First Barrier-Free Toll System in Inida: జాతీయ రహదారులపై ప్రయాణించే వారికి టోల్ ప్లాజాల వద్ద ఎదురయ్యే ట్రాఫిక్ జామ్‌లు, సిబ్బందితో వాగ్వాదాలు నిత్యకృత్యం. ఈ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా కేంద్ర ప్రభుత్వం ఓక వినూత్న ముందగుడు వేసింది. గుజరాత్‌లోని సూరత్-భరూచ్ సెక్షన్‌లో ఉన్న చోర్యాసి టోల్ ప్లాజా వద్ద దేశంలోని తొలి మల్టీ లేన్ ఫ్రీ ఫ్లో టోల్ సిస్టమ్‌ను అధికారికంగా అందుబాటులోకి తీసుకొచ్చింది.
గతంలో ఉన్న టోల్ ప్లాజాలు మాదిరిగా ఇక్కడ వాహనాలను ఆపడానికి గేట్లు ఉండవు. వాహనదారులు తమ ప్రయాణ వేగాన్ని తగ్గించాల్సిన అవసరం లేకుండానే టోల్ కేంద్రాలను దాటి వెళ్లొచ్చు. ప్రయాణికుల సమయాన్ని ఆదా చేయడం, ఇంధన వినియోగాన్ని తగ్గించడం, హైవేలపై నిరంతరాయ వాహన ప్రవాహాన్ని నిర్ధారించడం ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశం.
Also Read: లో స్కోరింగ్ థ్రిల్లర్ లో జీటీ ఈజీ విక్టరీ.. శుభమాన్ గిల్ కెప్టెన్ ఇన్నింగ్స్.. రాణించిన అర్షద్, రషీద్, ఆర్సీబీకి షాక్
ఈ బారియల్ లెస్ వ్యవస్థ పూర్తిగా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పని చేస్తుంది. రహదారిపై ఏర్పాటు చేసిన భారీ ఓవర్ హెడ్ మెటల్ స్ట్రక్చర్‌కు వివిధ రకాల పరికరాలను అమర్చారు.
హై స్పీడ్ ఆర్‌ఎఫ్‌ఐడీ రీడర్లు వాహనం గంటు 150 కిలోమీటర్లు వేగంతో వెళ్తున్నప్పటికీ, దానిపై ఉన్న ఫాస్టాగ్ సమాచారాన్ని కచ్చితంగా గుర్తించగలవు. వాహనం ఆ మెటల్ స్ట్రక్చర్ కింద నుంచి వెళ్లిన వెంటనే, సెన్సార్లు దానిని గుర్తించి, టోల్ మొత్తాన్ని సంబంధిత ఫాస్టాగ్ ఖాతా నుంచి తక్షణమే మినహాయిస్తాయి. ఒక వేళ ఏదైనా కారణంతో ఫాస్టాగ్ రీడర్ పని చేయకపోతే, పైన అర్చిన ఆటోమేటిక్ నెంబర్ ప్లేట్ రికగ్నిషన్ కెమెరాలు రంగంలోకి దిగుతాయి. ఇవి వాహనం రిజిస్ట్రేన్ నెంబర్‌ను ఫొటో తీసి దానిని ప్రభుత్వ వాహన్ డేటాబేస్‌తో సరిపోల్చుతాయి. నెంబర్‌కు అనుసంధించిన ఫాస్టాగ్ నుంచి టోల్ వసూలు చేస్తుంది.
Also Read: కోట్లు విలువ చేసే మెర్సిడెస్ బెంజ్ వి-క్లాస్ లో కార్తీక్ ఆర్యన్ షికారు.. లగ్జరీ కార్ల కలెక్షన్ లో మరో డైమండ్.. స్టైల్ కు కంఫర్ట్ తోడైతే..
ఈ వ్యవస్థ ఎంత సౌకర్యవంతంగా ఉంటుందో, నిబంధనల విషయంలో అంతే కఠినంగా ఉంటుంది. ఒక వేల వాహనానికి ఫాస్టాగ్ లేకపోయినా లేదా ఫాస్టాగ్ ఖాతాలో నిధులు లేకపోయినా, ఈ వ్యవస్థ దానిని ఉల్లంఘనగా పేర్కొంటారు. ఏఎన్‌పీఆర్ కెమెరాల ద్వారా సేకరించిన సమాచారం ఆధారంగా, సదరు వాహన యజమానికి నేరుగా ఛలాన్ జారీ అవుతుంది. ఎన్‌హెచ్‌ఏఐ రూల్స్ ప్రకారం జరిమానాలు విధిస్తారు.
Also Read: మైలేజ్ ఇచ్చే బెస్ట్ మిడ్ సైజ్ ఎస్‌యూవీలు ఇవే! లీటర్ కు 28 కిమీ ఇచ్చే హైబ్రిడ్ కార్ల లిస్ట్
ఈ ప్రాజెక్టు ప్రయోగాత్మక దశలో ఉన్నప్పుడు కొన్ని భద్రతా పరమైన ఆందోళనలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న నిఘా కెమెరాల వినియోగంపై అనుమానాలు తలెత్తాయి. దీనిని పరిష్కరించడానికి, భారత ప్రభుత్వం ఏప్రిల్ 2025 నుంచి కఠినమైన సైబర్ సెక్యూరిటీ రూల్స్ అమలులోకి తెచ్చింది.
ఈ కొత్త నిబంధనల ప్రకారం, ఇంటర్నెట్‌తో అనుసంధానించిన ప్రతి కెమెరాను ప్రభుత్వం గుర్తింపు పొందిన ప్రయోగశాలల్లో కఠినమైన పరీక్షలు చేపట్టింది. కెమెరాలోని హార్డ్‌వేర్, ఇంటర్నల్ ఫర్మ్‌వేర్, అవసరమైతే వాటిని ఒరిజినల్ సోర్స్ కోడ్‌ను కూడా నిపుణులు తనిఖీ చేస్తారు. ఎలాంటి డేటా లీకేజీలు లేవని నిర్ధారించుకున్న తర్వాతే ఈ పరికరాలను హైవేలపై అమర్చడానికి అనుమతిస్తారు.
Also Read: వేసవిలో పొరపాటున కూడా ఈ వస్తువులను కారు ఉంచొద్దు.. చిన్న తేడావచ్చినా అంతా బూడిదే
ప్రస్తుతం గుజరాత్‌లోని కామ్రేజ్ వద్ద ఉన్న చోర్యాసి ప్లాజాలో ఇండియన్ హైవేస్ మేనేజ్‌మెంట్ కంపెనీ లిమిటెడ్‌్ ఐసీఐసీఐ బ్యాంక్ సహకారంతో ఈ వ్యవస్థను అమలు చేస్తోంది. ఈ పైలట్ ప్రాజెక్టు నుంచి వచ్చే స్పందన, పని తీరును విశ్లేషించిన తర్వాత, దశలవారీగా దేశంలోని ఇతర ప్రధాన రహదారులకు కూడా ఈ బారియర్‌లెస్ టోల్ వ్యవస్థను విస్తరించాలని NHAI భావిస్తోంది.
ఈ టెక్నాలజీ అందుబాటులోకి రావడం వల్ల భవిష్యత్‌లో భారతీయ రోడ్లు ప్రపంచ స్థాయి ప్రమాణాలను అందుకోనున్నాయి. ప్రయాణికులు టోల్ ప్లాజాల వద్ద నిమిషాల తరబడి వేచి చూడాల్సిన అవసరం లేకుండా సాఫీగా తమ గమ్యస్థానాలకు చేరుకోవచ్చు.
