Best Highway Cars India: చాలా మంది వాహనదారులు ఎక్కువగా జాతీయ రహాదారులపై డ్రైవే చేయడానికి ఇష్టపడతారు. అయితే నగరాల్లో అద్భుతంగా నడిచే ప్రతి కారు హైవేలపై అదే పనితీరును చూపిస్తుందని చెప్పలేదు. నగరంలోని ట్రాఫిక్‌లో మైలేజీ ఇచ్చే కారు కంటే హైవేపై వెళ్లేటప్పుడు స్థిరమైన వేగం, అత్యవసర సమయంలో దూసుకుపోయే, ప్రమాదాల నుంచి రక్షించే కారు చాలా అవసరం. ఇలాంటి కార్ల గురించి చూస్తున్నట్టు అయితే వివిధ బడ్జెట్‌ ధరల్లో అందుబాటులో ఉన్న ఉత్తమ హైవే కార్ల గురించి ఇప్పుడు చూద్దాం.  

Continues below advertisement

టాటా పంచ్‌ 

భారత్‌లో ఎక్కువ అమ్ముడవుతున్న కార్లలో ఒకటైన టాటా పంచ్‌, దాని ఫేస్‌లిఫ్ట్‌ వెర్షన్ ద్వారా హైవే ప్రయాణాలకు సిద్ధమైంది. గతంలో పంచ్‌లో హైవే డ్రైవింగ్‌కు అవసరమైన పవర్‌ తక్కువగా ఉండేది. కానీ కొత్తగా తీసుకొచ్చిన  1.2 లీటర్‌ టర్బో పెట్రోల్‌ ఇంజిన్ ఆ లోటును భర్తీ చేసింది. ఈ కొత్త 120పీఎస్‌ టర్బో పెట్రోల్ ఇంజిన్ సహాయంతో పంచ్ ఇప్పుడు గంటకు వంద నుంచి 120 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తోంది. ఎలాంటి ఒత్తిడి లేకుండానే స్మూత్‌గా ప్రయాణించగలదు. ముఖ్యంగా 1, 750ఆర్‌పీఎం నుంచి నాలుగువేల ఆర్పీఎం మధ్య ఉండే టార్క్ కారణంగా ఓవర్‌టేక్ చేయడం చాలా ఈజీ అవుతుంది. వేగం పెరిగే కొద్దీ స్టీరింగ్ బరువుగా మారి డ్రైవర్‌కు మంచి నియంత్రణను అందిస్తుంది. అయితే దీని ఎత్తు ఎక్కువగా ఉండటం వల్ల వేగంగా మలుపు తిరిగేటప్పుడు ఇంజిన్, గాలి శబ్దం లోపలికి వినిపిస్తుంది. 

టాటా ఆల్ట్రోజ్ 

హ్యాచ్‌బ్యాక్‌ విభాగంలో హైవే ప్రయాణాలకు ఆల్ట్రోజ్ ఒక అద్భుతమైన ఎంపిక. ఆల్ట్రోజ్‌ భారత్‌లోని అత్యంత స్థిరమైన హ్యాచ్‌బ్యాక్‌లలో ఒకటిగా పేరు తెచ్చుకుంది. గంటకు 120 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్నా ఇది రోడ్డుపై చాలా స్ట్రాంగ్‌లా నిలబడుతుంది. హైవేల కోసం ఈ మోడల్‌లో డీజిల్ ఇంజిన్ ఉత్తమమైంది. ఎందుకంటే ఇది 200Nm టార్క్‌ను అందిస్తూ ఓవర్‌టేకింగ్‌ను సులభతరం చేస్తుంది. 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ కలిగి ఉండటం వల్ల హైవేలపై వేగంగా వెళ్లేటప్పుడు ప్రయాణికులకు భద్రతపై నమ్మకం కలుగుతుంది. అయితే, దీని పెట్రోల్‌ ఇంజిన్ హైవేలపై కొంత నెమ్మదిగా అనిపించవచ్చు.  

Continues below advertisement

Also Read: లో స్కోరింగ్ థ్రిల్లర్ లో జీటీ ఈజీ విక్ట‌రీ.. శుభ‌మాన్ గిల్ కెప్టెన్ ఇన్నింగ్స్.. రాణించిన అర్ష‌ద్, ర‌షీద్, ఆర్సీబీకి షాక్

మహీంద్రా XUV 3XO

మహీంద్రా నుంచి వచ్చిన XUV 3XO, ఒక చిన్న కారులో పెద్ద కారును నడుపుతున్న అనుభూతిని కలిగిస్తుంది. దీనిలోని 1.2 లీటర్‌ టర్బో పెట్రోల్‌ ఇంజిన్ 131 పీఎస్ పవర్, 230Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది తన విభాగంలోనే అత్యధికం. ఇందులో లెవల్‌ 2 ఏడీఏఎస్‌ ఫీచర్లు ఉన్నాయి. ముఖ్యంగా అడాప్టివ్‌ క్రూయిజ్‌ కంట్రోల్‌ వంటి ఫీచర్లు సుదీర్ఘ ప్రయాణాల్లో డ్రైవర్‌ అలసటను తగ్గిస్తాయి. 

