India EV Sales: భారతీయ ఎలక్ట్రిక్ వాహన (EV) మార్కెట్ చరిత్రలో అక్టోబర్ 2025 ఒక కీలకమైన నెలగా మారిపోయింది. ఓవైపు ఈవీపై పెరుగుతున్న ఆదరణ, మరోవైపు జీఎస్టీ స్లాబ్‌లలో వచ్చిన మార్పులు చేర్పులు కూడా మంచి ప్రభావం చూపాయి. అందుకే అక్టోబర్‌లో అమ్మకాలు భారీగా పెరిగాయి. ఇందులో దేశీయ ప్లేయర్‌లతోపాటు కొత్త ప్లేయర్ అయిన వియత్నాం బ్రాండ్ విన్‌ఫాస్ట్ దూసుకెళ్లింది. మొత్తం మార్కెట్‌పై భారతీయ సంస్థలైన టాటా, ఎంజి, మహీంద్రా పట్టు మాత్రం ఏ మాత్రం తగ్గలేదని తేలింది.
అక్టోబర్ 2025లో మొత్తం ఎలక్ట్రిక్ కార్ల విక్రయాలు 17,772 యూనిట్లుగా నమోదయ్యాయి. ఇది నెలవారీ వృద్ధిలో సుమారు 9% పెరుగుదలను సూచిస్తుంది, ఏడాదివారీ వృద్ధిలో 56% వృద్ధిని సాధించింది. భారత మార్కెట్‌లో EV అడాప్షన్ స్థిరమైన వేగంతో పుంజుకుంటోందని ఈ లెక్కలు చూస్తే అర్థమవుతోంది. అగ్ర బ్రాండ్‌ల మధ్య పోటీ చాలా కఠినంగా మారుతోంది. ఈ పోటీలో ఎవరు అగ్రగామిగా ఉంటారు, ఎవరు భవిష్యత్తులో కింగ్‌గా మారుతారు అనేది డేటా స్పష్టం చేస్తోంది.
‘ఇండియా ఈవీ బాస్’ టాటా మోటార్స్ డామినేషన్
భారతీయ ఎలక్ట్రిక్ వాహన మార్కెట్‌లో టాటా మోటార్స్ తన ఏకఛత్రాధిపత్యాన్ని అక్టోబర్‌లోనూ కొనసాగించింది. దీనిని 'ఇండియా ఈవీ బాస్' అని కూడా పిలుస్తున్నారు. టాటా మొత్తం 7,018 యూనిట్లు విక్రయించింది, సెప్టెంబర్‌తో పోలిస్తే 7% వృద్ నమోదు చేసింది.
టాటా మోటార్స్ మార్కెట్ వాటా 40.1% వద్ద స్థిరంగా ఉంది. ఇది EV పరిశ్రమలో దాని తిరుగులేని శక్తిగా మారుస్తోంది. నెక్సాన్ ఈవీ (Nexon EV), పంచ్ ఈవీ (Punch EV), కర్వ్ ఈవీ (Curvv EV) అత్యున్నత శ్రేణిలో హారియర్ ఈవీ (Harrier EV) అద్భుతంగా సేల్ అవుతున్నాయి. ముఖ్యంగా హారియర్ ఈవీ, ఇండిపెండెంట్ సస్పెన్షన్, నెక్స్ట్ లెవెల్ ఫీచర్స్, అత్యుత్తమ బిల్డ్ క్వాలిటీతో టాటాను ఈవీ కింగ్‌గా నిలబెట్టింది.
టాటా విజయం కేవలం మోడళ్లను అందించడంలోనే లేదు, దాని "విన్నింగ్ కాంబో"లో ఉంది. ఇది నమ్మకమైన సేవను అందిస్తోంది. సరసమైన ధరలలో EVలను అందిస్తోంది. ముఖ్యంగా దేశీయంగా తయారైన వాహనంపై ఉండే నమ్మకాన్ని క్యాష్ చేసుకుంటోంది. ఈ మూడు అంశాలు టాటాను బలోపేతం చేశాయి.
