Hyundai i20 Waiting Period: హ్యుందాయ్ తన కార్లకు సంబంధించిన అప్‌డేట్ చేసిన వెయిటింగ్ పీరియడ్‌ను రివీల్ చేసింది. హ్యుందాయ్ క్రెటా, వెన్యూ వంటి ఎంపిక చేసిన మోడళ్ల గురించి వెయిటింగ్ పీరియడ్ వివరాలు బయటకు వచ్చాయి.
వెయిటింగ్ పీరియడ్ ఎంత?
2024 మార్చిలో హ్యుందాయ్ ఐ20లో సీవీటీ వేరియంట్ కోసం 10 వారాల వరకు వెయిటింగ్ పీరియడ్ ఉంది. ఇతర వేరియంట్‌లను ఎంచుకునే కస్టమర్‌లు డెలివరీ కోసం ఆరు వారాల పాటు వేచి ఉండాల్సి ఉంటుంది. ఈ వెయిటింగ్ పీరియడ్ భారతదేశం అంతటా వర్తిస్తుంది. అయితే ప్రాంతం, వేరియంట్, రంగు, అనేక ఇతర కారకాలపై ఆధారపడి వైవిధ్యాలు ఉండవచ్చు.
ఈ కారులో 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్ ఉంది. ఇది 83 పీఎస్ పవర్, 115 ఎన్ఎం టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ యూనిట్ 5 స్పీడ్ మాన్యువల్ లేదా CVT ఆటోమేటిక్‌తో పెయిర్ అయింది. సీవీటీతో ఇది 88 పీఎస్ పవర్ అవుట్‌పుట్‌ను పొందుతుంది. మీకు ఈ హ్యాచ్‌బ్యాక్‌తో కూడిన టర్బో పెట్రోల్ ఇంజన్ కావాలంటే, మీరు హ్యుందాయ్ ఐ20 ఎన్ లైన్‌ని కొనుగోలు చేయాల్సి ఉంటుంది.
గత నెలలో హ్యుందాయ్ స్పోర్ట్స్ (O) వేరియంట్‌ను కంపెనీ ఐ20 లైనప్‌లో చేర్చింది. దీని ఎక్స్ షోరూమ్ ధర రూ. 8.73 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. ఈ కారు ఆరు వేరియంట్లలో ఎనిమిది రంగులలో లభిస్తుంది.
వేటితో పోటీ?
హ్యుందాయ్ ఐ20 భారత మార్కెట్లో మారుతి బలెనో, టయోటా గ్లాంజాతో పోటీ పడుతోంది. గ్లాంజా అనేది మారుతి బలెనో రీబ్యాడ్జ్డ్ మోడల్. డిజైన్, ఇంటీరియర్, ఫీచర్లు, ఇంజిన్ పరంగా రెండూ చాలా దగ్గరగా ఉంటాయి. రెండూ 1.2 లీటర్ నేచురల్లీ యాస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్‌ను కలిగి ఉన్నాయి. ఇది 88.50 బీహెచ్‌పీ పవర్‌ను, 113 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5 స్పీడ్ మ్యాన్యువల్, ఏఎంటీ ఆప్షన్లలో లభిస్తుంది. అంతేకాకుండా ఈ ఇంజన్ సీఎన్‌జీ ఆప్షన్‌తో కూడా వస్తుంది.