Kia Carens: కియా కారెన్స్ మనదేశంలో లాంచ్ అయింది. ఈ కారు ధర రూ.8.99 లక్షల నుంచి ప్రారంభం కానుంది. అయితే ఈ కొత్త కారులో కొన్ని హైలెట్స్ కూడా ఉన్నాయి. ఇది ఒక ఎంపీవీ కారు. ఒక్క వేరియంట్‌లో ఆరు సీట్లు ఉండగా... మిగతా అన్ని వేరియంట్లలో ఏడు సీట్లు అందించారు. ఇందులో రెండు పెట్రోల్ ఇంజిన్లు, ఒక డీజిల్ ఇంజిన్ ఉన్నాయి. ప్రీమియం, ప్రెస్టీజ్, ప్రెస్టీజ్ ప్లస్, లగ్జరీ, లగ్జరీ ప్లస్ వేరియంట్లలో ఈ కారు కొనుగోలు చేయవచ్చు.
1. కియా కారెన్స్ మనదేశంలో ప్రత్యేకమైన డిజైన్‌తో లాంచ్ అయింది. దీని ముందు కియా లాంచ్ చేసిన కార్ల కంటే ప్రత్యేకమైన డిజైన్ ఇందులో అందించారు. దీని ముందువైపు చాలా కొత్తగా ఉండనుంది. ఉపరితలం గ్లాస్ బ్లాక్‌తో రూపొందించారు. ఇందులో ఎల్ఈడీ ఫాగ్‌ల్యాంప్స్, సైడ్ క్లాడింగ్, 16 అంగుళాల అలోయ్ వీల్స్ కూడా ఉన్నాయి
2. దీని ఇంటీరియర్ కూడా చాలా బాగుంది. డ్యాష్‌బోర్డును ఇందులో లేయర్స్ వారీగా విభజించారు. ఇందులో 10.25 అంగుళాల టచ్ స్క్రీన్ సిస్టంను అందించారు. 4.2 అంగుళాల టీఎఫ్‌టీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా ఉంది. బోస్ సౌండ్ సిస్టం ఉన్న ఎనిమిది స్పీకర్లు అదనపు ఆకర్షణ.
3. ఇందులో వన్ టచ్ ఎలక్ట్రిక్ ఫోల్డింగ్ సీట్ మెకానిజం అందించారు. ఇది మూడో వరుసలో అందుబాటులో ఉంది. మీరు ఒక బటన్ ప్రెస్ చేయగానే... సీట్ ఫోల్డ్ అవుతుంది. మూడో వరుసలో స్పేస్ కూడా పెద్దగానే ఉంది. మధ్య వరుసలో స్పేస్ కూడా ఎక్కువ ఉంది. ఎయిర్ ప్యూరిఫయర్ కూడా ఇందులో అందించారు.
4. కియాలో 64 కలర్ యాంబియంట్ లైటింగ్ ఉంది. దీంతోపాటు వైర్‌లెస్ స్మార్ట్ ఫోన్ చార్జర్, బోస్ సౌండ్ సిస్టం ఉన్న ఎనిమిది స్పీకర్లు, స్పీడ్ లిమిటర్ ఉన్న ఆటో క్రూయిజ్ కంట్రోల్, స్పోర్ట్, ఎకో, నార్మల్ డ్రైవింగ్ మోడ్స్ ఇందులో ఉన్నాయి. ఆరు ఎయిర్ బ్యాగ్స్ కూడా ఇందులో అందించడం విశేషం.
5. ఇందులో 1.5 లీటర్ నాచురల్లీ యాస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్, 1.5 లీటర్ నాచురల్లీ యాస్పిరేటెడ్ డీజిల్ ఇంజిన్, 1.4 లీటర్ టర్బోచార్జ్‌డ్ పెట్రోల్ ఇంజిన్ వేరియంట్లు ఉన్నాయి. 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్ 113 బీహెచ్‌పీ, 144 ఎన్ఎం పీక్ టార్క్‌ను అందించనుంది. ఇందులో సిక్స్-స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ ఆప్షన్ మాత్రమే అందుబాటులో ఉంది. 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ 113 బీహెచ్‌పీ, 250 ఎన్ఎం పీక్ టార్క్‌ను అందించనుంది. ఇందులో సిక్స్-స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్, సిక్స్-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లు అందించారు. 1.4 లీటర్ టర్బోచార్జ్‌డ్ పెట్రోల్ ఇంజిన్ 138 బీహెచ్‌పీ, 242 ఎన్ఎం పీక్ టార్క్‌ను అందించనుండటం విశేషం. ఇందులో సిక్స్-స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్, సెవెన్-స్పీడ్ డ్యూయల్-క్లచ్ ట్రాన్స్‌మిషన్ వేరియంట్లు లాంచ్ అయ్యాయి.
Also Read: Tata Altroz: రూ.8 లక్షల్లోపే టాటా కొత్త కారు, అల్ట్రోజ్‌లో కొత్త వేరియంట్ వచ్చేసింది!
Also Read: Skoda Kodiaq: ఈ సూపర్ హిట్ కారు అవుట్ ఆఫ్ స్టాక్.. 2022లో అస్సలు కొనలేరు!