Hyundai Exter Cheapest Sunroof SUV In India 2025: GST 2.0 అమలు తర్వాత, Hyundai Exter S Smart దేశంలో అత్యంత తక్కువ ధర సన్‌రూఫ్ SUVగా మారింది. దీని కొత్త ధర ఇప్పుడు కేవలం ₹7.03 లక్షలు (ఎక్స్-షోరూమ్). ముఖ్యంగా, ఈ మైక్రో SUV టాటా పంచ్‌కు స్ట్రాంగ్ పోటీ పడుతుంది. హ్యుందాయ్ ఎక్స్‌టర్ బేస్ వేరియంట్ ₹5.49 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.
ఇంజిన్ & మైలేజ్హ్యుందాయ్ ఎక్స్‌టర్ ఎస్ స్మార్ట్ 1.2 లీటర్ కప్పా (Kappa) పెట్రోల్ ఇంజిన్‌తో పని చేస్తుంది, ఇది 81.8 bhp & 113.8 Nm టార్క్ జనరేట్ చేస్తుంది. ఈ మోడల్.. మాన్యువల్ & AMT గేర్‌బాక్స్ ఎంపికలతో అందుబాటులో ఉంది. పెట్రోల్ వేరియంట్ లీటరుకు దాదాపు 19.4 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది, CNG వేరియంట్ కిలోగ్రాముకు 27.1 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుంది. అంటే, ఈ కారు కేవలం పాకెట్ ఫ్రెండ్లీ మాత్రమే కాదు, అద్భుతమైన ఇంధన సామర్థ్యాన్ని కూడా అందిస్తుంది.
ఫీచర్లు & సౌకర్యంహ్యుందాయ్ ఎక్స్‌టర్ ప్రత్యేక లక్షణాలలో వాయిస్-ఎనేబుల్డ్ స్మార్ట్ సన్‌రూఫ్ ఉన్నాయి, ఈ బడ్జెట్‌లో కార్లలో సాధారణంగా కనిపించని ఫీచర్ ఇది. మెరుగైన డ్రైవింగ్, భద్రత కోసం ముందు & వెనుక డాష్‌క్యామ్‌లు కూడా ఉన్నాయి. క్యావైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో & ఆపిల్ కార్‌ప్లేకు మద్దతు ఇచ్చే 8-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను క్యాబిన్‌లో చూడవచ్చు. సేఫ్టీ ఫీచర్లలో - ఆరు ఎయిర్ బ్యాగులు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్ అసిస్ట్ & ISOFIX చైల్డ్ సీట్ యాంకర్లు ఉన్నాయి. ఇవన్నీ హ్యుందాయ్ ఎక్స్‌టర్‌కు తక్కువ ధరలోనే ప్రీమియం టచ్ ఇస్తాయి.
ఏ కార్లతో కాంపీట్ చేస్తుంది?ఈ ధరల శ్రేణిలో హ్యుందాయ్ ఎక్స్‌టర్‌కు చాలా పోటీ కార్లు ఉన్నాయి - Tata Punch, Maruti Suzuki Fronx, Maruti Suzuki Ignis, Nissan Magnite, Renault Kiger, Citroen C3 & Hyundai Venue (బేస్ వేరియంట్). అయితే, హ్యుందాయ్ ఎక్స్‌టర్ ఎస్ స్మార్ట్ దాని సన్‌రూఫ్ & ఆధునిక ఫీచర్ల కారణంగా డబ్బుకు తగిన విలువ కలిగిన SUVగా లెక్కించవచ్చు.
టాటా పంచ్ & మారుతి సుజుకి ఫ్రాంక్స్ GST ప్రభావంGST తగ్గింపు తర్వాత, టాటా పంచ్ ప్రారంభ ధర ₹6.19 లక్షల నుండి ₹5.49 లక్షలకు తగ్గింది. కస్టమర్లు ₹70,000 నుంచి ₹85,000 వరకు పొదుపు చేస్తున్నారు. మారుతి సుజుకి ఫ్రాంక్స్ అన్ని వేరియంట్లలో 9.27% నుంచి 9.46% వరకు ధర తగ్గింపును చూసింది. టాప్ వేరియంట్‌లో ₹1.11 లక్షల వరకు డబ్బు సేవ్ అవుతుంటే, బేస్ మోడల్ ధర ₹65,000 నుంచి ₹73,000 వరకు తగ్గింది.
SUV స్టైలింగ్, సన్‌రూఫ్ & మోడ్రన్ ఫీచర్లు ఉన్న బడ్జెట్ కారు కోసం మీరు గూగుల్ చేస్తుంటే, ఎక్స్‌టర్ మంచి ఆప్షన్ కావచ్చు. ఈ కాంపాక్ట్ SUVని సిటీ ట్రాఫిక్‌లో ఈజీగా ఉపయోగించుకోవచ్చు. లాంగ్ డ్రైవ్‌లలోనూ మంచి ఇంధన సామర్థ్యాన్ని రాబట్టవచ్చు.