Discount On EV Cars | భారత ఆటో మార్కెట్‌లో ఎలక్ట్రిక్ స్కూటీలతో పాటు ఎలక్ట్రిక్ కార్లకు డిమాండ్ వేగంగా పెరుగుతోంది. ఈ క్రమంలో కియా మోటార్స్ తమ Kia Carens Clavis EV కొనుగోలుదారులకు ఓ గుడ్ న్యూస్ అందించింది. కియా కంపెనీ ఈ ఎలక్ట్రిక్ MPVపై భారీ డిస్కౌంట్లను అందిస్తోంది. దీని ద్వారా కస్టమర్లు లక్షల రూపాయల వరకు ప్రయోజనం కలగనుంది. ఈ ఆఫర్ పరిమిత కాలం వరకు మాత్రమే అందుబాటులో ఉండనుంది. పాత మోడళ్లపై ఎక్కువ బెనిఫిట్స్ వస్తున్నాయి. తమ కుటుంబం కోసం ఎక్కువ రేంజ్ ఇచ్చే ప్రీమియం ఎలక్ట్రిక్ కారును కొనాలని చూస్తున్న వారికి ఇది ఒక అద్భుతమైన అవకాశంగా భావించాలి. 

Continues below advertisement

కారుపై ఎంత డిస్కౌంట్ లభిస్తోంది?నివేదికల ప్రకారం, Kia మోటార్స్ తన Carens Clavis EVపై సుమారు 2.15 లక్షల రూపాయల వరకు ప్రయోజనాలను అందిస్తోంది. ఇందులో క్యాష్ డిస్కౌంట్, ఎక్స్ఛేంజ్ బోనస్, స్క్రాపేజ్ బెనిఫిట్, కార్పొరేట్ ఆఫర్లు సైతం ఉన్నాయి. ముఖ్యంగా HTM వేరియంట్‌పై అత్యధిక ప్రయోజనం లభిస్తోందని సమాచారం. కియా కంపెనీ 2025 మోడల్ ఇయర్ స్టాక్‌ను త్వరగా క్లియర్ చేయాలనే ఉద్దేశంతో పాత మోడళ్లపై ఎక్కువ డిస్కౌంట్ ఇస్తోంది. అదే సమయంలో 2026 మోడళ్లపై తక్కువ డిస్కౌంట్ ఇస్తున్నారు. కియా మోటార్స్ టైం టు టైం తమ కార్లపై డిస్కౌంట్ ఆఫర్లు ప్రకటించి కస్టమర్లకు ప్రయోజనాలు చేకూరుస్తుంది. గత నెలలోనూ కియా ఆఫర్లతో అమ్మకాల్లో దూసుకెళ్లింది.

Kia Carens Clavis EVని ప్రత్యేకంగా ఫ్యామిలీ జర్నీ అవసరాలను దృష్టిలో ఉంచుకుని రూపొందించారు. ఇది ఒక ప్రీమియం ఎలక్ట్రిక్ MPV, ఇందులో ఎక్కువ స్పేస్ వచ్చేలా క్యాబిన్, 6, 7 సీటర్ ఆప్షన్లు.. ఎక్కువ దూరం ప్రయాణించే సామర్థ్యం ఉన్నాయి. కియా కంపెనీ ఇందులో రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లు ఇచ్చింది. దీని పెద్ద బ్యాటరీ ప్యాక్ ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే దాదాపు 490 కిలోమీటర్ల వరకు రేంజ్ ఇస్తుంది.  అందుకే ఈ కారు సిటీలో ఆఫీసులకు వెళ్లడం, ఇతర పనులకు తీసుకెళ్లడంతో పాటు లాంగ్ జర్నీలకు కూడా సరిపోతుందని కస్టమర్లు భావిస్తున్నారు.

Continues below advertisement

కారు డిజైన్ ఎలా ఉంది?Carens Clavis EV డిజైన్ విషయానికి వస్తే, లుక్ చాలా మోడ్రన్‌గా, ప్రీమియంగా ఉంది. ఇందులో క్లోజ్డ్ ఫ్రంట్ గ్రిల్, LED DRLలు, ఏరోడైనమిక్ అలాయ్ వీల్స్, EV-స్టైల్ డిజైన్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇవి దీనిని సాధారణ పెట్రోల్ లేదా డీజిల్ MPVల కంటే ప్రత్యేకం చేస్తాయి. కారు ఫ్రంట్ లుక్ చాలా ఫ్యూచరిస్టిక్‌గా కనిపిస్తుంది. వెనుక భాగంలో ఉన్న కనెక్టెడ్ LED టెయిల్ లైట్లు మరింత ఆకర్షణీయంగా మారుస్తాయి.

కారు ఇంటీరియర్ విషయానికి వస్తే, ప్రీమియం ఫీల్ ఇచ్చేందుకు కియా ప్రయత్నించింది. ఇందులో డ్యూయల్ 12.3 అంగుళాల స్క్రీన్ సెటప్, పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే వంటి ఫీచర్లు ఉన్నాయి. వీటితో పాటు వెంటిలేటెడ్ సీట్లు, పనోరమిక్ సన్‌రూఫ్, బోస్ (Bose) సౌండ్ సిస్టమ్, వైర్‌లెస్ ఛార్జింగ్, యాంబియంట్ లైటింగ్ వంటి సౌకర్యాలు కూడా కల్పించారు. ఈ కారు కేవలం ఎలక్ట్రిక్ మాత్రమే కాదు, టెక్నాలజీ, లగ్జరీ పరంగానూ చాలా అడ్వాన్స్‌డ్‌గా ఉంటుంది.

కారు సేఫ్టీ ఫీచర్లుభద్రత విషయానికి వస్తే, Kia కంపెనీ ఈ MPVని చాలా స్ట్రాంగ్‌గా తయారు చేసింది. ఇందులో Level-2 ADAS టెక్నాలజీ ఇచ్చారు. ఇందులో ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, లేన్ కీప్ అసిస్ట్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ ఫీచర్లు ఉన్నాయి. వీటితో పాటు 360 డిగ్రీల కెమెరా, మల్టిపుల్ ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ సేఫ్టీ ఫీచర్లు కూడా ఇచ్చారు. కంపెనీ ఇందులో Vehicle to Load (V2L) ఫీచర్‌ను కూడా ఇవ్వగా.. దీని సహాయంతో  బ్యాటరీ ద్వారా ఇతర ఎలక్ట్రానిక్ డివైజ్‌లు కూడా రన్ చేయవచ్చు.