Hyundai December 2025 Discounts: డిసెంబర్ వచ్చిందంటే కార్ల కంపెనీలు కస్టమర్లను ఆకర్షించేందుకు భారీ ఆఫర్లు ప్రకటించడం కొత్తేమీ కాదు. కానీ ఈసారి హ్యుందాయ్ మాత్రం మరింత ఆకట్టుకునేలా ‘December Delight 2025’ పేరుతో ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. మీరు హ్యుందాయ్ కార్ కొనాలని భావిస్తుంటే… ఇదే సరైన సమయం అనిపించేంత పెద్ద డిస్కౌంట్లు అందిస్తోంది. ఈ ఆఫర్లు డిసెంబర్ 31, 2025 వరకు మాత్రమే వర్తిస్తాయి. అయితే స్టాక్ అందుబాటులో ఉన్నంత వరకు మాత్రమే బెనిఫిట్స్‌ అందుబాటులో ఉంటాయని హ్యుందాయ్ స్పష్టంగా చెబుతోంది.

Continues below advertisement

ఏ మోడల్‌పై ఎంత లాభం ఉంది?, ఈ ఆఫర్లను ఆంధ్రప్రదేశ్‌ & తెలంగాణ (AP & Telangana) రాష్ట్రాల్లో కస్టమర్లు ఉపయోగించుకోగలరా అనే వివరాలను మీకోసం సింపుల్‌గా, ఈజీగా అర్ధం చేసుకునేలా ఇక్కడ ఇస్తున్నాం.

Hyundai Aura – రూ 33,000 వరకు లాభంమారుతి డిజైర్‌, హోండా అమేజ్‌లకు పోటీగా ఉండే ఈ సెడాన్‌పై డిసెంబర్ నెలలో రూ 33,000 వరకు ప్రయోజనాలు ఉన్నాయి. పెట్రోల్‌, CNG రెండు ఆప్షన్లలో లభించే ఈ కార్‌ ధరలు రూ 5.98 లక్షల నుంచి రూ 8.42 లక్షల వరకు ఉన్నాయి.రోజువారీ ఉపయోగంలో డబ్బు మిగుల్చుకోవాలనుకునే వారికి ఆరా మంచి సెడాన్‌గా ఉంటుంది.

Continues below advertisement

Hyundai Alcazar – రూ 40,000 వరకు ఆఫర్లుఇది 7-సీటర్ల SUV. పెద్ద కుటుంబాల కోసం ఆల్కజార్ మంచి ఆప్షన్‌. టాటా సఫారి, MG హెక్టర్ ప్లస్‌, మహీంద్రా XUV700 లకు పోటీగా ఉండే ఆల్కజార్‌పై ఈ నెలలో రూ 40,000 వరకు డిస్కౌంట్ లభిస్తోంది. ఈ SUV ధరలు రూ 14.47 లక్షల నుంచి రూ 20.96 లక్షల వరకు ఉన్నాయి. సిటీ డ్రైవ్‌, లాంగ్ డ్రైవ్ రెండింటికీ ఇది మంచి కంఫర్ట్‌ అనుభూతిని ఇస్తుంది. పెద్ద ఫ్యామిలీతో కలిసి లాంగ్‌ ట్రిప్‌ వేయడానికి చక్కగా ఉపయోగపడుతుంది.

Hyundai Grand i10 Nios – రూ 70,000 వరకు భారీ ప్రయోజనంమారుతి స్విఫ్ట్‌, టాటా టియాగోకి పోటీగా ఉండే నియోస్‌పై ఇప్పుడు రూ 70,000 వరకు భారీ లాభం లభిస్తోంది. ప్రైస్ రేంజ్ రూ 5.47 లక్షల నుంచి రూ 7.92 లక్షల వరకు ఉంది. 83hp పెట్రోల్‌, 69hp CNG ఆప్షన్లు ఉండటంతో బడ్జెట్ ఫ్రెండ్లీ కార్‌గా చాలామంది దీనిని ఎంచుకుంటారు.

Hyundai i20 – రూ 70,000 వరకు బెనిఫిట్స్‌యువత ఎక్కువగా ఇష్టపడే హ్యుందాయ్ i20 పై కూడా రూ 70,000 వరకు డిస్కౌంట్లు ఉన్నాయి. మారుతి బాలెనో, టయోటా గ్లాంజా, టాటా ఆల్ట్రోజ్‌కి పోటీగా ఉండే ఈ హ్యాచ్‌బ్యాక్‌ ధరలు రూ 6.87 లక్షల నుంచి రూ 11.46 లక్షల వరకు ఉన్నాయి. స్పోర్టీ N Line కూడా ఈ ఆఫర్లలో భాగమే.

Hyundai Verna – రూ 75,000 వరకు బెస్ట్ ఆఫర్సెడాన్ సెగ్మెంట్‌లో స్టైలిష్‌గా, శక్తిమంతమైన పనితీరుతో ఉండే వెర్నాపై రూ 75,000 వరకు డిస్కౌంట్ లభిస్తోంది. హోండా సిటీ, స్కోడా స్లావియా, వోక్స్‌వ్యాగన్ విర్టస్‌కు పోటీగా ఉండే వెర్నా ధరలు రూ 10.69 లక్షల నుంచి రూ 16.98 లక్షల రేంజ్‌లో ఉన్నాయి.

Hyundai Exter – రూ 85,000 వరకు హైయెస్ట్ డిస్కౌంట్హ్యుందాయ్ చిన్న SUV అయిన ఎక్స్‌టర్‌పై ఈ నెలలో అత్యంత పెద్ద ప్రయోజనం, రూ 85,000 వరకు అందుబాటులో ఉంది. టాటా పంచ్‌కు నేరుగా పోటీ ఇచ్చే ఈ SUV ధరలు రూ 5.49 లక్షల నుంచి రూ 9.33 లక్షల వరకు ఉన్నాయి.పెట్రోల్‌, CNG రెండు ఆప్షన్లూ అందుబాటులో ఉన్నాయి.

సిటీ ఆధారంగా ఆఫర్లు మారొచ్చుహ్యుందాయ్ స్పష్టంగా చెప్పినట్టే, డిస్కౌంట్‌లు నగరం నుంచి నగరానికి మారుతాయి. AP & Telanganaలోని హైదరాబాద్‌, విజయవాడ, విశాఖ, తిరుపతి, వరంగల్ వంటి సిటీల్లో ఆఫర్లలో కొంత తేడా ఉండొచ్చు. అందుకే మీ సమీప డీలర్‌ వద్ద కచ్చితమైన వివరాలు తెలుసుకోవడం మంచిది.

ఈ నెలలో హ్యుందాయ్ ఆఫర్లు నిజంగా ఆకట్టుకునేలా ఉన్నాయి. బడ్జెట్‌, ఫీచర్లు, కంఫర్ట్‌, ఫ్యామిలీ యూజ్... ఏది చూసినా ప్రతీ మోడల్‌లోనూ మంచి లాభం కనిపిస్తోంది. ఈ అవకాశాన్ని మిస్‌ కాకముందే మీకు నచ్చిన హ్యుందాయ్ కార్‌ను చెక్‌ చేసేయండి!

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.