మీరు ఆగస్టు 2026లో హ్యుందాయ్ క్రెటా కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తుంటే, ఇది మీకు మంచి వార్త కావచ్చు. ఈ నెలలో క్రెటా యొక్క కొన్ని పెట్రోల్ మరియు క్రెటా ఎన్ లైన్ (Creta N Line) వేరియంట్లపై రూ.1 లక్ష వరకు డిస్కౌంట్ ఇస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. అయితే ప్రతి క్రెటా మోడల్‌పై పూర్తి రూ.1 లక్ష ప్రయోజనం లభించదని మీరు తెలుసుకోవడం ముఖ్యం. వేరియంట్, పెట్రోల్ లేదా డీజిల్ ఇంజన్, ఎక్స్ఛేంజ్ మరియు స్క్రాపేజ్ వంటి షరతుల ఆధారంగా ఈ ఆఫర్లు మారుతుంటాయి.

Continues below advertisement

హ్యుందాయ్ క్రెటాపై ఎంత బెనిఫిట్ లభిస్తోంది?ఆగస్టులో క్రెటాకు చెందిన కొన్ని ఎంపిక చేసిన పెట్రోల్ వేరియంట్లు, క్రెటా ఎన్ లైన్‌లపై రూ.1 లక్ష వరకు ప్రయోజనం పొందవచ్చు.మరోవైపు, పెట్రోల్ IVT వేరియంట్‌పై ఈ ప్రయోజనం రూ.90 వేల వరకు లభిస్తుంది. బేస్ E పెట్రోల్ వేరియంట్‌పై రూ.85 వేల వరకు బెనిఫిట్ లభిస్తోంది. ముఖ్యమైన విషయం ఏంటంటే, క్రెటా డీజిల్ వేరియంట్‌పై ఆఫర్ తక్కువగా ఉంది. ఇందులో కేవలం రూ.10 వేల వరకు మాత్రమే ప్రయోజనం అందిస్తున్నారు. 

Continues below advertisement

రూ.1 లక్ష డిస్కౌంట్ అనేది నేరుగా కారు ధర నుండి తగ్గే క్యాష్ డిస్కౌంట్ కాదు. ఇందులో క్యాష్ లేదా కస్టమర్ బెనిఫిట్‌తో పాటు ఎక్స్ఛేంజ్ లేదా స్క్రాపేజ్ ఇన్సెంటివ్, కొన్ని అదనపు బోనస్‌లు ఉన్నాయి. మీకు ఎంత ప్రయోజనం లభిస్తుందనేది మీరు ఎంచుకునే వేరియంట్, సిటీ, డీలర్ వద్ద ఉన్న స్టాక్, పాత కారు ఎక్స్ఛేంజ్ పై ఆధారపడి ఉంటుంది. కనుక కారు కొనుగోలు చేయడానికి ముందు డీలర్ నుండి ఆఫర్‌కు సంబంధించిన పూర్తి వివరాలను ఖచ్చితంగా అడిగి తెలుసుకోవాలి.

Also Read: Wagon R CNGతో కిలో గ్యాస్‌తో ఎన్ని కిలోమీటర్లు జర్నీ చేయవచ్చు? సిటీ, హైవే మైలేజ్ వివరాలు ఇవిగో

క్రెటాలోని చాలా పెట్రోల్ వేరియంట్లు (ప్రత్యేకించి IVT మినహా), క్రెటా ఎన్ లైన్‌పై రూ.1 లక్ష వరకు బెనిఫిట్ లభిస్తోంది. క్రెటా నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ 1.5 లీటర్లతో వస్తుంది. దీనిని మాన్యువల్, IVT ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌లతో కొనవచ్చు. క్రెటా ఎన్ లైన్‌లో 1.5 లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ వస్తుంది. దీనితో మాన్యువల్, డ్యూయల్-క్లచ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్ ఉంది.

డీజిల్ క్రెటాపై ఆఫర్ ఎంతడీజిల్ క్రెటా కొనుగోలు చేయాలనుకుంటే ఆఫర్ చాలా తక్కువ ఇస్తున్నారు. డీజిల్ వేరియంట్‌పై రూ.10 వేలు మాత్రమే ఇస్తోంది. అంటే ఎంపిక చేసిన పెట్రోల్ వేరియంట్‌పై రూ.1 లక్ష ప్రయోజనానికి, డీజిల్ మోడల్ ఆఫర్‌కు మధ్య రూ.90 వేల వరకు వ్యత్యాసం ఉంది. ఎక్కువగా ప్రయాణించే కస్టమర్లకు మెరుగైన మైలేజ్, ఎక్కువ లో-ఎండ్ టార్క్‌ల కారణంగా డీజిల్ వెర్షన్ ఇప్పటికీ బెస్ట్ ఆప్షన్. 

హ్యుందాయ్ క్రెటా, క్రెటా ఎన్ లైన్ ఎక్స్-షోరూమ్ ధర దాదాపు రూ.10.91 లక్షల నుండి రూ.19.95 లక్షల వరకు ఉంటుంది. ఆగస్టు ఆఫర్‌ను నేరుగా ఈ ధర తగ్గింపు అనుకోవద్దు. ఆ ప్రయోజనం అనేది కస్టమర్, డీలర్ షరతులను బట్టి మారవచ్చు. కొనుగోలు చేయడానికి ముందు స్టాక్,  కారు తయారీ నెలను (మ్యానుఫాక్చరింగ్ మంత్) చెక్ చేయడం కూడా ముఖ్యం.

జులైలో క్రెటా అమ్మకాలు చాలా బాగానే ఉన్న సమయంలో ఈ ఆఫర్ ఇచ్చారు. జులై 2026లో హ్యుందాయ్ 18,088 క్రెటా యూనిట్లను డెలివరీ చేసింది. ఇది ఈ క్యాలెండర్ సంవత్సరంలో ఇప్పటివరకు అత్యధిక నెలవారీ సేల్స్. జూన్ నెలలో ఈ సంఖ్య కేవలం 7,168 యూనిట్లు.  జూన్‌లో సప్లయర్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం జరగడం వల్ల ఉత్పత్తి తగ్గింది. ఆ తర్వాత జులైలో ఉత్పత్తి, అమ్మకాలు రెంటిలోనూ రికవరీ కనిపించింది.

Also Read: నిస్సాన్ గ్రావైట్ CNG రియల్‌ మైలేజ్‌ టెస్ట్‌.. కేజీకి ఎంత దూరం వెళ్లిందంటే?

కొనుగోలు చేయడం మంచిదేనా..

ఆగస్టులో క్రెటా కొనుగోలు చేసేవారికి పెట్రోల్ వేరియంట్‌పై లభించే ఆఫర్ మరింత ఆకర్షణీయంగా ఉంది. అయితే రూ.1 లక్ష ప్రయోజనాన్ని చూసి బుక్ చేసుకునే ముందు, మీ విషయంలో ఇందులో ఎంత క్యాష్ బెనిఫిట్, ఎంత ఎక్స్ఛేంజ్/ స్క్రాపేజ్ బెనిఫిట్, ఇతర బోనస్‌లు లభిస్తాయో తెలుసుకోవడం ముఖ్యం.

ఇక డీజిల్ క్రెటాపై కేవలం రూ.10 వేలు ఆఫర్ లభిస్తోంది. కనుక పెట్రోల్, డీజిల్ మధ్య నిర్ణయం తీసుకునేటప్పుడు ధర, మైలేజ్, మీ డ్రైవింగ్ అవసరాలను దృష్టిలో ఉంచుకోవాలి.