చేస్తే 650 కి.మీ కంటే ఎక్కువ దూరం ప్రయాణం చేయవచ్చు. ఈ కారులో ఫాస్ట్ ఛార్జింగ్ కెపాసిటీని కూడా పెంచారు. కేవలం 18 నిమిషాల్లో 10 శాతం నుంచి 80 శాతం వరకు ఛార్జింగ్ 350kW ఫాస్ట్ ఛార్జర్ ఫిట్ చేశారు.
కియా EV6 ఫేస్‌లిఫ్ట్ డిజైన్ ఎలా ఉంది?
EV6 ఫేస్‌లిఫ్ట్ వెహికల్ పొడవు, వెడల్పు, ఎత్తులో ఎలాంటి మార్పులు చేర్పులు చేయలేదు. కియా ప్రీ-ఫేస్‌లిఫ్ట్ EV6 మాదిరిగానే 4,695mm పొడవు, 1,890mm వెడల్పు, 1,550mm పొడవు కలిగి ఉంది. వీల్‌బేస్ కడా 2,900mm ఉంది. ఇది మార్చకపోవడంతో మొత్తం సిల్హౌట్ ఒకేలా కనిపిస్తోంది.
ఇందులో కొత్తగా చేసిందేంటీ అంటే LED డేటైమ్ రన్నింగ్ లాంప్‌లు మార్చారు. సిగ్నేచర్ స్టార్ మ్యాప్ లైటింగ్ సెటప్ కోసం హెడ్‌లైట్‌లను అవుట్‌లైన్ చేశారు. లోవర్ గ్రిల్, బంపర్‌లో మార్పులు చేశారు. వాటిని షార్ప్ చేశారు. మెషిన్డ్ ఫినిషింగ్, బాడీ-కలర్ సైడ్ క్లాడింగ్‌తో 19-అంగుళాల అల్లాయ్ వీల్స్ GT-లైన్ ట్రిమ్ ఈ వెహికల్‌కు ప్రత్యేకమైనవి. టెయిల్-లైట్లు, వెనుక బంపర్‌కు చిన్న చిన్న మార్పులు చేశారు.
కియా EV6 ఫేస్‌లిఫ్ట్ ఇంటీరియర్ ఎలా ఉంది?
రెండు-స్పోక్ స్టీరింగ్ వీల్‌పై రైట్ సైడ్‌లో కియా లోగో ముద్రించారు. ఈ కారును కీ లేకుండా డ్రైవ్ చేసే ఈ కారులో డ్రైవర్‌ను గుర్తు పట్టేందుకు ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను అమర్చారు. డ్రైవింగ్‌లో మరింత సాయం కోసం EV6 అప్‌డేట్ HUD అమర్చారు. డిజిటల్ రియర్-వ్యూ మిర్రర్ కూడా ఉంటుంది. విదేశ కొత్త జెనెసిస్ కార్లలో కనిపించే AI-ఆధారిత నావిగేషన్ సపోర్ట్ ఇందులో తీసుకొచ్చారు.
రెండు 12.3 inch పనోరమిక్ స్క్రీన్ అమర్చారు. వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే, యాంబియంట్ లైటింగ్, వైర్‌లెస్ ఛార్జర్, డిజిటల్ కీ, వెహికల్-టు-లోడ్ (V2L) సామర్థ్యం కలిగి ఉంది. ఓవర్-ది-ఎయిర్ (OTA) సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ చేస్తుంది.
EV6 5-స్టార్ యూరో NCAP రేటింగ్ కలిగి ఉంది. ఇది 2022లో క్రాష్ టెస్ట్ చేసిన ప్రీ-ఫేస్‌లిఫ్ట్. దీని లేటెస్ట్ ADAS సూట్‌లో ఫార్వర్డ్, రియర్, బ్లైండ్-స్పాట్ అవాయిడెన్స్ అసిస్ట్ కలిగి ఉంది. రివర్సింగ్ కెమెరా సిస్టమ్ ,ఫ్రంట్ రియర్ పార్కింగ్ సెన్సార్లు రానే వచ్చాయి.