India Vehicle Sales Record Massive Growth:  ఇండియ‌న్ ఆటోమొబైల్ మార్కెట్ గత ఆర్థిక సంవత్సరం ఎఫ్‌వై2025-26 లో అద్భుతమైన వృద్ధిని నమోదు చేసింది. ఈ లీగ్ లో అన్ని సెగ్మెంట్లను కలుపుకుని మొత్తం వాహనాల అమ్మకాలు దాదాపు 2.83 కోట్ల యూనిట్లకు చేరాయి. సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్స్ (SIAM) విడుదల చేసిన లేటెస్ట్ డేటా ప్రకారం ఈ ఆర్థిక సంవత్సరంలో దేశంలో సగటున ప్రతి నిమిషానికి దాదాపు 54 వాహనాలు అమ్ముడయ్యాయి. టూ-వీలర్స్ ఎప్పటిలాగే మార్కెట్లో అత్యధిక వాటాను సొంతం చేసుకోగా ప్యాసింజర్ వెహికల్స్, త్రీ-వీలర్స్, కమర్షియల్ వాహనాలు కూడా మంచి నంబర్లను నమోదు చేశాయి.

Continues below advertisement

Read Also: New Ethanol Blending Standards: ఇండియాలో ఇంధన విప్లవం - కొత్త ఇథనాల్ బ్లెండింగ్ ప్రమాణాలను నోటిఫై చేసిన కేంద్రం 

టూ-వీలర్ రంగంలో ఉత్తర ప్రదేశ్ టాప్.. 

Continues below advertisement

దేశీయ వాహనాల అమ్మకాల వాల్యూమ్‌లో టూ-వీలర్ సెగ్మెంట్ ఎఫ్‌వై26 లో 2.17 కోట్ల యూనిట్ల విక్రయాలతో అతిపెద్ద కాంట్రిబ్యూటర్‌గా నిలిచింది. ముఖ్యంగా ఉత్తర, పశ్చిమ రాష్ట్రాల్లో వీటికి భారీ డిమాండ్ కనిపించింది. ఉత్తర ప్రదేశ్ దేశంలోనే అత్యధికంగా 31.8 లక్షల టూ-వీలర్ల అమ్మకాలతో మొదటి స్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్, కర్ణాటక ఉన్నాయి. ప్యాసింజర్ వాహనాల (కార్ల) కేటగిరీలో దేశంలోనే అత్యధికంగా 5.64 లక్షల యూనిట్ల సేల్స్ తో మహారాష్ట్ర నంబర్ వన్ మార్కెట్‌గా అవతరించింది. రీజియన్ పరంగా చూస్తే పశ్చిమ భారతదేశం మొత్తం 15.28 లక్షల కార్ల విక్రయాలతో లీడింగ్‌లో ఉంది అని నిపుణులు పేర్కొంటున్నారు. 

Read Also: Handbrake Tips: హ్యాండ్ బ్రేక్ వేసినా మీ కారు వాలు ప్రదేశంలో జారుతుందా? అందుకు కారణాలు ఇవే 

కమర్షియల్ వాహనాల సేల్స్..

గత ఆర్థిక సంవత్సరంలో ప్యాసింజర్ వెహికల్స్ మొత్తం అమ్మకాలు 46.43 లక్షల యూనిట్లుగా నమోదయ్యాయి. మరోవైపు త్రీ-వీలర్ల సేల్స్ 8.36 లక్షల యూనిట్లకు చేరుకున్నాయి. త్రీ-వీలర్ సెగ్మెంట్ లో కూడా ఉత్తర ప్రదేశ్ దాదాపు 99,000 వాహనాల అమ్మకాలతో అగ్రస్థానంలో నిలవగా, గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, బిహార్ తదుపరి స్థానాల్లో నిలిచాయి. కమర్షియల్ వాహనాల (సీవీ) సెగ్మెంట్ విషయానికి వస్తే దేశవ్యాప్తంగా 10.80 lakhs యూనిట్ల విక్రయాలు జరిగాయి. ఈ రకమైన వాణిజ్య వాహనాల అమ్మకాల్లో మహారాష్ట్ర మళ్లీ 1.61 లక్షల యూనిట్లతో లీడింగ్ మార్కెట్‌గా నిలిచింది అని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 

మార్కెట్ వృద్ధికి ప్రధాన కారణాలు.. 

భారత ఆటోమొబైల్ రంగానికి ఎఫ్‌వై26 ఒక మైలురాయిగా నిలిచింది. గ్రామీణ ప్రాంతాల్లో పెరిగిన డిమాండ్, పండుగల సీజన్ లో వచ్చిన ఆఫర్లు, మెరుగైన ఎకనామిక్ కండిషన్స్ ఈ భారీ వృద్ధికి కారణమయ్యాయి. గుజరాత్, తమిళనాడు, ఉత్తర ప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలు కమర్షియల్ వెహికల్స్ సెగ్మెంట్‌లో కీలక పాత్ర పోషించాయి. దేశవ్యాప్తంగా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ పనులు వేగంగా జరగడం వల్ల కమర్షియల్ వాహనాలకు డిమాండ్ పెరిగింది. ఈ గణాంకాలు దేశంలో పెరుగుతున్న కొనుగోలు శక్తిని, ఆటోమొబైల్ పరిశ్రమ సాధిస్తున్న నిలకడైన ప్రగతిని స్పష్టం చేస్తున్నాయి.