టాటా తర్వాత రెండు, మూడు స్థానాల్లో ఎంజీ మోటార్స్ (MG Motors India) మహీంద్రా & మహీంద్రా ఉన్నాయి. ఈ టాప్ 3 బ్రాండ్‌లు భారతదేశ ఈవీ మార్కెట్‌ను 87% వాటా కలిగి ఉన్నాయి. ఎంజీ మోటార్స్ ఇండియాలో రెండో స్థానంలో ఉంది. అక్టోబర్‌లో 4,497 యూనిట్లను విక్రయించి, 8% వృద్ధిని సాధించింది. ఎంజీ విజయ రహస్యం బ్రిటిష్ హెరిటేజ్ + చైనీస్ టెక్నాలజీ + ఇండియన్ భాగస్వామ్యం. విండ్సర్ ఈవీ ప్రో (Windser EV Pro) టాప్ సెల్లింగ్ కారుగా నిలిచింది. ఇది ఫీచర్ లోడెడ్, నెక్స్ట్ లెవెల్ కంఫర్ట్‌ను అందిస్తుంది. జెడ్ ఈవీ (ZS EV) ఆల్‌టైమ్ ఫేమస్‌గా ఉండగా, కామెట్ ఈవీ (Comet EV) కూడా సరసమైన విభాగంలో బాగా సేల్ అవుతోంది. ఎంజీ ప్రస్తుత మార్కెట్ వాటా 25.3%గా ఉంది.
మహీంద్రా & మహీంద్రా మూడో స్థానంలో ఉంది. ఈ దేశీ బ్రాండ్ 3,867 యూనిట్లతో 11% నెలవారీ వృద్ధిని సాధించి, 21.8% మార్కెట్ వాటాను కలిగి ఉంది. మహీంద్రా EV ప్రయాణం ఇప్పుడు వేగం పుంజుకుంది. ఎస్‌యూవీలైన XUV 9, Be6 సెగ్మెంట్ హీరోలుగా నిలిచాయి. మహీంద్రా, ఒక దేశీ బ్రాండ్ అయినప్పటికీ, తన సాంకేతికత (Tech), డిజైన్ పరంగా అంతర్జాతీయ బ్రాండ్లకు గట్టి పోటీ ఇస్తోంది. రాబోయే నెలల్లో, XUV 700 ఎలక్ట్రిక్ అవతార్ అయిన XUV 9S విడుదల ద్వారా తమ అమ్మకాలు మరింత పెరిగే అవకాశం ఉంది.
సంచలనం సృష్టించిన కొత్త ప్లేయర్
అక్టోబర్ 2025 నివేదికలో కొత్తగా ఎంట్రీ ఇచ్చిన విన్‌ఫాస్ట్ ఉంది. ఈ వియత్నాం బ్రాండ్ తొమ్మిదో స్థానంలో నిలిచింది. సెప్టెంబర్‌లో కేవలం 6 కార్లు మాత్రమే విక్రయించగలిగిన ఈ సంస్థ, అక్టోబర్‌లో ఏకంగా 131 యూనిట్లను విక్రయించింది. అంటే, నెలవారీ వృద్ధి 2000%కు చేరింది. ఈ అద్భుతమైన వృద్ధి రేటు చూస్తుంటే, రాబోయే ఆరు నెలల్లో విన్‌ఫాస్ట్ టాప్ ఫైవ్‌లో కనిపించే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. విన్‌ఫాస్ట్ ప్రస్తుతం VF6, VF7 వంటి మోడళ్లను అందిస్తోంది. VF6 మోడల్ నేరుగా MG Windser EVకి గట్టి పోటీ ఇస్తోంది. ఈ కార్ల డిజైన్ చాలా ఫ్యూచరిస్టిక్గా ఉండటం, బాక్సీ డిజైన్ నచ్చని కొనుగోలుదారులను ఆకర్షిస్తోంది. ముఖ్యంగా, వీటి ఇండిపెండెంట్ సస్పెన్షన్, కొన్ని ప్రత్యేక ఫీచర్లు కస్టమర్లను బలంగా ఆకర్షిస్తున్నాయి. ప్రస్తుతానికి, విన్‌ఫాస్ట్ నెట్‌వర్క్ చిన్నగా ఉన్నప్పటికీ, దాని వృద్ధి వేగం అసాధారణంగా ఉంది.
మిడ్ రేంజ్ ప్లేయర్స్ పరిస్థితి ఏంటీ?
