MG Comet EV Price Hike: MG మోటార్ ఇండియా కామెట్ EV ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. బేసిక్ వేరియెంట్‌ నుంచి అన్ని మోడళ్ల ధరలను సవరించింది. బేసిక్‌ మోడల్‌పై 14.300  రూపాయలు పెంచింది. టాప్‌ స్పెక్‌బ్లాక్ స్టామ్‌పై 13,700 రూపాయలు పెంచింది. మిగతా వేరియెంట్స్‌పై 15వేల వరకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది.  

Continues below advertisement

భారత్‌ అటోమొబైల్‌ మార్కెట్‌లో మధ్యతరగతి ప్రజల నుంచి ఒక మోస్తరు ప్రీమియం కార్లపై ఇంట్రెస్ట్ చూపే వారి వరకు అందరూ మెచ్చే కంపెనీ ఎంజీ. ప్రస్తుతం ఈ కంపెనీ దేశంలో 9 మోడళ్లను అందుబాటులో ఉంచింది. అందులో ఒకటి హ్యాచ్‌బ్యాక్‌, ఐదు ఎస్‌యూవీలు, రెండు ఎంవీయూలు ఒకటి కన్వర్టిబుల్‌ మోడల్‌. ఈ కంపెనీలో తక్కువ ధరకు లభించే కారు కామెట్‌ ఈవీ. ప్రస్తుతం పెంచిన ధరల ప్రకారం ఇది 7.50 లక్షుకే వస్తుంది. అత్యంత ఖరీదైన కారు సైబర్‌స్టర్‌. దీని కాస్ట్‌ 74.99వేల రూపాయలు. ఇది లేటెస్ట్ మోడల్‌. 

మీరు పది లక్షల  లోపు మోడల్స్‌ గురించి చూస్తున్నట్టైతే మీకు కామెట్‌ ఈవీ ఇప్పటికీ కూడా చాలా బెస్ట్ ఆప్షన్‌గా చెప్పవచ్చు. లైనప్‌లో నాలుగు మోడల్స్‌ను మార్కెట్‌లో తీసుకొచ్చేందుకు ఎంజీ కంపెనీ ప్రయత్నాలు చేస్తోంది. ఎంజీ మెజెస్టర్‌, ఎంజీ 4ఈవీ, ఎంజీ ఐఎంఎస్‌, ఎంజీ ఐఎంజీ. 

ఎంజీ కామెట్‌ ఈవీలో ఎన్ని మోడల్స్ ఉన్నాయి? 

MG కామెట్ అనేది రెండు డోర్ల చిన్న ఎలక్ట్రిక్ కారు. చూడటానికి చాలా అందగా కనిపిస్తోంది. ప్రత్యేక డిజైన్ అందరి దృష్టి తనవైపునకు తిప్పుకోగలదు. ఇందులో నలుగురు ప్రయాణికులు ఈజీగా ప్రయాణం చేయవచ్చు. చూడటానికి చిన్నగా కనిపించినప్పటికీ లోపల సౌకర్యవంతంగానే ఉంటుంది.మొదట్లో అనేక అనుమానాలు వ్యక్తం చేసిన వినియోగదారులు తర్వాత కొనేందుకు పోటీ పడుతున్నారు. 

ఎంజీ కామెట్‌ ఆన్‌రోడ్ ధర ఎంత ?

ఎంజీ కామెట్‌  మొత్తంగా 6 వేరియెంట్స్‌లలో వస్తోంది. ఇప్పుడు ధరలు పెంచిన తర్వాత  బేసిక్ వేరియెంట్‌ షోరూమ్‌ ప్రైస్‌ 7.50 లక్షలు ఉంటే...ఆన్‌ రోడ్‌ ప్రైస్‌ ధర దాదాపు 8 లక్షల రూపాయలు ఉంటుంది. హై ఎండ్‌ వేరియెంట్‌ 10.60 లక్షలకు వస్తుంది. ఎక్కువగా మధ్యస్థంగా ఉండే వేరియెంట్‌ కొనేందుకు వినియోగదారులు ఆసక్తి చూపిస్తున్నారు. ఆ వేరియెంట్స్‌ పేర్లు ధరలు ఇక్కడ చూడొచ్చు. 

