ఇండియాలో ఎలక్ట్రిక్ వాహన రంగం 2026లో కొత్త పుంతలు తొక్కనుంది. కేవలం రేంజ్ మాత్రమే కాకుండా డిజైన్, టెక్నాలజీ, బ్యాటరీ సబ్‌స్క్రిప్షన్ వంటి సరికొత్త ప్లాన్లతో కంపెనీలు సిద్ధమవుతున్నాయి. సిటీ హ్యాచ్‌బ్యాక్‌లు, కాంపాక్ట్ ఎస్‌యూవీలు, ఫ్యామిలీ ఎంపీవీల విభాగంలో రాబోతున్న టాప్ 10 ఎలక్ట్రిక్ కార్ల వివరాలు ఇప్పుడు చూద్దాం.

Continues below advertisement

టాటా సియెర్రా ఈవీ (Tata Sierra EV)పాత జ్ఞాపకాలను గుర్తు చేస్తూ వస్తున్న సియెర్రా ఈవీ 2026 మే నెలలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఇది హారియర్ ఈవీ కంటే తక్కువ ధరలో లభిస్తుంది. రెట్రో-మోడరన్ డిజైన్, ఎల్‌ఈడీ లైట్ బార్, క్లోజ్డ్ ఫ్రంట్ ఫాసియాతో చాలా స్టైలిష్‌గా ఉండనుంది. ఇందులో రెండు బ్యాటరీ ఆప్షన్లతో పాటు ఆల్-వీల్ డ్రైవ్ (AWD) సదుపాయం కూడా ఉండే అవకాశం ఉంది.

టాటా టియాగో ఈవీ ఫేస్‌లిఫ్ట్టాటా తన మోస్ట్ అఫర్డబుల్ ఈవీని కొత్త లుక్‌తో తీసుకొస్తోంది. షార్పర్ ఎల్‌ఈడీ హెడ్ ల్యాంప్స్, కొత్త బంపర్, పెద్ద ఇన్ఫోటైన్‌మెంట్ డిస్‌ప్లే ఇందులో ప్రధాన ఆకర్షణ. ఇందులో పంచ్ ఈవీలో ఉన్న 30 kWh బ్యాటరీని ప్రవేశపెట్టే అవకాశం ఉంది. దీనివల్ల సిటీ డ్రైవింగ్‌లో మైలేజ్ మెరుగుపడుతుంది.

Continues below advertisement

విన్‌ఫాస్ట్ ఎంపీవీ 7 (VinFast MPV 7)వియత్నాం బ్రాండ్ విన్‌ఫాస్ట్ ఏప్రిల్ 15, 2026న తన ఎంపీవీ 7ను లాంచ్ చేయనుంది. మూడు వరుసల సీటింగ్, ప్రీమియం లెదర్ ఇంటీరియర్, 60.1 kWh బ్యాటరీతో ఇది ఫ్యామిలీస్ కోసం పర్ఫెక్ట్ ఛాయిస్. ఇది 150 bhp పవర్, 280 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

టయోటా అర్బన్ క్రూయిజర్ ఎబెల్లా (Toyota Urban Cruiser Ebella)టయోటా నుండి వస్తున్న ఈ ఫస్ట్ మాస్ మార్కెట్ ఈవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇందులో 49 kWh (440 కి.మీ రేంజ్), 61 kWh (543 కి.మీ రేంజ్) అనే రెండు బ్యాటరీ ఛాయిస్‌లు లభిస్తాయి. జేబీఎల్ ఆడియో సిస్టమ్, పనోరమిక్ గ్లాస్ రూఫ్ వంటి లగ్జరీ ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

టాటా అవిన్యా (Tata Avinya)టాటా నుండి వస్తున్న ప్రీమియం క్రాస్ ఓవర్ ఎస్‌యూవీ ఇది. 80 kWh పెద్ద బ్యాటరీతో లాంగ్ రేంజ్ ప్రయాణాలకు ఇది అనువుగా ఉంటుంది. దీని ఫ్యూచరిస్టిక్ డిజైన్, విశాలమైన క్యాబిన్ కస్టమర్లను ఆకట్టుకోనున్నాయి. ఇది 2026 చివర్లో మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది.

కియా సైరోస్ ఈవీ (Kia Syros EV)కియా తన అత్యంత చౌకైన ఈవీగా సైరోస్‌ను రూపొందిస్తోంది. బాక్సీ డిజైన్, 12.3 ఇంచ్ డ్యూయల్ స్క్రీన్స్, పనోరమిక్ సన్‌రూఫ్ దీని ప్రత్యేకతలు. దీని ధర రూ. 15-20 లక్షల మధ్య ఉండే అవకాశం ఉంది.

విన్‌ఫాస్ట్ వీఎఫ్3 (VinFast VF3)బడ్జెట్ ధరలో సిటీ కారు కావాలనుకునే వారి కోసం వీఎఫ్3 వస్తోంది. 18.64 kWh బ్యాటరీతో 215 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. చిన్న సైజులో ఉండటం వల్ల సిటీ ట్రాఫిక్‌లో సులభంగా నడపవచ్చు.

హోండా 0 ఆల్ఫా (Honda 0 Alpha)హోండా తన నెక్స్ట్ జనరేషన్ ఈవీ టెస్టింగ్ రాజస్థాన్‌లో ప్రారంభించింది. ఇది సాఫ్ట్‌వేర్ ఆధారిత ఫీచ‌ర్లు, ఫ్యూచరిస్టిక్ డిజైన్‌ను కలిగి ఉంటుంది. 2027లో అఫీషియల్ లాంచ్ కంటే ముందే 2026లో దీనిపై క్లారిటీ రానుంది.

విన్‌ఫాస్ట్ లిమో గ్రీన్ (VinFast Limo Green)ఇది ప్రధానంగా కమర్షియల్, ఫ్లీట్ అవసరాల కోసం వస్తోంది. క్యాబిన్ స్పేస్, తక్కువ నిర్వహణ ఖర్చు దీని మెయిన్ అడ్వాంటేజెస్ గా విశ్లేష‌కులు పేర్కొంటున్నారు.

మహీంద్రా బిఇ.07 (Mahindra BE.07)మహీంద్రా కొత్త ఇంగ్లో (INGLO) ప్లాట్‌ఫామ్‌పై ఇది తయారవుతోంది. 59 kWh, 79 kWh బ్యాటరీ ప్యాక్‌లతో 2027 ఆరంభంలో ఇది మార్కెట్లోకి అడుగుపెట్టనుంది.