Also Read: కోట్లు విలువ చేసే మెర్సిడెస్ బెంజ్ వి-క్లాస్ లో కార్తీక్ ఆర్యన్ షికారు.. లగ్జరీ కార్ల కలెక్షన్ లో మరో డైమండ్.. స్టైల్ కు కంఫర్ట్ తోడైతే..

వోక్స్‌వ్యాగన్ వర్టస్‌ 

మీరు సెడాన్ ప్రియులైతే, వోక్స్‌ వ్యాగన్ వర్టస్‌ కంటే మెరుగైన హైవే కారు మరొకటి ఉండదు. దీనిలోని 1.5 లీటర్‌ TSI ఇంజిన్ 150పీఎస్‌ పవర్‌, 250Nm టార్క్‌ను అందిస్తుంది. వంద కిలోమీటర్ల వేగం వద్ద కూడా ఇంజిన్ తక్కువ ఆర్పీఎంలో ఉండటం వల్ల ప్రయాణం చాలా ప్రశాంతంగా ఉంటుంది. దీని స్టీరింగ్ చాలా కచ్చితంగా ఉండి, హైవేలపై డ్రైవింగ్‌ ఆనందాన్ని పెంచుతుంది. 

టాటా సియెరా

కొత్త లాంచ్ అయిన టాటా సియెరా దాని ప్రత్యేకమైన డిజైన్, సౌకర్యాలతో వినియోగదారులను ఆకట్టుకుంటోంది. దీనిలోని లౌంజ్‌ తరహా సీటింగ్ సుదీర్ఘ ప్రయాణాల్లో ప్రయాణికులు అలసట కలగకుండా చూస్తుంది. ఇందులో ఉపయోగించిన ఫ్రిక్వెన్సీ- సెలెక్టివ్ డ్యాంపింగ్‌ టెక్నాలజీ రోడ్డుపై ఉండే గుంతలను, కుదుపులను సమర్థవంతంగా గ్రహిస్తుంది. 

Also Read: మైలేజ్ ఇచ్చే బెస్ట్ మిడ్ సైజ్ ఎస్‌యూవీలు ఇవే! లీటర్ కు 28 కిమీ ఇచ్చే హైబ్రిడ్ కార్ల లిస్ట్

మహీంద్ర XUV 7XO

గతంలో ఉన్న XUV 700కి ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌గా వచ్చిన XUV 7XO, హైవేలపై మానుస్టర్‌లా దూసుకుపోతుంది. దీనిలోని 2.2 లీటర్ డీజిల్‌ ఇంజిన్ 450Nm భారీ టార్క్‌ను అందిస్తుంది. ఇది హైవే డ్రైవింగ్‌కు సరిగ్గా సరిపోతుంది. కొత్త డావిన్సీ సస్పెన్షన్, డ్యాంపింగ్ టెక్నాలజీ వల్ల కారు అత్యంత వేగంలో కూడా స్థిరంగా ఉంటుంది. అడాప్టివ్ క్రూయిజ్‌ కంట్రోల్, లేన్ కీప్ అసిస్ట్ వంటి భద్రతను రెట్టింపు చేస్తాయి. 

మహీంద్రా XEV 9S

ఎలక్ట్రిక్ వాహనాల యుగంలో మహీంద్రా XEV 9S హైవేల కోసం ప్రత్యేకంగా రూపొందించారు. ఇది 285 PS పవర్, 380Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. గంటకు 150 నుంచి 160 కిలోమీటర్ల వేగంతో కూడా ఇది రోడ్డుపై అత్యంత స్థిరంగా ఉంటుంది. దీనిపై సెమి యాక్టివ్ సస్పెన్షన్ రోడ్డు పరిస్థితులకు అనుగుణంగా రియల్ సర్దుబాటు అవుతుంది. క్యాబిన్ లోపల శబ్దం చాలా తక్కువగా ఉండటం వల్ల ప్రయాణం ఆహ్లాదకరంగా ఉంటుంది. ఎలక్ట్రిక్ వాహనం కాబట్టి, అతి వేగంతో ప్రయాణించినప్పుడు బ్యాటరీ రేంజ్ తగ్గే అవకాశం ఉంది. అయితే దీనిలోని 79kWh బ్యాటరీ ప్యాక్‌ హైవేలపై దాదాపు 450 నుంచి 500 కిలోమీటర్ల రియల్ వరల్డ్ రేంజ్ అందిస్తుంది. 

Also Read: వేసవిలో పొరపాటున కూడా ఈ వస్తువులను కారు ఉంచొద్దు.. చిన్న తేడావచ్చినా అంతా బూడిదే

హైవే ప్రయాణాల కోసం కారును ఎంచుకునేటప్పుడు మీ బడ్జెట్, అవసరాలను బట్టి నిర్ణయం తీసుకోవాలి. బడ్జెట్ తక్కువగా ఉండి భద్రత కావాలనుకునే వారికి టాటా పంచ్ లేదా ఆల్ట్రోజ్ సరైనవి. అత్యుత్తమ డ్రైవింగ్ అనుభవం కావాలనుకునే వారు వోక్స్‌వ్యాగన్ వర్టస్‌ వైపు మొగ్గు చూపవచ్చు. పెద్ద మహీంద్రా XUV 7XO లేదా ఎలక్ట్రిక్ వెర్షన్‌లో XEV 9S అద్భుతమైన  ఎంపికలు కావచ్చు.