Upcoming Hyundai Creta N Line: హ్యుందాయ్ కొత్త క్రెటా తదుపరి వెర్షన్‌ని సిద్ధం చేస్తుంది. ఇందులో క్రెటా ఎన్ లైన్ కూడా ఉంది. త్వరలో క్రెటాలో కూడా ఎన్ సిరీస్ కారు త్వరలో లాంచ్ కానుంది. క్రెటా కారు ఎన్ లైన్... ఐ20 ఎన్ లైన్ కంటే కాస్త హయ్యర్ రేంజ్‌లో రానుంది.
ఇటీవల లాంచ్ అయిన కొత్త క్రెటా ఎన్ లైన్ ఆధారంగా ఇందులో కొన్ని ముఖ్యమైన మార్పులు చేయనున్నారు. క్రెటా ఎన్ లైన్ కొత్త బంపర్ ఎక్స్‌టెన్షన్‌లు, సైడ్ స్కర్ట్‌లు, పెద్ద రియర్ స్పాయిలర్, రెడ్ బ్రేక్ కాలిపర్‌లతో కూడిన కొత్త 18 అంగుళాల వీల్స్‌తో స్టాండర్డ్ క్రెటా కంటే స్పోర్టివ్‌గా, అగ్రెసివ్‌గా కనిపిస్తుంది.
ఇతర ఎన్ లైన్ మోడళ్ల లాగానే ప్రత్యేక బ్లూ కలర్ క్రెటా ఎన్ లైన్‌లో కూడా కనిపిస్తుంది. వెనుక భాగంలో పెద్ద స్పాయిలర్, ప్రొట్రూడింగ్ ఎగ్జాస్ట్ సహా ఇంకెన్నో చూడవచ్చు. క్యాబిన్ గురించి చెప్పాలంటే స్టీరింగ్ వీల్ డిజైన్ స్టాండర్డ్ క్రెటాలోని డీ-కట్ స్టీరింగ్ వీల్‌కు భిన్నంగా ఉంటుంది. క్యాబిన్ పూర్తిగా నలుపు రంగుతో వస్తుంది. అలాగే లోపలి భాగంలో ఎరుపు రంగు స్ప్లాష్‌లు ఉపయోగించారు.
1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఇందులో అందించనున్నారు. కానీ డీసీటీ ఆటోమేటిక్‌తో పాటు ప్రాపర్ మాన్యువల్ వెర్షన్ కూడా ఉంటుంది. ఇప్పుడు కొత్త స్టాండర్డ్ క్రెటాలో టర్బో పెట్రోల్ మాన్యువల్ అందుబాటులో లేదు. ఈ టర్బో పెట్రోల్‌తో పాటు కొత్త క్రెటా ఎన్ లైన్ కూడా స్టిఫర్ సస్పెన్షన్, లౌడ్ ఎగ్జాస్ట్, ట్యూన్డ్ స్టీరింగ్ వీల్, మోర్ మొబిలిటీని పొందుతుంది.
కొత్త క్రెటా ఎన్ లైన్ ఈ ఏడాది మార్చిలో వచ్చే అవకాశం ఉంది. హ్యుందాయ్ క్రెటా ఎన్ లైన్‌కు ప్రస్తుతం కాంపిటీటివ్ కార్లు కూడా పెద్దగా లేవు. అయితే టైగన్ డీఎస్‌జీ జీటీ లైన్ పనితీరు పరంగా కొంత వరకు ఇక్కడ పోటీపడుతుంది. ఇందులో డ్యూయల్ క్లచ్ గేర్‌బాక్స్‌తో కూడిన 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ కూడా ఉంది.
మరోవైపు చైనీస్ కార్ల కంపెనీ బీవైడీ భారత దేశ మార్కెట్లో కొత్త చిన్న ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ బీవైడీ ఆట్టో 2ని లాంచ్ చేయనుంది. ఈ చిన్న ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ 2023 చివరిలో లాంచ్ కావడానికి ముందు చైనీస్ హోమోలోగేషన్ ఫైలింగ్‌లో కనిపించింది. ఆట్టో 2 ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ గ్లోబల్ మార్కెట్‌లో జీప్ అవెంజర్, హ్యుందాయ్ కోనా ఈవీ వంటి కార్లతో పోటీపడనుంది. బీవైడీ ఆట్టో 2 చైనాలో యువాన్ అప్ పేరుతో అందుబాటులో ఉంది. ఎందుకంటే ఆట్టో 3కి చైనా దేశంలో యువాన్ ప్లస్ అని పేరు పెట్టారు. ఫ్రంట్ వీల్ డ్రైవ్ లేఅవుట్‌తో, కొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ బీవైడీ కొత్త మూడో తరం ఈ-ప్లాట్‌ఫాం 3.0 ఎలక్ట్రిక్ కారు ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడి ఉంటుందని తెలుస్తోంది. కంపెనీ లైనప్‌లో డాల్ఫిన్ హ్యాచ్‌బ్యాక్, ఆట్టో 3 క్రాస్‌ఓవర్ మధ్య ఉండనుంది.