Car Prices Hike: క్యాలెండర్‌లో సంవత్సరం మారుతుందంటే ఆటో రంగంలో ఏదో ఒక కొత్త సంఘటన చోటు చేసుకుంటోంది. మీరు కొత్త కారు కొనాలని ఆలోచిస్తున్నట్లయితే ఈ సమాచారం మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కొన్ని కార్ల తయారీ కంపెనీలు పెరుగుతున్న ఇన్‌పుట్ కాస్ట్‌ను పేర్కొంటూ కార్ల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించాయి. ఈ కార్ల కంపెనీల్లో కియా మోటార్స్ నుంచి మహీంద్రా వరకు ప్రముఖ బ్రాండ్లు కూడా ఉన్నాయి.


కియా ఇండియా తన అన్ని కార్ల రెండు శాతం వరకు ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. ధరల పెంపు 2025 జనవరి 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తుంది. పెరుగుతున్న ఇన్‌పుట్ కాస్ట్, పెరిగిన సప్లై చెయిన్ సంబంధిత ఖర్చుల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆటోమేకర్ ఒక ప్రకటనలో తెలిపారు. 


కార్ల ధరలను ఏ కంపెనీలు పెంచాయి?
కియా ఇండియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (సేల్స్ అండ్ మార్కెటింగ్) హర్దీప్ సింగ్ బ్రార్ మాట్లాడుతూ కస్టమర్లకు అత్యంత నాణ్యమైన సాంకేతికతతో కూడిన అధునాతన వాహనాలను అందించడానికి కంపెనీ కట్టుబడి ఉందని చెప్పారు. అయితే నిత్యావసర వస్తువుల ధరలు పెరగడం, ఎక్స్‌ఛేంజ్ రేట్లు అనుకూలంగా లేకపోవడం, ముడిసరుకు ధరలు పెరగడంతో ధరలు పెంచడం అనివార్యమైందని ఆయన అన్నారు.


Also Read: నెక్సాన్ వర్సెస్ కర్వ్ వర్సెస్ బీఈ 6ఈ - మూడు ఎలక్ట్రిక్ కార్లలో ఏది బెస్ట్!


వచ్చే నెల నుంచి తమ ప్యాసింజర్ వాహనాల ధరలను మూడు శాతం వరకు పెంచనున్నట్లు టాటా మోటార్స్ సోమవారం తెలిపింది. పెరుగుతున్న ముడిసరుకు ధరలు, ద్రవ్యోల్బణం ప్రభావాన్ని పాక్షికంగా తగ్గించేందుకు వాహనాల ధరలను పెంచబోతున్నట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.


ఈ ధరల పెరుగుదల 2025 జనవరి నుంచి అమల్లోకి వస్తుంది. ఇవి మోడళ్లు, వాటి వెర్షన్‌లను బట్టి మారుతూ ఉంటుంది. అంతకుముందు మారుతి సుజుకి, హ్యుందాయ్, మహీంద్రా, జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్‌తో సహా అనేక వాహన తయారీ కంపెనీలు కూడా వచ్చే నెల నుంచి వాహనాల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించాయి. లగ్జరీ ఆటోమేకర్లు మెర్సిడెస్ బెంజ్ ఇండియా, ఆడి, బీఎండబ్ల్యూ కూడా నిర్వహణ ఖర్చుల పెరుగుదల కారణంగా జనవరి నుంచి ధరలు పెంచుతున్నట్లు ప్రకటించాయి.



Also Read: రోజుకి 1000 బుకింగ్స్ - మార్కెట్లో దూసుకుపోతున్న కొత్త డిజైర్ - ధర అంత తక్కువా?