Indian Car Market Trends: భారతీయ కార్ల మార్కెట్‌లో ఒకప్పుడు సెడాన్లు అంటే ఎంతో ప్రతిష్ఠ, స్టేటస్‌కు సింబల్‌. Ambassador నుంచి Maruti Esteem వరకు, ఆ తర్వాత Honda City వరకు... సెడాన్‌ అంటే క్లాస్‌, కంఫర్ట్‌, లాంగ్‌-డ్రైవ్‌ రిఫైన్మెంట్‌. కానీ గత ఐదారు ఏళ్లలో ఈ సెగ్మెంట్‌ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. కొత్త SUVల దూకుడుతో సెడాన్‌ మార్కెట్‌ కుంచించుకుపోయింది.

Continues below advertisement

FY19 (2018-19) లో భారత ప్యాసింజర్‌ వాహనాల (PV) అమ్మకాలలో సెడాన్ల వాటా దాదాపు 19%. కానీ FY25 ‍‌(2024-25) కి వచ్చేసరికి ఈ షేర్‌ కేవలం 8-9% కి పడిపోయింది. అంటే ఒకప్పుడు ప్రధాన దళంగా ఉన్న సెడాన్లు ఇప్పుడు నిల్‌ సెగ్మెంట్‌గా మారిపోయాయి.

సెడాన్లను మోడల్‌-వైజ్‌గా చూస్తే పరిస్థితి ఇంకా క్లియర్‌గా అర్థమవుతుంది.

Continues below advertisement

Honda City - సెడాన్‌ల కింగ్‌‌గా పేరున్న ఈ మోడల్‌ FY25 లో కేవలం 10,901 యూనిట్లు మాత్రమే అమ్మగలిగింది. ఇది, గత సంవత్సరాల కంటే 35% తక్కువ.

Hyundai Verna - FY25 లో 15,593 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి. ఇది దాదాపు 48% తగ్గుదల.

Maruti Suzuki Ciaz - FY25 లో 8,402 యూనిట్లకు పడిపోయింది. ఇది 19% క్షీణత.

FY24 (2023-24) లో కూడా సెగ్మెంట్‌ మిడ్‌-సైజ్‌ సెడాన్ల స్థితి మరింత బలహీనంగా ఉంది.

Honda City అమ్మకాలు FY23 లో 35,038 యూనిట్లు. FY24 కి వచ్చేసరికి కేవలం 16,925 యూనిట్లు, ఇది దాదాపు 51.7% భారీ తగ్గుదల.

Maruti Suzuki Ciaz అమ్మకాలు కూడా FY23 లో 13,610 నుంచి FY24 లో 10,337 కు తగ్గాయి, ఇది 24% క్షీణత.

అయితే, ఈ డౌన్‌ఫాల్‌ మధ్య రెండు మోడళ్లు మాత్రం కొద్దిగా పెరుగుదల నమోదు చేశాయి, అవి - Hyundai Verna (51.8% YoY గ్రోత్‌), Volkswagen Virtus (19.8% గ్రోత్‌). అయినా FY25 మొదటి 7 నెలల్లో మొత్తం సెడాన్‌ సేల్స్‌ 12% తగ్గి 37,575 యూనిట్లకే పరిమితమయ్యాయి.

ఈ సమయంలో గ్రోత్‌ నమోదు చేసిన కార్లు వోక్స్‌వ్యాగన్‌ విర్టస్‌ (12,455 యూనిట్లు) & మారుతి సియాజ్‌ (4,521 యూనిట్లు) మాత్రమే.

సెగ్మెంట్‌ మొత్తాన్ని పరిశీలిస్తే, FY24 లో 3.8 లక్షల యూనిట్ల అమ్మకాలు జరగగా, FY25 లో ఇవి 3.41 లక్షలకు పడిపోయాయి, 10.3% క్షీణించాయి. SIAM డేటా ప్రకారం, సెడాన్ల మార్కెట్‌ షేర్‌ ఇప్పుడు మొత్తం PVలలో కేవలం 9%.

ఎందుకు ఈ భారీ పతనం?

1. SUV క్రేజ్‌: ఇండియన్‌ బయ్యర్స్‌ ఇప్పుడు హై గ్రౌండ్‌ క్లియరెన్స్‌, హై కమాండ్‌ డ్రైవింగ్‌ పొజిషన్‌, రోడ్‌ ప్రెజెన్స్‌ ఇవ్వగల SUVలను ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఫీచర్లు కూడా SUVల్లో అగ్రెసివ్‌గా వస్తున్నాయి.

2. కొత్త సెడాన్‌ లాంచ్‌లు తక్కువ: కొత్త మోడళ్లలో ఇన్వెస్ట్‌మెంట్‌ తగ్గడంతో ఈ సెగ్మెంట్‌కి ఫ్రెష్‌ అప్పీల్‌ తగ్గింది. FY25 లో కూడా పెద్దగా కొత్త సెడాన్లు రాలేదు - కొత్త మారుతి డిజైర్‌, హోండా అమేజ్‌ ఫేస్‌లిఫ్ట్‌ మాత్రమే.

3. బయ్యర్లు SUV లకు షిఫ్ట్‌ అవుతున్నారు: ఫ్లాగ్‌షిప్‌ సెడాన్లు కూడా తమ సొంత బ్రాండ్‌ SUVలకు కస్టమర్లను కోల్పోతున్నాయి.

ఇంట్రస్టింగ్‌గా, లగ్జరీ సెడాన్ల పరిస్థితి మాత్రం అంత దారుణంగా లేదు. BMW, Audi, Mercedes వంటి బ్రాండ్లకు సెడాన్లు ఇంకా 40% షేర్‌ ఇస్తున్నాయి. ఇవి వేరే రకం యూజర్‌ బేస్‌కి చెందినవి కావడంతో ఈ సెగ్మెంట్‌ అంతగా క్షీణించలేదు.

మొత్తంగా చూస్తే... ఇండియాలో సెడాన్‌ మార్కెట్‌ కేవలం స్లో కాదు, వేగంగా కుదేలవుతోంది. ఒకప్పుడు హిట్‌ మోడళ్లు కూడా ఇప్పుడు పాతాళానికి పడిపోయాయి. ఆటో కంపెనీలు ఈ సెగ్మెంట్‌లో మళ్లీ ఇన్వెస్ట్‌ చేయకపోతే, సెడాన్‌ల భవిష్యత్తు ఇంకా కుచించుకుపోవచ్చు.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.