Tirumala News | తిరుమల: హిందువులు ఎంతో పవిత్రంగా భావించే కలియుగదైవం శ్రీ వెంకటేశ్వరస్వామి సన్నిధి తిరుమలలో అపచారం జరిగింది. కొందరు తమిళనాడు భక్తులు నిషేధిత తిను బండరాలతో తిరుమలకు చేరుకున్నారు. తమిళ భక్తులు ఓ డబ్బా నిండా కోడి గుడ్లు, పలావ్ తో అలిపిరి నుంచి తిరుమలకు చేరుకున్నారు. అయితే సెక్యూరిటీ చెకింగ్ దాటుకొని అంత మందితో కూడిన ఓ బృందం నిషేధిత పదార్థాలతో తిరుమలకు ఎలా వచ్చిందన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. నిఘా విభాగం వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తుందంటూ భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


 రాంభాగిచ్చ బస్టాండ్ ఆవరణలో కొందరు భక్తులు కోడిగుడ్డు, పలావ్ తింటున్నట్లు గుర్తించిన భక్తులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు  హుటాహుటిన అక్కడకు చేరుకుని భక్తుల వద్ద ఉన్న ఆహారాన్ని సీజ్ చేశారు. తిరుమలలో ఇలాంటి నిషేధిత ఆహారం, నిషేధిత వస్తువలు తీసుకురాకూడదని తమిళనాడు నుంచి వచ్చిన భక్తుల బృందాన్ని మందలించారు పోలీసులు. ఇక్కడికి అలాంటి నిషేధిత పదార్థాలు తీసుకురాకూడదని సూచించారు. తాజా ఘటనతో తిరుమలకు ఎంట్రీ ఇచ్చే ముందు పరిశీలించే అలిపిరి తనిఖీ కేంద్రంలో డొల్లతనాన్ని శ్రీవారి భక్తులు ప్రశ్నిస్తున్నారు. తనిఖీ కేంద్రం దాటుకొని పవిత్రమైన తిరుమలకు నిషేధిత ఆహారం ఎలా వచ్చిందంటూ ప్రశ్నిస్తున్నారు.


Also Read: Polavaram Project: పోలవరం ప్రాజెక్టులో పురోగతి - కొత్త డయాఫ్రం వాల్ నిర్మాణ పనులు ప్రారంభం 


అసలే తిరుమలలో కల్తీ నెయ్యితో లడ్డూ తయారీ అనే అంశం దుమారం రేపింది. కూటమి ప్రభుత్వం వర్సెస్ వైసీపీ నేతలుగా వివాదం మారింది. చివరగా ఆ వివాదం ఏదోలా సద్దుమణిగింది. వైసీపీ హయాంలో కల్తీ నెయ్యి లడ్డూ తయారీకి వినియోగించారని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు ఆరోపించారు. టీటీడీ మాత్రం ఈ అంశంపై ఆచూతూచి వ్యవహరించింది. కల్తీ నెయ్యి గుర్తించి ట్యాంకర్ల శాంపిల్స్ గుజరాత్ కు పంపించి టెస్టులు చేపించినట్లు ఈవో చెప్పారు. కల్తీ నెయ్యిని లడ్డూ ప్రసాదాల తయారీకి వినియోగించలేదని తెలిపార. ఇటీవల వైకుంఠ ద్వార దర్శనాల టికెట్లు జారీ సమయంలో తొక్కిసలాట జరిగి కొందరు భక్తులు చనిపోయారు.