ఒబెన్ కొత్త ఎలక్ట్రిక్ బైక్ మనదేశంలో మార్చి 15వ తేదీన లాంచ్ కానుంది. ఓబెన్ బెంగళూరుకు చెందిన ద్విచక్రవాహనాల తయారీ కంపెనీ. ఈ కంపెనీ రూపొందించిన మొదటి బైక్‌కు ‘రోర్ (Rorr)’ అని పేరు పెట్టింది. దీని టాప్ స్పీడ్ 100 కిలోమీటర్లుగా ఉంది. 0 నుంచి 40 కిలోమీటర్లకు కేవలం మూడు సెకన్లలోనే చేరనుంది.


దీని రేంజ్ 200 కిలోమీటర్లుగా ఉండనుంది. ఈ ఎలక్ట్రిక్ బైక్ ధర తక్కువగానే ఉండనుందని తెలుస్తోంది. దీని గురించి ఎక్కువ వివరాలు కంపెనీ తెలపలేదు. దీని బ్యాటరీ సామర్థ్యం 8.6 నుంచి 9 కిలోవాట్ల మధ్య ఉండే అవకాశం ఉంది. దీని డిజైన్ కూడా చూడటానికి స్పోర్ట్స్ లుక్ తరహాలో ఉంది.


అయితే దీని టాప్ స్పీడ్‌ను గంటకు 100 కిలోమీటర్లకు పరిమితం చేశారు. దీన్ని బట్టి ఇది ఒక ఎకనమికల్ ఎలక్ట్రిక్ మోటర్ సైకిల్ అనుకోవచ్చు. దీని ఫీచర్ల గురించి కూడా ఎక్కువ వివరాలు బయటకు రాలేదు. అయితే నడిపేవ్యక్తి బైక్‌కు స్మార్ట్ ఫోన్ కనెక్ట్ చేసుకోవడానికి యాప్‌ను అందించనున్నట్లు తెలుస్తోంది.


దీని ఉత్పత్తి కూడా బెంగళూరులోనే జరగనుంది. ప్రస్తుతం ఎలక్ట్రిక్ 2-వీలర్ మార్కెట్లో అవకాశం ఉంది. కాబట్టి కొత్త కంపెనీలు వస్తున్నాయి. కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లు, బైక్‌లు లాంచ్ అవుతున్నాయి. ఒబెన్ రోర్ ధర రూ.లక్ష రేంజ్‌లో ఉండే అవకాశం ఉంది.


దీని గురించి పూర్తి వివరాలు త్వరలో తెలిసే అవకాశం ఉంది. రెండు సంవత్సరాల్లో నాలుగు ఉత్పత్తులను లాంచ్ చేయడానికి ఒబెన్ ప్లాన్ చేస్తుంది. పెట్రోల్ ధరలు కొత్త రికార్డులను సృష్టించనున్నాయని వార్తలు వస్తున్న ఈ నేపథ్యంలో ద్విచక్రవాహన వినియోగదారులు వీటివైపు మొగ్గు చూపే అవకాశం ఉంది.


Also Read: Baleno Vs Swift: బలెనో వర్సెస్ స్విఫ్ట్ - బడ్జెట్ కార్లలో ఏది బెస్ట్!


Also Read: ఏకంగా మూడు కొత్త కార్లు లాంచ్ చేయనున్న జీప్ - అదిరిపోయే ఫీచర్లు - ధర కూడా తక్కువగానే!