Best Budget Bikes Under 1.5 Lakh In 2025: మెరుగైన మైలేజీని అందించడంతో పాటు స్టైల్‌గా కనిపించే గొప్ప మోటార్‌సైకిళ్లు భారతీయ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఈ బైక్‌ల జాబితాలో హీరో, హోండా, టీవీఎస్ బైక్‌లు కూడా ఉన్నాయి. మీ కొత్త బైక్ కొనాలని భావిస్తుంటే, మీ బడ్జెట్ దాదాపు రూ. 1.5 లక్షలు అయితే, మైలేజీ + స్టైలిష్‌ కలబోతతో బైక్ కావాలనుకుంటే.. వాహన రంగ నిపుణుల అభిప్రాయం ప్రకారం మీ బడ్జెట్‌ పరిధిలో ఉత్తమమైన ఆప్షన్స్‌ 4 ఉన్నాయి.

Continues below advertisement


రూ.1.5 లక్షల బడ్జెట్‌ పరిధిలో బెస్ట్‌ బైక్స్‌


హోండా SP 125 (Honda SP 125 Specifications)
హోండా SP 125 ఒక పాపులర్‌ బైక్. ఈ మోటార్‌ సైకిల్‌లో 4-స్ట్రోక్, SI ఇంజిన్‌ అమర్చారు. ఈ ఇంజిన్‌ 8 kW పవర్‌ను ప్రొడ్యూస్‌ చేస్తుంది & 10.9 Nm టార్క్‌ను జనరేట్‌ చేస్తుంది. ఈ బైక్ ఒక లీటరు పెట్రోల్‌తో 63 కిలోమీటర్ల వరకు నడుస్తుందని (Honda SP 125 Mileage) హోండా కంపెనీ చెబుతోంది. హోండా SP 125 ఎక్స్-షోరూమ్ ధర రూ. 89,468 నుంచి ప్రారంభమై రూ. 93,468 వరకు (Honda SP 125 Ex-showroom Price) ఉంటుంది. ఈ బైక్ ఆన్-రోడ్ ధర రూ. 1.15 లక్షలకు కాస్త అటూఇటూగా ఉంటుంది.


టీవీఎస్ రైడర్ (TVS Raider Specifications)
టీవీఎస్ రైడర్ కూడా శక్తివంతమైన బైక్. ఈ మోటార్ సైకిల్ ఆరు వేరియంట్లలో మార్కెట్లో లభిస్తుంది. ఎయిర్ & ఆయిల్ కూల్డ్, సింగిల్ సిలిండర్ SI ఇంజిన్‌తో ఈ బైక్‌ను పవర్‌ఫుల్‌గా మార్చారు. ఇది 8.37 kW పవర్ & 11.75 Nm టార్క్ జనరేట్‌ చేస్తుంది. ఈ బైక్ లీటరుకు 71.94 కిలోమీటర్ల మైలేజీని (TVS Raider Mileage) ఇస్తుందని కంపెనీ వెల్లడించింది. టీవీఎస్ రైడర్ ఎక్స్-షోరూమ్ ధర (TVS Raider Ex-showroom Price) రూ.97,850 నుంచి ప్రారంభం అవుతుంది &దాదాపు రూ. 1.20 లక్షల ఆన్-రోడ్‌ ప్రైస్‌లో లభిస్తుంది.


టీవీఎస్ అపాచీ RTR 160 (TVS Apache RTR 160 Specifications)
SI, 4-స్ట్రోక్, ఆయిల్ కూల్డ్ SOHC, ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్‌తో టీవీఎస్ అపాచీ RTR 160ని సూపర్‌ బైక్‌ తరహాలో లాంచ్‌ చేశారు. ఈ బైక్‌లోని ఇంజిన్ స్పోర్ట్ మోడ్‌లో 12.91 kW పవర్‌ను & రెయిన్ మోడ్‌లో 11.50 kW పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ మోటార్‌ సైకిల్ ఒక లీటరు పెట్రోల్‌తో 61 కిలోమీటర్ల దూరాన్ని కవర్ చేస్తుందని (TVS Apache Mileage) TVS ప్రకటించింది. TVS Apache RTR 160 ఎక్స్-షోరూమ్ ధర (TVS Apache Ex-showroom Price) రూ. 1.25 లక్షల నుంచి ప్రారంభమై రూ. 1.40 లక్షల వరకు ఉంటుంది. ఈ బైక్ ఆన్-రోడ్ ధర రూ. 1.49 లక్షల నుంచి స్టార్ట్‌ అవుతుంది.


హీరో ఎక్స్‌ట్రీమ్ 125R (Hero Xtreme 125R Specifications)
హీరో ఎక్స్‌ట్రీమ్ 125R మెరుగైన మైలేజీని ఇవ్వడమే కాదు, స్టైలిష్ లుక్‌తోనూ ఉంటుంది. ఈ బైక్‌లో ఎయిర్-కూల్డ్, 4-స్ట్రోక్ ఇంజిన్ అమర్చారు. ఈ ఇంజిన్‌తో ఈ బైక్ 11.4 bhp పవర్‌ను ప్రొడ్యూస్‌ చేస్తుంది & 10.5 Nm టార్క్‌ను జనరేట్‌ చేస్తుంది. ఈ టూవీలర్‌ ఒక లీటరుకు 66 కిలోమీటర్ల వరకు (Hero Xtreme 125R Mileage) పరిగెడుతుందని కంపెనీ పేర్కొంది. హీరో ఎక్స్‌ట్రీమ్ 125R ఎక్స్-షోరూమ్ ధర (Hero Xtreme 125R Ex-showroom Price) రూ. 96,425 నుంచి ప్రారంభం అవుతుంది. ఈ బైక్‌ను దాదాపు రూ.1.17 లక్షల ఆన్-రోడ్ ధరతో  కొనుగోలు చేయవచ్చు.