Hyundai Creta Ev Car Delivary Latest News: ఈవీ రంగంలో ఫేమస్ కంపెనీ అయిన హ్యుండయ్.. తన ప్రముఖ మోడల్ క్రేటాలో మరిన్ని వేరియంట్లను తీసుకొచ్చింది. బ్యాటరీ ఫర్ఫార్మెన్స్ తోపాటు ఇతర అదనపు ఫీచర్లతో ఈవీ మార్కెట్లో సంచలనానికి తెర తీసింది. హ్యూండయ్ మోటార్ ఇండియా తమ మిడ్-సైజ్ ఎలక్ట్రిక్ SUV విభాగంలో తమ పట్టును మరింత పెంచేందుకు క్రెటా ఎలక్ట్రిక్ లైనప్‌లో మూడు కొత్త వేరియంట్లను తాజాగా ప్రవేశపెట్టింది. ఈ కొత్త ట్రిమ్‌లు అద్భుతమైన ఫీచర్లతోపాటు మంచి బ్యాటరీ బ్యాకప్ తో ఉన్నాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు. అందులో మొదటిది ఎక్స్‌లెన్స్ (42 kWh) కాగా, రెండోది ఎగ్జిక్యూటివ్ టెక్ (42 kWh), ఇక మూడోది ఎగ్జిక్యూటివ్ (O) (51.4 kWh)గా కంపెనీ పేర్కొంది. . క్రెటా ఎలక్ట్రిక్ రెండు బ్యాటరీ ఆప్షన్‌లతో అందుబాటులో ఉందని కంపెనీ తెలిపింది. తొలిది 42kWh బ్యాటరీ కాగా 420 కిమీ వరకు రేంజీని కంపెనీ క్లెయిమ్ చేసింది. ఇక పెద్ద 51.4kWh బ్యాటరీ ARAI టెక్నాలజీపై ఉండగా, గరిష్ఠంగా 510కిమీ రేంజ్ ఇస్తుందని కంపెనీ పేర్కొంటోంది.
సరికొత్త ఫీచర్లు..కొత్తగా వచ్చిన ఎక్స్‌లెన్స్ (42 kWh) వేరియంట్‌లో Level 2 ADAS, 360 డిగ్రీ వ్యూ మానిటర్, బ్లైండ్-స్పాట్ మానిటర్, ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్లు, డాష్ కెమెరా, వెనుక వైర్లెస్ చార్జర్, పవర్డ్ డ్రైవర్ ప్యాసింజర్ సీట్లు, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, మడవగల సీటుబ్యాక్ టేబుల్ వంటి ప్రీమియం ఫీచర్లు ఉన్నాయని తెలుస్తోంది.. ఎగ్జిక్యూటివ్ టెక్ (42 kWh) వేరియంట్‌లో వాయిస్ ఎనేబుల్డ్ పానొరామిక్ సన్‌రూఫ్, ఎకో లెదర్ సీట్లు, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, వెనుక విండో సన్‌షేడ్ ఉన్నాయని, ఇవి వినియోగదారులకు మరింత ప్రీమియం అనుభూతిని కలిగిస్తాయని కంపెనీ పేర్కొంది.
మరో వేరియంట్ లో..ఎగ్జిక్యూటివ్ (O) వేరియంట్ (51.4 kWh)లో ఎక్కువ రేంజ్ బ్యాటరీతో పాటు స్మార్ట్ పానొరామిక్ సన్‌రూఫ్ వంటి అధునాతన ఫీచర్లు పొందుపరచబడి ఉన్నాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు. అన్ని క్రెటా ఎలక్ట్రిక్ వేరియంట్‌లలో వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో , ఆపిల్ కార్‌ప్లే (అడాప్టర్ ద్వారా) అందుబాటులో ఉన్నాయని సమాచారం. టాప్ వేరియంట్‌లలో డాష్ కెమెరా , వెనుక వైర్లెస్ ఛార్జింగ్ లాంటి అదనపు ఫీచర్లు కూడా ఉన్నాయని తెలుస్తోంది. . హ్యూండై మ్యాట్ బ్లాక్ , షాడో గ్రే అనే కొత్త కలర్ ఆప్షన్‌లను కూడా ప్రవేశపెట్టిందని, దీని వల్ల వినియోగదారులకు మరింతగా చాయిస్ అందుబాటులోకి వచ్చినట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. మొత్తానికి పండుగ సీజన్ లో మూడు కొత్త ఈవీ వేరియంట్ల ద్వారా మార్కెట్ లో గణనీయమైన షేరును సొంతం చేసుకోవాలని కంపెనీ పట్టుదలగా ఉన్నట్లు తెలుస్తోంది.