Maruti Baleno Price, Down Payment, Loan and EMI Details: ఇండియాలో కారు కొనాలంటే సగటు భారతీయుడికి మొదటగా గుర్తొచ్చే పేరు మారుతి సుజుకి. ఈ బ్రాండ్ భారత మార్కెట్లో, ప్రజల మనస్సుల్లో బాగా నాటుకుపోయింది. మారుతి హ్యాచ్‌బ్యాక్ నుంచి MPV వరకు అన్నీ బాగా అమ్ముడవుతాయి. దీనికి పెద్ద కారణం - సామాన్యుడు భరించగలిగే & సొంత కారు కలను తీర్చగలిగే ధర. మరో ప్రధాన కారణం - మైలేజ్ పరంగా సంతృప్తి. ఇంకా.. నిర్వహణ ఖర్చు కూడా తక్కువ. ఇలాంటి లక్షణాలున్న మారుతి సుజుకి కార్లలో బాలెనో ఒకటి. ఈ కారు.. సిగ్మా, డెల్టా, డెల్టా CNG, డెల్టా AMT జీటా, జీటా CNG, జీటా AMT & ఆల్ఫా వంటి 9 వేరియంట్లలో లభిస్తుంది.
హైదరాబాద్/ విజయవాడలో బాలెనో ధర మారుతి బాలెనో ఎక్స్-షోరూమ్ ధర (Maruti Baleno ex-showroom price) రూ. 6.70 లక్షల నుంచి రూ. 9.93 లక్షల వరకు ఉంటుంది. హైదరాబాద్‌లో, అన్ని పన్నులు & ఖర్చులు కలుపుకుని ఈ కారు బేస్ మోడల్ ఆన్-రోడ్ ధర (Maruti Baleno on-road price) దాదాపు రూ. 8.01 లక్షలు. విజయవాడలో ఆన్-రోడ్ ధర దాదాపు రూ. 8.03 లక్షలు. అన్ని తెలుగు నగరాల్లో స్వల్ప తేడాలతో దాదాపు ఇదే రేటు ఉంది.
మారుతి బాలెనో బేస్ మోడల్‌ను మీరు కేవలం రూ. 1 లక్ష డౌన్ పేమెంట్‌తో కొనుగోలు చేయవచ్చు. మిగిలిన డబ్బు, రూ. 7.01 లక్షలను కార్ లోన్ రూపంలో బ్యాంక్ సర్దుబాటు చేస్తుంది. మీకు 9 శాతం వార్షిక వడ్డీ రేటుతో బ్యాంక్ ఈ లోన్ మంజూరు చేసిందని భావిద్దాం. ఇప్పుడు పైనాన్స్ ప్లాన్ చూద్దాం.
7 సంవత్సరాల్లో లోన్ మొత్తం పూర్తి చేయాలనుకుంటే, మీరు నెలకు రూ. రూ. 11,278 EMI చెల్లించాలి.
6 సంవత్సరాల కోసం రుణం తీసుకుంటే, నెలకు రూ. రూ. 12,636 EMI చెల్లించాలి.
5 సంవత్సరాల్లో లోన్ క్లియర్ చేయాలనుకుంటే, నెలకు రూ. రూ. 14,552 EMI చెల్లించాలి.
4 సంవత్సరాల రుణ కాలపరిమితిని నిర్ణయించుకుంటే, మీరు నెలకు రూ. రూ. 17,444 EMI చెల్లించాలి.
మీరు EMIపై కారు కొనబోతున్నట్లయితే, ఈ లెక్కలు & మీ బడ్జెట్‌ను బట్టి మీకు సరిపోయే EMI ఆప్షన్‌ను ఎంచుకోండి.
మారుతి బాలెనోలో టాప్ మోడల్ ఫీచర్లుతెలుగు ప్రజలు కోరుకునే లక్షణాలు మారుతి బాలెనో కారులో కనిపిస్తాయి. ఆపిల్ కార్‌ప్లే & ఆండ్రాయిడ్ ఆటో, OTA అప్‌డేట్స్‌తో 9-అంగుళాల స్మార్ట్‌ప్లే స్టూడియో టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ కారు క్యాబిన్‌లో ఉంది. ఆర్కామిస్-సోర్డ్స్ మ్యూజిక్ సిస్టమ్‌తో మీ జర్నీ అద్భుతంగా సాగుతుంది. ఇంకా.. హెడ్స్-అప్ డిస్‌ప్లే (HUD), క్రూయిజ్ కంట్రోల్, రియర్ AC వెంట్స్, ఎత్తును సర్దుబాటు చేసుగలిగే డ్రైవర్ సీటు, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వంటి చాలా మోడర్న్ ఫీచర్లు ఈ కారులో అందుబాటులో ఉన్నాయి. ప్రయాణీకులు/ మీ కుటుంబ సభ్యుల భద్రత కోసం 6 ఎయిర్‌బ్యాగ్‌లను కారులో అందించారు. సాధారణంగా, ఇలాంటి ఫీచర్లను టాప్ మోడల్ లేదా అప్పర్ వేరియంట్‌లో మాత్రమే అందిస్తారు.
మైలేజీమారుతి బాలెనో డెల్టా (పెట్రోల్+CNG) మోడల్‌ను కొనుగోలు చేస్తే, రిపోర్ట్స్ ప్రకారం, ఫుల్ ట్యాంక్‌తో 1000 కి.మీ. కంటే ఎక్కువ దూరం సులభంగా ప్రయాణించవచ్చు.