వేరియెంట్‌    హైదరాబాద్‌లో ధర (ఉండే అవకాశం)
ఎంజీ కామెట్‌ ఈవీ ఎగ్జిక్యూటివ్‌ రూ. 8 లక్షలు 
ఎంజీ కామెట్‌ ఈవీ ఎగ్జైట్‌     రూ. 9.10 లక్షలు 
ఎంజీ కామెట్‌ ఈవీ ఎగ్జైట్‌ ఎఫ్‌సీ    రూ. 9.50 లక్షలు 
ఎంజీ కామెట్‌ ఈవీ ఎక్స్‌క్లూజివ్‌    రూ. 10.10 లక్షలు
ఎంజీ కామెట్‌ ఈవీ ఎక్స్‌క్లూజివ్‌ ఎఫ్‌సీ రూ. 10.55 లక్షలు 

ఎంజీ కామెట్‌ ఈవీ బ్లాక్‌ స్టోమ్‌ ఎడిషన్

రూ. 10.60 లక్షలు 

 

ఎంజీ కామెట్‌ బేసిక్‌ మోడల్‌ తీసుకుంటే ఎంత డౌన్‌పేమెంట్ చేయాలి?

ఏదైనా కారు, ఖరీదైన వస్తువు కొనేందుకు ఎంత డౌన్‌ పేమెంట్‌ పెట్టాలి అనేది మీకు లోన్ ఇచ్చే బ్యాంకు, పైనాన్స్‌ కంపెనీ బట్టి మారుతూ ఉంటుంది. అయితే బేసిక్ మోడల్‌ తీసుకుంటే మీరు 78 వేల నుంచి లక్షా 69 వేల వరకు డౌన్‌పేమెంట్‌ చెల్లించాల్సి ఉంటుంది.  

ఎంజీ కామెట్‌ బేసిక్‌ మోడల్‌ తీసుకుంటే ఎంత ఈఎంఐ చెల్లించాలి?

ఎంజీ రేట్లు సవరించిన తర్వాత ఈఎంఐ, డౌన్‌పేమెంట్‌ గురించి ఇంకా అప్‌డేట్ ఇవ్వలేదు. అందుకే పాత రేట్లు ప్రకారమే  ఈఎంఐ, డౌన్‌పేమెంట్‌ వివరాలు అందిస్తున్నాం. 78వేల రూపాయలు డౌన్‌పేమెంట్ చెల్లించి బేసిక్‌ మోడల్‌ ఎంజీ కామెట్‌ ఈవీ ఎగ్జిక్యూటివ్‌ తీసుకుంటే 7,05,594 రూపాయలకు లోన్‌కు వెళ్లాల్సి ఉంటుంది. దీన్ని పది శాతం వడ్డీకి నాలుగేళ్లకు అప్పుగా తీసుకుంటే నెలకు 17,896 మిత్తి కట్టాలి. అదే లోన్‌ను మూడేళ్లకు తీసుకుంటే 22,768 రూపాయలు నెల నెల బ్యాంకుకు చెల్లించాలి. అదే డబ్బులను రెండేళ్ల కోసం తీసుకుంటే నెలకు 32,560 రూపాయలు ఈఎంఐ చెల్లించాల్సి ఉంటుంది. ఇలా మీరు అప్పును ఏడాది నుంచి ఏడేళ్ల వరకు తీసుకోవచ్చు. మీరు టెన్యూరు పెంచుకుంటూ వెళ్తే ఈఎంఐ తగ్గుతుంది. కానీ మీరు బ్యాంకుకు కట్టాల్సిన అమౌంట్‌ పెరుగుతుంది. 

ఎంజీ కామెట్‌ ఈవీ ఎగ్జైట్‌ ఎఫ్‌సీ తీసుకుంటే ఎంత ఈఎంఐ చెల్లించాలి?

ఎంజీ కామెట్‌ ఈవీలో ఎగ్జైట్‌ ఎఫ్‌సీ వేరియెంట్‌ను ఎక్కువ మంది వినియోగదారులు తీసుకుంటున్నారు. దీని ఆన్‌రోడ్‌ ప్రైస్‌ 9లక్షల 35వేల రూపాయలు. దీని కోసం మీరు దాదాపు 93వేల రూపాయలు డౌన్‌పేమెంట్ చెల్లించాలి. అంత కంటే ఎక్కువగా కూడా చెల్లించ వచ్చు. అలా చెల్లిస్తే మీ లోన్ అమౌంట్ తగ్గుతుంది. 93 వేల రూపాయలు చెల్లించి పది శాతం వడ్డీకి 8,41,832 రూపాయలను లోన్‌ రూపంలో తీసుకోవచ్చు. దీన్ని నాలుగేళ్లకు అప్పుగా తీసుకుంటే నెలకు 21,351 రూపాయలు చెల్లించాలి. ఇలా చెల్లిస్తే బ్యాంకుకు 10,24,848 రూపాయలు చెల్లించినట్టు అవుతుంది. అదే మీరు టెన్యూర్ తగ్గించుకుంటే ఈఎంఐ పెరగొచ్చేమో కానీ బ్యాంకుకు మీరు చెల్లించే డబ్బులు తగ్గుతాయి.