న్యూ జనరేషన్ Hyundai Venue ఇప్పుడు గతంలో కంటే మోడ్రన్ ఫీచర్లు, మోడిఫై చేసిన డిజైన్‌తో వచ్చింది. ముఖ్యమైన విషయం ఏమిటంటే, దీనిని Kia Syros లో K1 ప్లాట్‌ఫారమ్‌లో తయారు చేశారు. అయితే రెండింటి SUVల రూపురేఖలు, డ్రైవింగ్ ఎక్స్‌పీరియన్స్ ఒకదానికొకటి చాలా భిన్నంగా ఉన్నాయి. Hyundai Venue డిజైన్ మరింత భిన్నమైన SUV స్టైల్2లో ఉంది. ఇది రోడ్డుపై వెళ్తుంటే పవర్‌ఫుల్ అనిపిస్తుంది. అదే సమయంలో Kia Syros టాల్‌బాయ్ డిజైన్ దీనికి మరింత సిటీ, కాంపాక్ట్ లుక్ ఇస్తుంది. ఇది నగరాలలో ప్రయాణాలకు బెస్ట్ అని భావిస్తారు. 

Continues below advertisement

ధర, ఇంజిన్ ఆప్షన్లు

కొత్త Hyundai Venu టాప్ వేరియంట్ HX 10. ఇది 1.0 లీటర్ టర్బో పెట్రోల్ DCT, 1.5 లీటర్ డీజిల్ ఆటోమేటిక్ ఎంపికలలో వస్తుంది. మరోవైపు, Kia Syros టాప్ మోడల్ HTX+ (O) కూడా ఈ ఇంజిన్, ట్రాన్స్‌మిషన్ కాంబినేషన్లో అందుబాటులో ఉంది. ధర విషయానికి వస్తే రెండింటి ఎక్స్-షోరూమ్ ధర దాదాపు ఒకే మొత్తంలో ఉంటుంది. అయితే కియా Syros కొన్ని అదనపు ఫీచర్ల కారణంగా Venue కంటే కొంచెం ఎక్కువ ఖర్చు అనిపిస్తుంది.

సైజ్, అల్లాయ్ వీల్స్..

వాహనాల కొలతల పరంగా, Kia Syros కొద్దిగా Venue కంటే పెద్దదిగా ఉంటుంది. కియా  Syros యొక్క వీల్‌బేస్ 2,550mm కాగా ఇది Venue కంటే 30mm ఎక్కువ. అయితే దాని ఎత్తు కూడా 15mm ఎక్కువ. వెనుక సీటులో కూర్చున్న వారికి ఇది మంచి హెడ్‌రూమ్‌గా ఉపయోగం. Syros 17-అంగుళాల అల్లాయ్ వీల్స్‌ను కలిగి ఉంది. Venue 16 అంగుళాల అల్లాయ్ వీల్స్‌తో వస్తోంది. అయితే హ్యూందాయ్ Venue ఫ్రంట్ గ్రిల్,  DRL డిజైన్ దీనిని మరింత స్పోర్టీ లుక్, SUV లాగా చేస్తుంది.

Continues below advertisement

ఇంటీరియర్, ఫీచర్ల మధ్య వ్యత్యాసం

రెండు SUVలు ఫీచర్లు మెరుగ్గా ఉన్నాయి. కానీ Kia Syros ఒక అడుగు ముందుకు వేసింది. హ్యూందాయ్ Venue టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్, వైర్‌లెస్ ఛార్జింగ్, పవర్డ్ డ్రైవర్ సీటు, ప్రీమియం ఆడియో సిస్టమ్ వంటి ఫీచర్లను కలిగి ఉంది. అదే సమయంలో, కియా Syros 5 అంగుళాల AC కంట్రోల్ డిస్‌ప్లే, వెనుక సీటు బేస్ వెంటిలేషన్, ఎయిర్ ప్యూరిఫైయర్, స్లైడింగ్ రియర్ సీట్లతో పాటు పనోరమిక్ సన్‌రూఫ్ వంటి మోడ్రన్ ఫీచర్లతో మార్కెట్లోకి వచ్చింది. ఇవి హ్యుందాయ్ Venueలో అందుబాటులో లేవు.

సేఫ్టీ, డ్రైవింగ్ సాంకేతికత

భద్రత విషయానికి వస్తే రెండు SUVలు దాదాపు సమానంగా ఉన్నాయి. రెండూ లెవెల్ 2 ADAS, 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, పెడల్ షిఫ్టర్లు, డ్రైవ్ మోడ్‌లు, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ వంటి ఫీచర్లను కలిగి ఉన్నాయి. హ్యూందాయ్ Venue బలమైన బిల్డ్ క్వాలిటీ, కియా Syros స్థిరమైన K1 ప్లాట్‌ఫారమ్ రెండింటినీ సురక్షితంగా చేయనున్నాయి.

Also Read: Tata Sierra డౌన్ పేమెంట్ ఎంత చెల్లించాలి.. మీ EMI ఎంత కట్టాలి ? ధర, మైలేజీ వివరాలు