Kawasaki KLX230 New GST Price Cut: అడ్వంచర్ బైకర్స్ కోసం గుడ్ న్యూస్. కావాసాకి, తన KLX230 డ్యుయల్ స్పోర్ట్ బైక్ ధరను గణనీయంగా తగ్గించింది. గతంలో 3.30 లక్షల ఎక్స్-షోరూమ్ ధరతో లాంచ్ అయిన ఈ బైక్ ఇప్పుడు కేవలం రూ. 1.84 లక్షల ఎక్స్-షోరూమ్ ధరతో అందుబాటులోకి వచ్చింది. ఈ భారీ ధర తగ్గింపుతో - Hero Xpulse 210, KTM 250 Adventure, Suzuki V-Strom 250 బైక్‌లకు టఫ్ కాంపిటీషన్ ఇవ్వబోతుంది.
ఇంజిన్ & పనితీరు
Kawasaki KLX230 లో 233 సిసి ఎయిర్-కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజిన్ ఉంది. ఇది 18.1 bhp పవర్, 18.3 Nm టార్క్ ఇస్తుంది. ఈ ఇంజిన్ సిక్స్-స్పీడ్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. ఆఫ్-రోడింగ్ చేయాలనుకునే యువత కోసం ఈ బైక్ బాగా సూటవుతుంది.
డిజైన్ & కంఫర్ట్
KLX230 డిజైన్ పూర్తిగా యుటిలిటేరియన్ స్టైల్‌లో ఉంది. హై-సెట్ ఫ్రంట్ ఫెండర్, మినిమలిస్ట్ ఫెయరింగ్, కాంపాక్ట్ టెయిల్ సెక్షన్‌తో ఈ బైక్ అడ్వెంచర్ లుక్ ఇస్తుంది. లాంగ్ & ఫ్లాట్ సీట్ ఉండటం వల్ల రైడర్ సులభంగా వెయిట్ షిఫ్ట్ చేయగలడు. 880 mm సీట్ హైట్, 139 కిలోల కర్బ్ వెయిట్‌తో ఇది యూత్‌కి మరింత సౌకర్యం కలిగిస్తుంది.
సస్పెన్షన్ & బ్రేకింగ్
Kawasaki KLX230 లో టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్, లింక్డ్ మోనోషాక్ రియర్ సస్పెన్షన్ ఉన్నాయి. డిస్క్ బ్రేకులు రెండు వైపులా ఉండటంతో స్టాపింగ్ పవర్ కూడా బలంగా ఉంటుంది. అదనంగా 21 అంగుళాల ఫ్రంట్, 18 అంగుళాల రియర్ వైర్-స్పోక్డ్ వీల్స్‌తో ఇది మరింత ఆఫ్-రోడ్ ఫ్రెండ్లీగా మారింది.
గ్రాఫిక్స్ & ఫీచర్లు
కొత్తగా రిఫ్రెష్ చేసిన బాడీ గ్రాఫిక్స్‌తో Kawasaki KLX230 మరింత స్టైలిష్‌గా కనిపిస్తోంది. సింగిల్ ఛానల్ ABS సిస్టమ్ ఉండటం వల్ల యువ రైడర్స్‌కి మరింత కంట్రోల్ ఇస్తుంది. కావాసాకి, ఈ మోటార్ సైకిల్‌ను రెండు కలర్ ఆప్షన్స్‌లో అందిస్తోంది.
KLX230R S వెర్షన్
ట్రయల్ మిషన్‌గా ప్రత్యేకంగా డిజైన్ చేసిన KLX230R S ను మాత్రం సాధారణ రోట్లపై తిప్పడానికి వీల్లేదు (not road-legal). ఈ బండి లైమ్ గ్రీన్ కలర్‌లో మాత్రమే లభిస్తుంది. 270 mm గ్రౌండ్ క్లియరెన్స్, 900 mm సీట్ హైట్ ఉండటం వల్ల హార్డ్‌కోర్ ఆఫ్-రోడర్స్‌కి ఇది సూపర్ బైక్.
యువతకు మంచి ఛాయిస్
ధర తగ్గింపుతో Kawasaki KLX230 ఇప్పుడు మరింత ఆకర్షణీయమైన డీల్ అవుతుంది. అడ్వెంచర్ రైడింగ్ అంటే ఇష్టపడే యువతకు ఇది బెస్ట్ ఆప్షన్. ప్రాక్టికల్‌గా, శక్తిమంతమైన ఇంజిన్‌తో ఈ బైక్ Hero Xpulse 210 కి డైరెక్ట్ రైవల్‌గా నిలవబోతోంది.