Kalki 2898 AD Special Vehicle Bujji: రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా సినిమా ‘కల్కి 2898 ఏడీ’. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘కల్కి 2898 ఏడీ’ సినిమా నుంచి ప్రత్యేకమైన బుజ్జి అనే భారీ వెహికిల్‌ను రివీల్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ కారుకు సంబంధించిన స్పెసిఫికేషన్లు బయటకు వచ్చాయి. ఆటోకార్ ఇండియా చేసిన ఒక యూట్యూబ్ వీడియోలో దీని స్పెసిఫికేషన్లను రివీల్ చేశారు.


టైర్లు ఇలా...
బుజ్జి కోసం టైర్ల కంపెనీ సియట్ ప్రత్యేకంగా టైర్లను రూపొందించింది. ఇందులో ఎటువంటి బేరింగులు అస్సలు లేవు. టైరు మొత్తం ఒకే భారీ రిమ్ మీద బేస్ అయి ఉంటుంది. దీని రిమ్ సైజు ఏకంగా 34.5 అంగుళాలుగా ఉంది. ఒక ఎస్‌యూవీ కారుకు సంబంధించిన సగటు రిమ్ సైజు 17 అంగుళాలు కాగా, దీని రిమ్ సైజు ఏకంగా 34.5 అంగుళాలు కావడం విశేషం. అంటే ఎస్‌యూవీ రిమ్ సైజుతో పోలిస్తే రెట్టింపు కంటే ఎక్కువన్న మాట. అల్యూమినియంతో పాటు దిగుమతి చేసిన లోహాలతో ఈ రిమ్స్‌ను రూపొందించారు. వీటిని బేరింగ్స్‌కు మౌంట్ చేశారు. ఈు బేరింగ్స్... హాలో హబ్స్‌కు మౌంట్ అయ్యాయి. ముందువైపు సస్పెన్షన్ కోసం స్వింగ్ ఆర్మ్స్ అందించారు. వీటి బరువు ఏకంగా ఒక టన్ను వరకు ఉంది.


బరువు ఎంత?
మొత్తం కారు బరువు ఏకంగా ఆరు టన్నుల వరకు ఉండటం విశేషం. కారు వెనుకభాగాన్ని పూర్తిగా అల్యూమినియంతో రూపొందించారు. ఈ కారుకు సంబంధించిన రియాక్టర్లు ఉన్న ఛాంబర్‌ను పక్కభాగంలో అందించారు. వెనుక వైపు సస్పెన్షన్‌ కోసం ప్రత్యేకంగా తయారు చేసిన కాయిల్ స్ప్రింగ్స్ అందించారు. కారు వెనుక భాగంలో యాక్సిల్‌ను సపోర్ట్ చేసే డాంపర్స్ బరువు మూడు టన్నులుగా ఉంది.


కారు కొలతలు ఎలా ఉన్నాయి?
బుజ్జి పొడవు 6075 మిల్లీమీటర్లు కాగా, వెడల్పు 3380 మిల్లీమీటర్లుగానూ, ఎత్తు 2186 మిల్లీమీటర్లుగానూ ఉంది. సాధారణంగా ఎస్‌యూవీలు 4380 మిల్లీమీటర్ల సగటు పొడవు, 1800 మిల్లీమీటర్ల సగటు వెడల్పు, 1650 మిల్లీమీటర్ల సగటు ఎత్తు ఉంటాయి. దీంతో పోల్చి చూస్తేనే బుజ్జి ఎంత భారీగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. దీని గ్రౌండ్ క్లియరెన్స్ 180 మిల్లీమీటర్లుగా ఉంది. కారు పైభాగంలో ఉన్న అద్దాలను ప్రత్యేకమైన ఫైబర్‌తో రూపొందించారు.


బుజ్జి ఎలక్ట్రిక్ కారా? పెట్రోల్, డీజిల్ కారా?
బుజ్జి పూర్తిగా ఎలక్ట్రిక్ కారు. వెనుకవైపు రెండు ఎలక్ట్రిక్ మోటార్లు ఉన్నాయి. రెండు ఎయిర్ కూల్డ్ కిర్లోస్కర్ మోటార్లను ఇందులో అందించారు. దీని పీక్ పవర్ 94 కిలోవాట్స్‌గా ఉంది. పీక్ టార్క్ ఏకంగా 9800 ఎన్ఎం కావడం విశేషం. 47 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ ఈ కారులో ఉంది. ఇందులో రియర్ వీల్ డ్రైవ్ మోటార్ చూడవచ్చు. దీని టెక్నాలజీని మహీంద్రా రూపొందించింది. మహీంద్రా, జయ మోటార్స్ కలిసి దీన్ని రూపొందించాయి. ఎలక్ట్రో హైడ్రాలిక్ స్టీరింగ్‌ను బుజ్జిలో అందించారు. స్టీరింగ్ వీల్ నేరుగా హైడ్రాలిక్‌కు కనెక్ట్ అయి ఉంటుంది.


ఈ కారు టైరు దాదాపు నాలుగు అడుగుల వరకు ఉందని చూసిన వారు అంటున్నారు. ఈ కారును చూసి హీరో నాగచైతన్య కూడా షాక్ అయ్యారు. దీన్ని తయారు చేయడం కోసం ఇంజినీరింగ్‌లో ఉన్న రూల్స్ అన్నీ బ్రేక్ చేశారని అన్నారు. బుజ్జి స్క్రీన్ మీద చేసే వండర్స్ చూడాలంటే జూన్ 27వ తేదీ వరకు వెయిట్ చేయాల్సిందే!




Also Read: 2024 స్కోడా సబ్ కాంపాక్ట్ ఎస్‌యూవీ లాంచ్ త్వరలో - ఫీచర్లు ఎలా ఉండనున్నాయి?