భారత ఆటోమొబైల్ రంగం ఒక సరికొత్త టెక్నాలజీ వైపు అడుగులు వేస్తోంది. దేశంలో డ్రైవింగ్ భద్రతను పెంపొందించేందుకు, రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం మోడ్రన్ వాహన భద్రతా సాంకేతికతలకు (Advanced Safety Technologies) ఇటీవల ఆమోదం తెలిపింది.

Continues below advertisement

భారత ఆటో పరిశ్రమ ఒక కొత్త విధానం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటివరకు కేవలం విదేశీ మార్కెట్లలో లేదా భవిష్యత్తుకు సంబంధించిన టెక్నాలజీని చూశారు. భారత్‌లోనూ ఈ రంగంలో వేగంగా మార్పులు చోటుచేసుకుంటున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఆటానమస్ (స్వయం చాలిత), స్మార్ట్ డ్రైవింగ్ సిస్టమ్స్ దిశగా ఒక పెద్ద అడుగుగా భావించే మోడ్రన్ వెహికల్ సేఫ్టీ టెక్నాలజీకి ఆమోదం తెలిపింది. దీని తర్వాత, రాబోయే కాలంలో భారత్‌లో రోడ్లపై స్వయంగా నడిచే కార్లు కనిపించవచ్చా అని హాట్ టాపిక్ అవుతోంది. 

పూర్తిగా సెల్ఫ్ డ్రైవింగ్ కార్ల కాలం ఇంకా చాలా దూరంలో ఉన్నప్పటికీ, ఈ కొత్త ఆమోదం ఆ దిశగా రూట్ క్లియర్ చేసింది. ఆధునిక భద్రతా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం వల్ల డ్రైవింగ్ ఎక్స్‌పీరియన్స్ మెరుగుపడటమే కాకుండా, రోడ్డు ప్రమాదాలను తగ్గించడంలో కూడా సహాయపడుతుందని నిపుణులు భావిస్తున్నారు. అందుకే ఈ నిర్ణయం భారత ఆటో రంగానికి అత్యంత కీలకమైనదిగా భావించవచ్చు. 

Continues below advertisement

Also Read: Best Scooters: రోజూ ఆఫీసుకు వెళ్లే వారికి ఈ 4 స్కూటర్లు బెస్ట్, మీకు ఏది సెట్ అవుతుంది

అటానమస్ వెహికల్ సాంకేతికత అంటే ఏమిటి? ఆటోనమస్ వెహికల్ (Autonomous Vehicle) సాంకేతికత అనేది అనేక సెన్సార్లు, కెమెరాలు, రాడార్, సాఫ్ట్‌వేర్ సహాయంతో కారు తన చుట్టుపక్కల వాతావరణాన్ని అర్థం చేసుకునే వ్యవస్థ. ఈ సాంకేతికత వాహనాన్ని నిర్ణీత లేన్‌లో ఉంచడానికి, ముందు వెళ్తున్న వాహనం నుండి సురక్షితమైన దూరాన్ని మెయింటైన్ చేయడానికి, ముందుగా ప్రమాదాలను గుర్తించడానికి సహాయపడుతుంది. ప్రస్తుతం భారత్‌లో ఆమోదం పొందుతున్న టెక్నాలజీ పూర్తిగా సెల్ఫ్ డ్రైవింగ్ కానప్పటికీ, అవి అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (Advanced Driver Assistance System) అంటే ADAS లో భాగం.

వీటిలో ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్, లేన్ కీప్ అసిస్ట్, డ్రైవర్ అలర్ట్ వంటి ఫీచర్లు ఉండవచ్చు. ఈ టెక్నాలజీల ముఖ్య ఉద్దేశం డ్రైవర్‌కు సహాయం చేయడం, అదే సమయంలో ప్రమాదాల ముప్పును తగ్గించడం. ప్రపంచంలోని అనేక దేశాలలో ఈ సాంకేతికత అందుబాటులోకి తెచ్చారు. భారత్ కూడా ఈ దిశగా ముందుకు సాగుతున్నట్లు కనిపిస్తోంది.

వినియోగదారుల కోసం ఏం మారవచ్చు?కేంద్రం ఈ కొత్త ఆమోదం తర్వాత, వాహన తయారీ సంస్థలు దేశంలో మరిన్ని సాంకేతికత కలిగిన కార్లను పరిచయం చేయడానికి ఉత్సాహంగా ఉంటాయి. రాబోయే సంవత్సరాల్లో వినియోగదారులు మునుపెన్నడూ లేనంత ఎక్కువ భద్రత,  సౌకర్యవంతమైన వాహనాలను చూడవచ్చు. ADAS వంటి సాంకేతికత ఇప్పుడు కేవలం లగ్జరీ కార్లకే పరిమితం కాలేదు. అనేక కంపెనీలు దీనిని మాస్ మార్కెట్ మోడల్స్‌లో కూడా చేర్చడం ప్రారంభించాయి. దీనివల్ల సామాన్య వినియోగదారులకు సైతం ఆధునిక సేఫ్టీ ఫీచర్ల ప్రయోజనం చేకూరనుంది.

Also Read: మారుతి ఫ్రాంక్స్‌ జోరు మామూలుగా లేదుగా.. కేవలం 3 సంవత్సరాల్లోనే 5 లక్షల అమ్మకాలు!

భవిష్యత్తులో స్మార్ట్ మొబిలిటీ, కనెక్టెడ్ కార్లు, ఆటోనమస్ డ్రైవింగ్ టెక్నాలజీ భారత ఆటో మార్కెట్ ను నడిపిస్తాయని  నిపుణులు భావిస్తున్నారు. అయితే, పూర్తిగా స్వయంగా నడిచే కార్ల కోసం ఇంకా మౌలిక సదుపాయాలు, రూల్స్,  టెక్నాలజీ సన్నద్ధతపై చాలా పని చేయాలి. ఈ నిర్ణయం భారత భవిష్యత్తు మొబిలిటీ దిశగా ఒక ముఖ్యమైన అడుగు వేసేందుకు అవకాశంగా మలుచుకుంటారు.