SUV Sales Report June 2025: భారత ఆటోమొబైల్ మార్కెట్‌లో అత్యధిక డిమాండ్ ఉన్న సబ్-4 మీటర్ SUV సెగ్మెంట్‌, జూన్ 2025లో షాకింగ్ టర్న్‌ తీసుకుంది. జూన్ నెలలో కేవలం 81,665 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి, ఇది గత సంవత్సరం జూన్ (95,201 యూనిట్లు)తో పోలిస్తే 14.22% మేర తగ్గుదల. మే 2025తో పోలిస్తే పరిస్థితి మరింత చేదుగా ఉంది – 17.48% క్షీణత కనిపించింది.       

ఈ చేదు నిజాల మధ్య, మారుతి బ్రెజ్జా మాత్రం పుంజుకుంది. మారుతి సుజుకి బ్రెజ్జా జూన్‌లో 14,507 యూనిట్లు అమ్మి టాప్ పొజిషన్‌ సొంతం చేసుకుంది. ఇది, గత ఏడాది జూన్‌తో పోలిస్తే 10% వృద్ధి అయినప్పటికీ, 2025 మే నెలతో పోలిస్తే మాత్రం 6.8% తగ్గింది.     

టాటా నెక్సాన్ (ICE + EV కలిపి) అమ్మకాలు 11,602 యూనిట్ల వరకు పరిమితమయ్యాయి. ఇది 3.85% వార్షిక తగ్గుదల, 11% నెలవారీ తగ్గుదల. నెక్సాన్ EVకి గిరాకీ పెరిగినా, మొత్తం అమ్మకాలపై అది ప్రభావం చూపలేకపోయింది.     

టాటా పంచ్‌కు (ICE + EV కలిపి) భారీ పంచ్‌ పడింది, 10,446 యూనిట్ల అమ్మకాలు మాత్రమే సాధించింది. గత ఏడాది కంటే ఇది 42% తగ్గుదల కాగా, మే 2025తో పోలిస్తే 20% డౌన్. ఇది టాటా మోటార్స్‌కు పెద్ద నష్టంగా చెప్పొచ్చు.

మారుతి ఫ్రాంక్స్ మాత్రం స్వల్ప వృద్ధిని నమోదు చేసి 9,815 యూనిట్ల అమ్మకాలు సాధించింది. ఇది గత ఏడాదితో పోలిస్తే 1.31% పెరిగింది, కానీ, ఈ ఏడాది మే నెలతో పోలిస్తే 27.75% తగ్గింది.    

ఇతర ప్రముఖ SUV మోడల్స్ కూడా అమ్మకాల పరంగా వెనుకబడ్డాయి.     

మహీంద్రా XUV 3XO – 7,089 యూనిట్లు (16.6% డౌన్)       

హ్యుందాయ్ వెన్యూ – 6,858 యూనిట్లు (30.6% డౌన్)      

కియా సోనెట్ – 6,658 యూనిట్లు (32.1% డౌన్)          

హ్యుందాయ్ ఎక్సెంట్ – 5,873 యూనిట్లు       

స్కోడా కైలాక్ – 3,196 యూనిట్లు (35% డౌన్)        

టయోటా టైజర్ – 2,408 యూనిట్లు (37% డౌన్)        

నిస్సాన్ మాగ్నైట్ – 1,313 యూనిట్లు         

కియా సైరోస్ – కేవలం 774 యూనిట్లు (78.5% భారీ తగ్గుదల)         

రెనాల్ట్ కైగర్ – 755 యూనిట్లు (34.3% తగ్గినా, మేతో పోలిస్తే 37% పెరిగింది)        

మారుతి జిమ్నీ – 371 యూనిట్లు (45.6% తగ్గుదల)        

ఈ గణాంకాలు చూస్తే, మార్కెట్‌లో స్పష్టమైన స్తబ్దత కనిపిస్తోంది. కొత్త మోడళ్ల రాకతో పాటు.. ధరలు, భద్రత, ఫీచర్ల ఆధారంగా కస్టమర్ల అభిరుచి మారుతోంది. మరిన్ని EV మోడళ్ల ఎంట్రీ, ధరల మార్పులు, కొత్త పన్ను విధానాలు వంటివి వచ్చే నెలల్లో మార్కెట్‌ గమ్యాన్ని నిర్ణయించనున్నాయి.