Renault Kiger vs Nissan Magnite vs Citroen C3 Comparision: భారతీయ యువతలో, ముఖ్యంగా తెలుగు వాళ్లకు కారు అంటే కేవలం ప్రయాణ సాధనమే కాదు, అది ఒక అనుబంధం కూడా. యంగ్‌స్టర్స్‌ తమకు నచ్చిన కారును యూత్‌ ఐకాన్‌లా, తమ అభిరుచికి అద్దంలా భావిస్తారు. కాలేజీ లేదా ఫస్ట్ జాబ్ తర్వాత తమకంటూ ఒక SUV కొనడం ఇపుడు ట్రెండ్‌గా మారింది. ప్రత్యేకించి ఆటోమేటిక్ SUVలు డ్రైవింగ్ స్ట్రెస్‌ను తగ్గించడంతో పాటు ఫస్ట్ టైమ్ డ్రైవర్స్‌కి అదనపు కంఫర్ట్ ఇస్తున్నాయి. అలా చూస్తే, రూ. 10 లక్షల లోపల వచ్చే రెనాల్ట్ కైగర్, నిస్సాన్ మ్యాగ్నైట్, సిట్రోయెన్ సి3 ఇప్పుడు పెద్ద డిమాండ్‌లో ఉన్నాయి.

Continues below advertisement

సేఫ్టీ ఫస్ట్ - యువ డ్రైవర్స్‌కి ఇది ముఖ్యంకారు కొనే ముందు మొదటగా చూడాల్సింది సేఫ్టీ ఫీచర్స్. మీ డ్రైవింగ్‌ మీద మీకు కాన్ఫిడెన్స్‌ ఉన్నప్పటికీ, కుటుంబ సభ్యుల ఆందోళనలను కూడా దృష్టిలో పెట్టుకుని కారు ఎంచుకోవాలి. ప్రస్తుతం,  రూ. 10 లక్షల్లో బెటర్‌ సేఫ్టీ ఫీచర్లు ఇస్తున్న కార్లలో - Renault Kiger Techno Turbo CVT, Nissan Magnite N-Connecta 1.0 Turbo CVT - రెండూ 6 ఎయిర్‌ బ్యాగ్స్, ESP, హిల్ స్టార్ట్ అసిస్ట్ వంటి ఫీచర్లతో వస్తున్నాయి. ఇవి Global NCAP క్రాష్ టెస్టుల్లో మంచి స్కోర్లు సాధించాయి. అంటే ఫస్ట్ టైమ్ డ్రైవ్ కోసం వీటిపై నమ్మకం పెట్టుకోవచ్చు.

డ్రైవింగ్ ఎక్స్‌పీరియన్స్‌ Magnite Turbo CVT, Kiger Techno CVT - ఈ రెండింటికీ 1.0 లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్ ఉంది. సిటీ డ్రైవ్‌లో స్మూత్‌గా, లాంగ్ డ్రైవ్స్‌లో పంచింగ్‌ ఇవ్వగల డ్రైవింగ్ ఎక్స్‌పీరియన్స్‌ ఇస్తాయి. Citroen C3 Shine AT కూడా టర్బో ఆటోమేటిక్‌తో రాబోతోంది. అయితే, యువతకు ముఖ్యంగా కావలసిన కూల్ ఫ్యాక్టర్ కైగర్, మ్యాగ్నైట్ రెండింటికీ కాస్త ఎక్కువగా ఉంటుంది.

Continues below advertisement

స్టైల్ & ఫీచర్స్యంగ్‌ కస్టమర్లలో, SUV అంటే లుక్స్ చాలా ముఖ్యం. ఈ మధ్య కైగర్, మ్యాగ్నైట్ రెండింటికీ ఫ్రెష్ అప్‌డేట్స్ వచ్చాయి. కొత్త గ్రిల్ డిజైన్స్, యూత్‌ఫుల్ డాష్‌బోర్డ్ లుక్, కనెక్టివిటీ ఫీచర్లు, మరికొన్ని మోడ్రన్‌ ఫీచర్లు నెక్స్ట్ లెవెల్ ఫీల్ ఇస్తాయి. Citroen C3 Shine AT మాత్రం కొంచెం ఆఫ్‌బీట్ లుక్‌తో వచ్చి ఫ్రెంచ్ టచ్ ఇస్తుంది. కానీ Citroen డీలర్‌షిప్ ప్రతి నగరంలో ఉండకపోవడం ఒక మైనస్ పాయింట్.

బడ్జెట్ ఫ్రెండ్లీరూ. 10 లక్షల లోపల కార్లలో SUV ఎంచుకోవడం కాస్త కష్టమే. కానీ నిస్సాన్ మ్యాగ్నైట్ N-కనెక్టా టర్బో CVT, రెనాల్ట్ కైగర్ టెక్నో టర్బో CVT - ఈ రెండు వేరియంట్స్ ప్రాక్టికల్ ఆప్షన్స్. సేఫ్టీ, స్టైల్, ఫీచర్స్ అన్నింటినీ బ్యాలెన్స్‌ చేస్తున్నాయి.

ఫస్ట్ టైమ్ డ్రైవర్లకు సూచనమీరు డ్రైవింగ్ కొత్తగా మొదలుపెడుతూ, ఒక సేఫ్, స్మార్ట్ & స్టైలిష్ SUV కావాలనుకుంటే – మ్యాగ్నైట్ లేదా కైగర్ మీ తొలి ప్రాధాన్యంగా తీసుకోవచ్చు. సిట్రోయెన్ C3 Shine AT మంచి SUV అయినా, డీలర్ నెట్‌వర్క్ పరిమితం కావడం వల్ల కాస్త రిస్క్ ఉంటుంది.