Telangana Municipal Election Reservations | హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి కీలక అడుగు పడింది. రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో చైర్మన్లు, మేయర్ల పదవులకు సంబంధించిన రిజర్వేషన్లను ప్రభుత్వం అధికారికంగా ఖరారు చేసింది. రాష్ట్రంలోని మొత్తం 121 మున్సిపాలిటీలు , 10 మున్సిపల్ కార్పొరేషన్లకు రిజర్వేషన్లను ఖరారు చేసిన ప్రభుత్వం బీసీలు, మహిళలకే అధిక ప్రాధాన్యత ఇచ్చింది.  

Continues below advertisement

రాష్ట్ర ప్రభుత్వం 121 మున్సిపాలిటీల్లో 31.4 శాతం కోటా కింద 38 స్థానాలను బీసీలకు కేటాయించింది. ఇందులో 19 స్థానాలు బీసీ మహిళలకు, 19 స్థానాలు బీసీ జనరల్ కు కేటాయించారు.  ఈ మేరకు ఉత్తర్వులను విడుదల చేస్తూ ఏ ఏ స్థానం ఏ వర్గానికి కేటాయించారో స్పష్టతనిచ్చింది.

మున్సిపల్ చైర్మన్ల రిజర్వేషన్లు: రాష్ట్రంలోని మున్సిపాలిటీలకు సంబంధించి ఎస్టీ, ఎస్సీ, బీసీ, జనరల్ కేటగిరీల వారీగా రిజర్వేషన్లు ఖరారు చేశారు.

Continues below advertisement

  • ఎస్టీ (ST) వర్గం: కల్లూరు, భూత్పూర్, మహబూబాబాద్, కేసముద్రం, ఎల్లంపేట 5 మున్సిపాలిటీలను ఎస్టీలకు కేటాయించారు. ఇందులో కేసముద్రం, ఎల్లంపేట స్థానాలు ఎస్టీ మహిళలకు దక్కాయి.

  • ఎస్సీ (SC) వర్గం: స్టేషన్ ఘన్‌పూర్, చొప్పదండి, జమ్మికుంట, హుజూరాబాద్, ఏదులాపురం, డోర్నకల్, లక్సెట్టిపేట్, మూడుచింతలపల్లి, నందికొండ, మొయినాబాద్, గడ్డపోతారం, కోహిర్, ఇంద్రేశం, చీర్యాల్, హుస్నాబాద్, వికారాబాద్, మోత్కూరు మొత్తం 17 మున్సిపాలిటీ చైర్మన్ స్థానాలను ఎస్సీలకు కేటాయించారు. ఇందులో చొప్పదండి, హుజూరాబాద్, ఏదులాపురం, గడ్డపోతారం, ఇంద్రేశం, చీర్యాల్, వికారాబాద్, మోత్కూరు 8 మునిసిపాలిటీలను ఎస్సీ మహిళలకు కేటాయించారు. 

  • బీసీ (BC) వర్గం: యల్లందు, జగిత్యాల, కామారెడ్డి, బాన్సువాడ వంటి 38 మున్సిపాలిటీలను బీసీలకు కేటాయించారు.

  • ఇందులో జగిత్యాల, కామారెడ్డి వంటి స్థానాలను బీసీ మహిళలకు, జంగాం, సిద్దిపేట వంటి స్థానాలను బీసీ జనరల్ కేటగిరీకి కేటాయించారు.

  • అన్‌రిజర్వ్‌డ్ (Unreserved 61): పరకాల, రాయికల్, జడ్చర్ల, తొర్రూరు, చండూర్, మెట్‌పల్లి, ఎల్లారెడ్డి, నకిరేకల్, హాలియా, కోస్గి, మక్తల్, ఖానాపూర్, భైంసా, బోధన్, సుల్తానాబాద్, చేవెళ్ల, ఇబ్రహీంపట్నం, శంకర్‌పల్లి, ఆమన్‌గల్లు, కొత్తూరు, పెబ్బేరు, నారాయణఖేడ్, అందోలు- జోగిపేట, సూర్యాపేట, తిరుమలగిరి, నేరేడుచర్ల, కొడంగల్, అమరచింత, వర్ధన్నపేట, పోచంపల్లి(30).

  • అన్‌రిజర్వ్‌డ్ విభాగంలో మహిళలకు ఆదిలాబాద్, కోరుట్ల, బెల్లంపల్లి, ధర్మపురి, సత్తుపల్లి, అశ్వారావుపేట, వైరా, మధిర, మరిపెడ, క్యాతన్‌పల్లి, రామాయంపేట, నర్సాపూర్, తూప్రాన్, అలియాబాద్, చిట్యాల, నిర్మల్, భీమ్‌గల్, ఆర్మూర్, సిరిసిల్ల, సదాశివపేట, సంగారెడ్డి, ఇస్నాపూర్, నారాయణపేట, కల్వకుర్తి, గద్వాల, వనపర్తి, యాదగిరిగుట్ట, భువనగిరి, చౌటుప్పల్‌, మిర్యాలగూడ, కోదాడ (31) కేటాయించారు 

కార్పొరేషన్ మేయర్ల రిజర్వేషన్లు: నగర పాలక సంస్థల (Corporations) మేయర్ పదవుల రిజర్వేషన్లను కూడా ప్రభుత్వం వెల్లడించింది. కొత్తగూడెం మేయర్ స్థానాన్ని ఎస్టీలకు, రామగుండం స్థానాన్ని ఎస్సీలకు కేటాయించారు. బీసీ వర్గానికి మహబూబ్ నగర్ (మహిళ), మంచిర్యాల, కరీంనగర్ స్థానాలు దక్కాయి. హైదరాబాద్ (GHMC), ఖమ్మం, నిజామాబాద్ మేయర్ పీఠాలను మహిళలకు (General) కేటాయించగా, వరంగల్ (GWMC) స్థానాన్ని అన్‌రిజర్వ్‌డ్‌గా ఉంచారు.

మొత్తం 10 కార్పొరేషన్ల రిజర్వేషన్లు   మహబూబ్‌నగర్ బీసీ (మహిళ)  మంచిర్యాల బీసీ (జనరల్)    నిజామాబాద్ అన్‌రిజర్వ్‌డ్ (మహిళ)  వరంగల్ అన్‌రిజర్వ్‌డ్ (మహిళ)  కరీంనగర్ బీసీ (జనరల్)  రామగుండం ఎస్సీ (జనరల్)  ఖమ్మం అన్‌రిజర్వ్‌డ్ (మహిళ)  కొత్తగూడెం ఎస్టీ (జనరల్)  సిద్దిపేట అన్‌రిజర్వ్‌డ్ (మహిళ)   గ్రేటర్ హైదరాబాద్ (GHMC) అన్‌రిజర్వ్‌డ్ (జనరల్)