India Notifies New Ethanol Blending Standards for E22 to E30: కేంద్ర ప్రభుత్వం.. తన ప్రతిష్టాత్మక ఇథనాల్ బ్లెండింగ్ ప్రోగ్రామ్‌ను మరింత వేగవంతం చేస్తూ ఈ22, ఈ25, ఈ27, ఈ30 ఇంధనాలకు సంబంధించిన క్వాలిటీ ప్రమాణాలను అధికారికంగా నోటిఫై చేసింది. సాధారణ పెట్రోల్ వాడకం నుండి ఫ్లెక్స్-ఫ్యూయల్ వాహనాల వైపు మళ్లడానికి పాలసీ మేకర్లు తీసుకున్న తదుపరి కీలక అడుగుగా ఇది నిలిచింది. అంతర్జాతీయంగా జియోపొలిటికల్ టెన్షన్లు, గ్లోబల్ ఎనర్జీ మార్కెట్‌లో ఒడిదొడుకులు ఉన్న సమయంలో ఈ నిర్ణయం రావడం ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది. ఇది ముడి చమురుపై విదేశీ డిపెండెన్సీని తగ్గించాలనే భారత్ బలమైన సంకల్పాన్ని ప్రతిబింబిస్తోంది.
Read Also: Tata Sierra SUVకు గట్టి పోటీ ఇవ్వనున్న Jeep Renegade.. దీని ధర, ఫీచర్లు చూసి కొనేయండి
అమల్లోకి వచ్చిన బీఐఎస్ నోటిఫికేషన్ ..
బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) జారీ చేసిన కొత్త నోటిఫికేషన్ ప్రకారం ఈ సరికొత్త ఇంధన ప్రమాణాలు మే 15, 2026 నుండి అధికారికంగా అమల్లోకి వచ్చాయి. పాజిటివ్ ఇగ్నిషన్ ఇంజన్ ఆధారిత వాహనాల్లో వాడే మోటార్ గ్యాసోలిన్, అన్‌హైడ్రస్ ఇథనాల్ మిశ్రమాల క్వాలిటీని ఈ నిబంధనలు క్రమబద్ధీకరిస్తాయి. సింపుల్‌గా చెప్పాలంటే ఇథనాల్ వాడకంలో తదుపరి స్టేజ్ ఎకోసిస్టమ్‌ను రెడీ చేయడానికి ఈ ఫ్యూయల్ క్వాలిటీ ఫ్రేమ్‌వర్క్ ఎంతో ఉపయోగపడుతుంది. ఈ ఇథనాల్ నార్మ్స్‌తో పాటు డిమెథైల్ ఈథర్ (DME) బ్లెండెడ్ ఎల్‌పీజీ ప్రమాణాలను, మరికొన్ని ఇండస్ట్రియల్ స్పెసిఫికేషన్లను కూడా బీఐఎస్ అప్‌డేట్ చేసింది.
Read Also: నష్టాల నుంచి రికవర్ అవుతున్న Ola Electric .. బ్యాటరీ ఉత్పత్తిపై ఫోకస్, దిగిరానున్న EV ధరలు
డిస్టిల్లర్స్ అసోసియేషన్ హర్షం..
కేంద్ర ప్రభుత్వ తాజా నిర్ణయాన్ని ఆల్ ఇండియా డిస్టిల్లర్స్ అసోసియేషన్ (AIDA) హృదయపూర్వకంగా స్వాగతించింది. ప్రస్తుత మార్కెట్లో ఉన్న మిగులు చక్కెర, ఇథనాల్ ప్రొడక్షన్ కెపాసిటీని సద్వినియోగం చేసుకోవడానికి ఈ నోటిఫికేషన్ పరిశ్రమకు మధ్యంతర ఉపశమనాన్ని ఇస్తుందని అసోసియేషన్ పేర్కొంది. ఆల్ ఇండియా డిస్టిల్లర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ విజేంద్ర సింగ్ మాట్లాడుతూ, ఇది ఒక ముఖ్యమైన మైలురాయి అయినప్పటికీ లాంగ్ టర్మ్ విజన్ కోసం ఈ85, ఈ100 లాంటి అధిక ఇథనాల్ మిశ్రమాల వైపు వేగంగా అడుగులు వేయాలని సూచించారు. దేశంలో కొత్తగా అందుబాటులోకి వస్తున్న ప్రొడక్షన్ కెపాసిటీని బట్టి చూస్తే ఇథనాల్ ప్రోగ్రామ్ ఫ్యూచర్ అనేది ఫ్లెక్స్-ఫ్యూయల్ మొబిలిటీపైనే ఆధారపడి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.
కాలుష్య నియంత్రణ..
ఫ్లెక్స్-ఫ్యూయల్ వాహనాలు (FFVs) దేశంలో ఇథనాల్ వినియోగాన్ని భారీగా పెంచడంలో, ఇంధన భద్రతను బలోపేతం చేయడంలో ట్రాన్స్‌ఫార్మేషనల్ రోల్ ప్లే చేస్తాయని విజేంద్ర సింగ్ అభిప్రాయపడ్డారు. ఇవి కాలుష్య ఉద్గారాలను తగ్గించడమే కాకుండా దేశీయ బయోఫ్యూయల్స్ మార్కెట్‌కు ఒక సస్టైనబుల్ ఎకోసిస్టమ్‌ను క్రియేట్ చేస్తాయని తెలిపారు. ఇథనాల్ బ్లెండింగ్ ప్రోగ్రామ్ కింద భారత్ ఇప్పటికే అద్భుతమైన ప్రగతిని సాధించింది. ఇప్పుడు ఈ22, ఈ30 ఫ్యూయల్ స్పెసిఫికేషన్ల రోలవుట్ ద్వారా ఇథనాల్ ఆధారిత మొబిలిటీ సొల్యూషన్లలో సరికొత్త అధ్యాయం మొదలుకానుంది.
