India first solar powered car  Vayve Eva debuts at the Auto Expo 2025  :  కారు అంటే కనీసం పది లక్షలు పెట్టాలి.. దానికి బయటకు వెళ్లినప్పుడల్లా పెట్రోల్ లేకపోతే డీజిల్ తాగించాలి. ఇక మెయిన్‌టనెన్స్ సంగతి చెప్పాల్సిన పని లేదు. ఇంత భారం ఎందుకు ఇప్పుడు చాలా మంది ఎలక్ట్రిక్ కార్ల వైపు వెళ్తున్నారు. అర్బన్ మొబిలిటీలో ఇప్పుడు ఈ ఎలక్ట్రిక్ కార్లదే హవా. కానీ వీటి రేట్లు అందుబాటులో లేవు. అందుకే వీటన్నింటికీ పరిష్కారంగా సోలార్ కార్లు వచ్చేశాయి. ఆటో ఎక్స్ పోలో సోలార్ కార్ ను ప్రదర్శించారు.


న్యూఢిల్లీలో జరిగిన 2025 ఆటో ఎక్స్‌పోలో వేవ్ మొబిలిటీ భారతదేశపు మొట్టమొదటి సౌరశక్తితో నడిచే కారును ఆవిష్కరించారు.  ఈ కారు  కేవలం 5 సెకన్లలో 0-40 kmph వేగాన్ని అందుకుంటుదని కంపెనీ చెబుతోంది. స్మార్ట్‌ఫోన్ ఇంటిగ్రేషన్, ఓవర్-ది-ఎయిర్ (OTA) అప్‌డేట్‌లు, రిమోట్ మానిటరింగ్,  వెహికల్ డయాగ్నస్టిక్స్ కూడా ఉంటాయి. నిర్వహణ ఖర్చులు చాలా తక్కువగా ఉంటాయి. రోజుకు 35 కి.మీ కంటే తక్కువ దూరం ప్రయాణింటే వారికి.. కఇద్దరు చొప్పున కారులో ప్రయాణించే వారికి ఇది సరైన వాహనం.  వేవ్ మొబిలిటీ నిర్వహణ ఖర్చు కి.మీ.కు కేవలం  అర్థరూపాయి మాత్రమే ఉంటుందని చెబుతున్నారు. మార్కెట్లో ఉన్న అనేక ఎలక్ట్రిక్ వాహనాల కంటే ఈవా రేటు కూడా చాలా  తక్కువ.  





 ఎంజీ కంపెనీకి చెందిన కామెట్ పోటీ ఇస్తుంది. దానితో పోలిస్తే ఈ కారు ధర సగం కూడా ఉండదు. వేవ్ మొబిలిటీ సహ వ్యవస్థాపకుడు,  CEO నీలేష్ బజాజ్  ఈవా కేవలం కారు కాదని.. భవిష్యత్ లో కుటుంబ రవాణాను మార్చే వాహనమని అంటున్నారు.  దీని రేటు కూడా చాలా తక్కువ. బ్యాటరీతో వాయ్వే ఎవా కొనుగోలు చేయడానికి 3.99 లక్షలు (ఎక్స్-షోరూమ్) ఖర్చవుతుందని కంపెనీ చెబుతోంది.  పే-యాజ్-యు-గో బ్యాటరీ ₹3.25 లక్షల (ఎక్స్-షోరూమ్) తక్కువ ధరకు అందిస్తారు.  డెలివరీలు 2026 నాటికి ప్రారంభమవుతాయని కంపెనీ చెబుతోంది. 





 సోలార్ కార్ మార్కెట్లోకి వచ్చి ఆదరణ పెరిగితే..ఇక అన్ని కంపెనీలు అదే బాటలో నడిచే అవకాశం ఉంది. బ్యాటరీ ఖర్చు మాత్రమే ఉంటే.. దేశంలో కార్ల విప్లవం వస్తుందని అనుకోవచ్చు.  ఢిల్లీలో జరుగుతున్న ఆటో ఎక్స్ పోలో ఎన్నో వినూత్నమైన ఆవిష్కరణలను కంపెనీ చేపడుతోంది.                     


Also Read: భారత్ లో హోండా యాక్టివా e, QC1 ఎలక్ట్రిక్ స్కూటర్లు లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే