Best Scooters for Daily Usage | జనాభా పెరుగుదలతో పలు నగరాల్లో ప్రతిరోజూ ఆఫీసుకు వెళ్లడం చాలా మందికి ఒక సవాలుగా మారింది. మెట్రోలో రద్దీ, బస్సుల కోసం వెయిటింగ్, ట్రాఫిక్ సమస్యలు తరచుగా మీ ప్రయాణాన్ని అలసిపోయేలా చేస్తాయి. ఈ పరిస్థితిలో ఒక మంచి స్కూటర్ రోజువారీ ప్రయాణాన్ని తేలిక చేస్తుంది. మీ జర్నీని సౌకర్యవంతంగా మార్చగలదు. ముఖ్యంగా ఉద్యోగం చేసే వారికి స్కూటర్ అనేది సౌకర్యవంతంగా, త్వరగా ఆఫీసుకు వెళ్లడం, ఇంటికి తిరిగి వచ్చేందుకు హెల్ప్ అవుతుంది. 

Continues below advertisement

మార్కెట్లో అద్భుతమైన మైలేజ్, సౌకర్యవంతమైన సీటు, నమ్మకమైన పనితీరుతో ఫేమస్ అవుతున్న అనేక స్కూటర్లు అందుబాటులో ఉన్నాయి. ఇందువల్లే ప్రజలు ఇప్పుడు పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ కు బదులుగా సొంత వాహనాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఒకవేళ మీరు కూడా రోజువారీ ఆఫీస్ జర్నీ కోసం టూవీలర్ కోసం చూస్తున్నట్లయితే, కొన్ని మోడళ్లు మీకు అద్భుతమైన ఎంపికలుగా అవుతాయి. 

మైలేజ్, కంఫర్ట్ విషయంలో ఈ స్కూటర్లు ముందున్నాయిఆఫీసుకు వెళ్లే వారిలో హోండా యాక్టివా (Honda Activa) ప్రజాదరణ అలాగే కొనసాగుతోంది. దీని సులువైన రైడింగ్, నమ్మకమైన ఇంజన్, తక్కువ మెయింటెనెన్స్ దీనిని ప్రత్యేకంగా నిలిపాయి. అదే సమయంలో టీవీఎస్ జుపిటర్ (TVS Jupiter) కూడా సౌకర్యవంతమైన సీటు, మంచి మైలేజీతో ఫేమస్ అయింది. సిటీ ట్రాఫిక్‌లో దీని రైడ్ క్వాలిటీ బాగుంటుందని చెబుతారు.

Continues below advertisement

Also Read: మారుతి ఫ్రాంక్స్‌ జోరు మామూలుగా లేదుగా.. కేవలం 3 సంవత్సరాల్లోనే 5 లక్షల అమ్మకాలు!

సుజుకి యాక్సెస్ 125 (Suzuki Access 125) కూడా ఈ జాబితాలో పోటీదారుగా ఉంది. దీని ఇంజన్ స్మూత్ పర్ఫార్మెన్స్ తో వాహనదారులకు ఆకర్షిస్తోంది. దీర్ఘకాలిక నమ్మకానికి కొందరు ఇది కొంటున్నారు. ఇవే కాకుండా యమహా ఫాసినో (Yamaha Fascino) కూడా దాని ఆకర్షణీయమైన డిజైన్, మెరుగైన మైలేజ్ కారణంగా యువతను అట్రాక్ట్ చేస్తుంది. ఈ స్కూటర్లన్నీ మీ రోజువారీ ప్రయాణాన్ని తేలిక చేయడంతో పాటు జేబుపై కూడా ఎక్కువ భారం లేకుండా చేస్తాయి. 

స్కూటర్ల డిమాండ్ ఎందుకు పెరుగుతోంది?ఈ రోజుల్లో స్కూటర్ అనేది కేవలం ఒక సాధారణ వాహనం మాత్రమే కాదు. ఇది మీ టైం ఆదా చేయడానికి, సమయానికి చేరుకునేలా చేయడం, జర్నీ సౌకర్యవంతంగా మార్చుకోవడానికి చాలా అవసరం. స్కూటర్ సహాయంతో తమకు నచ్చిన సమయానికి పని మీద బయలుదేరవచ్చు. రద్దీగా ఉండే పబ్లిక్ ట్రాన్స్‌పోర్టుపై ఆధారపడాల్సిన అవసరం ఉండదు. ఆధునిక స్కూటర్లలో డిజిటల్ డిస్‌ప్లే, మెరుగైన స్టోరేజ్ స్పేస్, స్మార్ట్ ఫీచర్లు, సౌకర్యవంతమైన సస్పెన్షన్ వంటి  ఫీచర్లు కూడా లభిస్తున్నాయి.

Also Read: Car Accessories: అల్లాయ్ వీల్స్ నుంచి డ్యాష్‌క్యామ్ వరకు - కారుకు ఏ యాక్సెసరీస్‌ సేఫ్? వేటికి వారంటీ వర్తించదు?

తక్కువ ఇంధన ఖర్చు, ఈజీ మెయింటెనెన్స్ వీటిని మరింత ఆకర్షణీయంగా మారుస్తున్నాయి. భవిష్యత్తులో సిటీ రోడ్లపై వ్యక్తిగత వాహనాల డిమాండ్ మరింత పెరుగుతుందని ఆటో నిపుణులు భావిస్తున్నారు. ఈ పరిస్థితిలో ఒక మంచి స్కూటర్ రోజువారీ ప్రయాణాన్ని వేగంగా, పొదుపుగా మార్చగలదు. మీరు ఆఫీసుకు వెళ్లిరావడానికి ఒక నమ్మకమైన ఆప్షన్ కోసం వెతుకుతుంటే, ఈ స్కూటర్లలో మీకు నచ్చింది చెక్ చేసి కొనుగోలు చేయడం బెటర్.