టాప్ 3 తర్వాత, మిడ్-రేంజ్ ప్లేయర్‌లు కూడా వేగంగా ఎదుగుతున్నాయి. కియా ఇండియా (Kia India) నాల్గో స్థానంలోకి దూసుకెళ్లింది. ఇది పూర్తి శక్తితో EV మార్కెట్‌లోకి పునరాగమనం చేసింది. అక్టోబర్‌లో 655 యూనిట్లను విక్రయించి, 24% వృద్ధిని సాధించింది. ఈ పెరుగుదలకు ప్రధాన కారణం కార్న్స్ క్లబ్ ఈవీ (Carns Club EV). ఇది కుటుంబ కొనుగోలుదారులకు సరైన ఎంపికగా నిలిచింది, ఎందుకంటే ఇందులో స్పేస్, గుడ్ రేంజ్, స్టైల్ అన్నీ ఉన్నాయి. బివైడి ఇండియా ఐదో స్థానంలో నిలిచింది. అక్టోబర్‌లో 560 కార్లను విక్రయించినప్పటికీ, సెప్టెంబర్‌తో పోలిస్తే 6% తగ్గుదల కనిపించింది. విదేశీ తయారీదారులపై విధించిన 100% పన్ను కారణంగా వీటి ధరలు పెరుగుతున్నాయి. దీంతో దీని అమ్మకాలు తగ్గుతున్నాయి.
హ్యుందాయ్ మోటార్స్ ఇండియా (Hyundai Motors India) ఆరో స్థానంలో ఉంది. ఒకప్పుడు "రాబోయే ఈవీ బ్రాండ్"గా ఉన్న హ్యుందాయ్, ఇప్పుడు మెయిన్‌స్ట్రీమ్ EV ప్లేయర్‌గా మారింది. అక్టోబర్‌లో 437 యూనిట్లను విక్రయించి, 20% వృద్ధిని నమోదు చేసింది. CRTA EV విడుదల తర్వాత సానుకూల స్పందన రావడంతోపాటు, అయోనిక్ 5 (Ioniq 5) ప్రీమియం కొనుగోలుదారులను ఆకర్షిస్తోంది. పెరుగుతున్న పోటీని తట్టుకోవడానికి, హ్యుందాయ్ తన కార్లలో కొత్తదనాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉంది. మార్కెట్ వాటా వివరాలు ఈ నివేదికలో ఇవ్వలేదు.
లగ్జరీ బ్రాండ్‌లు అమ్మకాల పరంగా స్థిరంగా ఉన్నాయి కానీ మొత్తం మార్కెట్‌లో వాటి వాటా తక్కువగా ఉంది.బీఎండబ్ల్యూ ఇండియా ఏడో స్థానంలో నిలిచింది. అక్టోబర్‌లో 303 యూనిట్లను విక్రయించింది, సెప్టెంబర్‌తో పోలిస్తే 9% తగ్గుదల ఉంది. iX1, i4, i7 వంటి ఎలైట్ కార్లు EV విభాగంలో ప్రమాణాలను నెలకొల్పాయి. ఇవి అద్భుతమైన ఫీచర్లు, మంచి రేంజ్‌ను అందిస్తున్నాయి. మెర్సిడెస్ బెంజ్ ఇండియా (Mercedes Bince India) తొమ్మిదో స్థానంలో ఉంది. లగ్జరీ EV అనగానే మెర్సిడెస్ గుర్తుకొస్తుంది. అక్టోబర్‌లో 90 కార్లు విక్రయించగా, సెప్టెంబర్‌తో పోలిస్తే 17% తగ్గుదల నమోదైంది. EQA, EQB, EQS వంటి మోడళ్లు కొనుగోలుదారులకు కలల కార్లుగా ఉన్నాయి. సిట్రోయెన్ (Citroën) పదో స్థానంలో ఉంది. ఈ ఫ్రెంచ్ బ్రాండ్ అక్టోబర్‌లో 52 కార్లను విక్రయించి 41% వృద్ధిని సాధించింది.
భవిష్యత్తు అంచనాలు
మొత్తం మీద EV విప్లవం వేగంగా విస్తరిస్తోంది. 2026 నాటికి ఈ దృశ్యం పూర్తిగా మారిపోయే అవకాశం ఉంది. రాబోయే త్రైమాసికంలో మరింత ఉత్సాహభరితమైన లాంచ్‌లు ఉన్నాయి. EV మార్కెట్‌లో పోటీ తీవ్రంగా ఉందని తెలుస్తోంది. దేశీయ బ్రాండ్‌లు తమ పట్టును బలంగా ఉంచుకోగా, విన్‌ఫాస్ట్ వంటి కొత్త పోటీదారులు దూసుకువస్తున్నాయి.