Petrol Excise Duty News | కేంద్ర ప్రభుత్వం వాహనదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఇథనాల్ కలిపిన పెట్రోల్‌పై విధించే ఎక్సైజ్ డ్యూటీని (Excise Duty) రద్దు చేసింది. అంటే ఇకపై 22 శాతం నుండి 30 శాతం ఇథనాల్ కలిగిన పెట్రోల్‌పై ఎక్సైజ్ డ్యూటీ విధించదు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఇథనాల్‌తో కూడిన చౌక పెట్రోల్‌కు డిమాండ్ పెరిగితే, సామాన్య ప్రజలతో పాటు రైతులకు కూడా ప్రయోజనం కలుగుతుంది. ప్రధానంగా చెరకు, మొక్కజొన్న, పాడైపోయిన ధాన్యం నుంచి ఇథనాల్ ఉత్పత్తి జరుగుతుంది.

Continues below advertisement

అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర ఎంతగానో పెరుగుతోందని, ప్రస్తుతం ఇది బ్యారెల్‌కు 114 డాలర్లకు చేరుకుందని గమనించాలి. దీని ప్రభావం వల్ల దిగుమతి బిల్లు పెరుగుతోంది. ఈ పరిస్థితుల్లో భారత్‌లోకి ముడి చమురు దిగుమతులను తగ్గించడానికి, రూపాయి విలువను మెరుగుపరచడానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఇంధనాలపై ఫోకస్ చేస్తోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసే ప్రకటనలతో ప్రపంచ వ్యాప్తంగా ముడి చమురు ధరలపై ప్రతికూల ప్రభావం ఉంటుంది.

ఎక్సైజ్ డ్యూటీ అంటే ఏమిటి?ఎక్సైజ్ డ్యూటీ అనేది ఒక పరోక్ష పన్ను. ఇది దేశం లోపల తయారయ్యే లేదా ఉత్పత్తి చేసే వస్తువులపై విధిస్తారు. ఈ ఎక్సైజ్ డ్యూటీని ప్రత్యేకంగా మద్యం, పొగాకు, పెట్రోలియం వంటి ఉత్పత్తులపైనే విధిస్తారు.

Continues below advertisement

Also Read: దేశంలో అత్యంత చవకైన MG Comet EVపై 80 వేలు డిస్కౌంట్.. ఫుల్ ఛార్జ్‌తో 230 KM రేంజ్‌

ఎక్సైజ్ డ్యూటీని తగ్గించేందుకు నిబంధనలుకేంద్ర ప్రభుత్వం జారీ చేసిన కొత్త ఆదేశాల ప్రకారం ఇకనుంచి 22 శాతం, 25%, 27%, 30 శాతం (E22, E25, E27, E30) ఇథనాల్ మిశ్రమం కలిగిన పెట్రోల్‌పై ఎక్సైజ్ డ్యూటీని రద్దు చేశారు. అయితే ఈ నిర్ణయంలో ఉన్న ఏకైక నిబంధన ఏమిటంటే, ఈ ఇంధనం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) నిబంధనలు, ప్రమాణాలకు అనుగుణంగా తయారు చేసి ఉండాలి.

ఏ ఇంధనం చౌకైనది.. E85 లేదా E20?భారత్2లో E20 అంటే 20 శాతం ఇథనాల్ మిశ్రమ పెట్రోల్‌ను కేంద్రం ప్రోత్సహిస్తోంది. అయితే అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న ఒడిదొడుకుల మధ్య దేశంలో ఆర్థిక పరిస్థితిని సురక్షితంగా ఉంచడానికి కేంద్రం E85 ఇంధనాన్ని కూడా మార్కెట్లోకి విడుదల చేసింది. E85 ఇంధనంలో 85 శాతం ఇథనాల్, మిగతా 15 శాతం పెట్రోల్ ఉంటుంది. E85 ఇంధనం, E20 కంటే లీటరుకు రూ. 20 చౌకగా లభిస్తుంది. 

Also Read: Bike Reserve: రిజర్వ్‌ పడ్డాక మీ బైక్‌ ఎంత దూరం వెళ్తుంది.. దీనివల్ల ఇంజిన్‌‌కు నష్టమా ? 

అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్ దేశాల మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలతో ఒకనొక దశలో ముడి చమురు ధరలు దాదాపు రెట్టింపు అయ్యాయి. సీజ్ ఫైర్ ప్రకటించిన తరువాత సైతం అమెరికా, ఇరాన్ మధ్య దాడులు కొనసాగుతున్నాయి. ఇజ్రాయెల్ సైతం ఇరాన్‌తో మళ్లీ గిల్లిగజ్జాలు మొదలుపెట్టడంతో ప్రతీకార దాడులు చేస్తోంది. హర్మూజ్ జలసంధి మూసివేత, నౌకల రాకపోకలకు ఇరాన్ అంతరాయం కలిగించడంతో ముడి చమురు ధరలు అమాంతం పెరిగిపోవడం పలు దేశాలపై ప్రతికూలా ప్రభావం చూపుతున్నాయి.