Hyundai Creta N Line Review: హ్యుందాయ్‌ క్రెటా N లైన్‌ కొని, ముంబై ట్రాఫిక్‌లో 17,500 కిలోమీటర్లు నడిపిన ఒక ఓనర్‌ ఇచ్చిన నిజ జీవితపు రిపోర్ట్‌ ఇది. ఈ కారుతో అతని అనుభవాన్ని ఆ వ్యక్తి మాటల్లోనే తెలుసుకుందాం. కొత్తగా కారు కొనేవాళ్లకు ఈ రివ్యూ తప్పకుండా ఉపయోగపడుతుంది.

Continues below advertisement

"పండుగల సీజన్‌ మొదలవ్వగానే నా లాంగ్‌ టర్మ్‌ హ్యుందాయ్‌ క్రెటా N లైన్‌కు ఒక ముఖ్యమైన అప్‌గ్రేడ్‌ చేశాను. హ్యుందాయ్‌ USB డాంగిల్‌ కొన్నాను. చిన్నదే అయినా, ప్రతిరోజూ ఉపయోగంలో పెద్ద మార్పు తీసుకొచ్చే అప్‌గ్రేడ్‌ ఇది. ఈ హ్యుందాయ్‌ USB డాంగిల్‌... వైర్‌లెస్‌ Apple CarPlay, Android Auto సపోర్ట్‌ చేస్తుంది.

ఈ యాక్సెసరీ కోసం కొన్ని నెలలుగా వెతుకుతున్నాను. ఎప్పుడూ స్టాక్‌లో లేకపోవడంతో ఆలస్యం అయింది. ఎట్టకేలకు దొరికింది. చెప్పాలంటే, దీని కోసం చేసిన రూ.4,500 ఖర్చు పూర్తిగా విలువైనదే. ఎలాంటి ల్యాగ్‌, గ్లిచ్‌లు లేకుండా వైర్‌లెస్‌ కనెక్టివిటీ ఇస్తోంది. ఇక ఫోన్‌ కనెక్ట్‌ చేయడానికి కేబుల్‌ అవసరం లేకపోవడం రోజువారీ డ్రైవ్‌ను మరింత సులభం చేసింది. ఫోన్‌ బ్యాటరీ కూడా కొంత ఊపిరి పీల్చుకుంటుందని అనిపిస్తోంది.

Continues below advertisement

మైలేజ్‌ విషయంలో మాత్రం నిరాశఇంత మంచి అప్‌గ్రేడ్‌ తర్వాత కూడా ఫ్యూయల్‌ మైలేజ్‌ సమస్య మాత్రం అలాగే ఉంది. పెట్రోల్‌లో ఎథనాల్‌ శాతం పెరగడం కారు మైలేజ్‌పై ప్రభావం చూపుతుందన్న అనుమానం నాకు ఉంది. ఇప్పుడు దానికి స్పష్టమైన ఆధారం దొరికింది. ఇటీవల నేను చేసిన ఒక టెస్ట్‌లో... E10 ఫ్యూయల్‌తో 12.12 kmpl మైలేజ్‌ ఇచ్చింది, E20 ఫ్యూయల్‌తో 10.59 kmpl మాత్రమే మైలేజ్‌ ఇచ్చింది. అంటే దాదాపు 12 శాతం మైలేజ్‌ తగ్గింది. నా రోజువారీ ప్రయాణం చిన్నది, ట్రాఫిక్‌తో కూడుకున్నది కావడంతో మైలేజ్‌ మరింత తగ్గి సుమారు 8 kmpl వద్దే ఆగింది. నిజం చెప్పాలంటే ఇది కాస్త గట్టి దెబ్బే. రోజూ ఎక్కువ ట్రాఫిక్‌లో తిరిగేవాళ్లకు దాదాపుగా ఇదే పరిస్థితి ఉండొచ్చు.

మధ్యలో చిన్న సమస్యకొంతకాలం తర్వాత, కారు టైరు పంక్చర్‌ అయింది. అంతేకాదు, ఒకరోజు అకస్మాత్తుగా కారు డిజిటల్‌ డిస్‌ప్లేలో ఎన్నో వార్నింగ్‌లు కనిపించాయి. వెంటనే దగ్గరలోని హ్యుందాయ్‌ వర్క్‌షాప్‌ను సంప్రదించాను. మరుసటి రోజే స్లాట్‌ ఇచ్చారు. ఆ పరిశీలనలో, వైరింగ్‌ దెబ్బతినడం కారణమని గుర్తించారు. ముంబైలో ఎలుకల సమస్య ఇది. వైర్లు చక్కగా రిపేర్‌ చేసి, అదే రోజున కారు ఇంటికి పంపించారు. ఖర్చు కేవలం రూ.1,700 మాత్రమే. గతంలో నా వెర్నాకు కూడా ఇదే సమస్య వచ్చింది. 

రోజువారీ వాడకంలో అనుభవంఈ చిన్న సంఘటనలు తప్పితే, క్రెటా N లైన్‌ ఇప్పటికీ నన్ను నిరాశపరచలేదు. లుక్‌ చాలా స్టైలిష్‌గా ఉంటుంది (సౌండ్‌ మాత్రం అంత స్పోర్టీగా లేదు). కుటుంబానికి సరిపడే స్థలం ఉంది. అన్ని ఫీచర్లు నమ్మకంగా పని చేస్తున్నాయి. ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది 360 డిగ్రీ కెమెరాలు. ఇవి డ్రైవింగ్‌, పార్కింగ్‌ సమయంలో అద్భుతమైన విజువల్‌ క్లారిటీ ఇస్తున్నాయి.

గతంలో చాలా మోడళ్లను నడిపిన అనుభవం నాకు ఉంది. ఆ అనుభవంతో చెబుతున్నాను - హ్యుందాయ్‌ క్రెటా N లైన్‌ను డ్రైవ్‌ చేసినప్పుడు సంతోషంగా అనిపించింది. 

కీలక విషయాలు:

హ్యుందాయ్‌ క్రెటా N లైన్‌ (ఎక్స్‌-షోరూమ్‌) ధర: రూ.20.09 లక్షలుఈ రివ్యూ ఇచ్చే సమయానికి తిరిగిన దూరం: 17,716 కిలోమీటర్లుసగటు మైలేజ్‌: 7.9 kmplమెయింటెనెన్స్‌ ఖర్చు: వైరింగ్‌ రిపేర్‌ – రూ.1,700లోపాలు: ఇప్పటి వరకు లేవు

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.