Jawa 42 FJ review: జావా బ్రాండ్‌కు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. క్లాసిక్‌ లుక్‌తో పాటు ఆధునిక టెక్నాలజీ కలయికే జావా బైకుల ప్రధాన బలం. అదే దారిలో వచ్చిన తాజా మోడల్‌ జావా 42 FJ. కంపెనీ వ్యవస్థాపకుడు ఫ్రాంటిసెక్‌ జానెచెక్‌ పేరులోని ఇనిషియల్స్‌తో ఈ బైక్‌కు FJ అనే పేరు పెట్టారు. మరి, ఈ బైక్‌ కొనేముందు తప్పక తెలుసుకోవాల్సిన 5 ముఖ్య విషయాలు ఇవే.

Continues below advertisement

1) జావా 42 FJలో ఉన్న ఇంజిన్‌ ఏది?

జావా 42 FJలో 334cc సింగిల్‌-సిలిండర్‌, లిక్విడ్‌-కూల్డ్‌ ఇంజిన్‌ ఇచ్చారు. ఇది 29.2 Hp శక్తి, 29.6 Nm టార్క్‌ ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్‌కు 6-స్పీడ్‌ గేర్‌బాక్స్‌ జత చేశారు. కొత్త ఆల్ఫా 2 ఇంజిన్‌ వల్ల పాత జావా మోడళ్లతో పోలిస్తే రిఫైన్‌మెంట్‌, రైడబిలిటీ మరింత మెరుగయ్యాయి. నగరంలో నెమ్మదిగా నడిపినా, హైవే మీద స్పీడ్‌లో తీసుకెళ్లినా బైక్‌ స్మూత్‌గా స్పందిస్తుంది.

Continues below advertisement

2) బైక్‌ బరువు, కొలతలు ఎలా ఉన్నాయి?

జావా 42 FJ డ్రై వెయిట్‌ (ఫ్యూయల్‌, ఇంజిన్‌ ఆయిల్‌ వంటివి లేకుండా) 184 కిలోలు. 12 లీటర్ల ఫ్యూయల్‌ ట్యాంక్‌ పూర్తిగా నింపిన తర్వాత కర్బ్‌ వెయిట్‌ సుమారు 200 కిలోలు ఉంటుంది. ఈ బండి, పోలికలో, రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ క్లాసిక్‌ 350 కి దగ్గరగా ఉంటుంది. జావా 42 FJ సీట్‌ హైట్‌ 790 మిల్లీమీటర్లు, గ్రౌండ్‌ క్లియరెన్స్‌ 178 మిల్లీమీటర్లు ఉండటం వల్ల సాధారణ ఎత్తు ఉన్న రైడర్లకు కూడా ఈ బైక్‌ సౌకర్యంగా అనిపిస్తుంది.

3) జావా 42 FJలో ఉన్న ఫీచర్లు ఏమిటి?

ఈ బైక్‌లో అవసరమైన ఫీచర్లన్నీ ఇచ్చారు. డ్యూయల్‌-చానల్‌ ABS, LED హెడ్‌ల్యాంప్‌, బేసిక్‌ LCD ఇన్‌స్ట్రుమెంట్‌ క్లస్టర్‌ ఇందులో ఉన్నాయి. ఫీచర్లు చాలా ఎక్కువగా లేకపోయినా, క్లాసిక్‌ బైక్‌ ఫీలింగ్‌ కోరుకునే వారికి ఇది సరైన సెటప్‌.

4) కలర్‌ ఆప్షన్లు ఎన్ని ఉన్నాయి?

జావా 42 FJ మొత్తం 5 కలర్‌ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. అవి: Mystique Copper, Deep Black Matte Black Clad, Aurora Green Matte, Deep Black Matte Red Clad, Cosmo Blue Matte. ఈ రంగులు బైక్‌కు ప్రీమియం లుక్‌ను ఇస్తాయి.

5) జావా 42 FJ ధరలు ఎంత?

జావా 42 FJ ధర రూ.1,83,584 (ఎక్స్‌-షోరూమ్‌ ధర – ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ) నుంచి ప్రారంభమవుతుంది.

హైదరాబాద్‌ ఆన్‌రోడ్‌ ధర:RTO – రూ.29,038ఇన్సూరెన్స్‌ – రూ.11,805మొత్తం ఆన్‌రోడ్‌ ధర – రూ.2,24,427

విజయవాడ ఆన్‌రోడ్‌ ధర:RTO – రూ.23,530ఇన్సూరెన్స్‌ – రూ.11,737మొత్తం ఆన్‌రోడ్‌ ధర – రూ.2,18,851

మొత్తంగా చూస్తే, జావా 42 FJ క్లాసిక్‌ డిజైన్‌, శక్తిమంతమైన ఇంజిన్‌, సరైన ఫీచర్లతో ఒక బ్యాలెన్స్‌డ్‌ ప్యాకేజ్‌లా కనిపిస్తుంది. రెట్రో లుక్‌తో పాటు ఆధునిక రైడింగ్‌ అనుభూతి కోరుకునే తెలుగు రాష్ట్రాల బైక్‌ ప్రియులకు ఇది ఓ మంచి ఎంపికగా నిలుస్తుంది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.