Hyundai Creta Price, Down Payment, Car Loan and EMI Details: హ్యుందాయ్ క్రెటా SUV, తెలుగు ప్రజలకు ఇష్టమైన ఫోర్‌వీలర్లలో ఒకటి. ఆంధ్రప్రదేశ్ &తెలంగాణలో ఈ హ్యుందాయ్ కారు ఎక్స్-షోరూమ్ ధర రూ. 11.11 లక్షల నుంచి ప్రారంభమై రూ. 20.50 లక్షల వరకు (Hyundai Creta ex-showroom price, Hyderabad Vijayawada) ఉంటుంది. మీ జీతం రూ. 50 వేలు అయితే మీరు ఈ కారును ఎంచక్కా ఇంటికి తీసుకువెళ్లవచ్చు.
తెలుగు రాష్ట్రాల్లో ఆన్-రోడ్ ధరమీరు ఈ కారును హైదరాబాద్‌లో కొంటే, ఎక్స్-షోరూమ్ రేటుతో పాటు రిజిస్ట్రేషన్ కోసం దాదాపు రూ. 1.93 లక్షలు, బీమా కోసం దాదాపు రూ. 60,000, ఇతర ఖర్చుల కోసం దాదాపు రూ. 12,000 చెల్లించాలి. ఇవన్నీ కలుపుకుని, భాగ్యనగరంలో ఈ బండి దాదాపు రూ. 13.76 లక్షలకు (Hyundai Creta on-road price, Hyderabad) రోడ్డు మీదకు వస్తుంది.
విజయవాడలో హ్యుందాయ్ క్రెటాను ఇంటికి తీసుకువెళ్లాలంటే, రిజిస్ట్రేషన్ కోసం దాదాపు రూ. 1.89 లక్షలు, బీమా కోసం దాదాపు రూ. 58,000, ఇతర ఖర్చుల కోసం దాదాపు రూ. 12,000 చెల్లించాలి. ఇవన్నీ కలుపుకుని, దాదాపు రూ. 13.69 లక్షలకు (Hyundai Creta on-road price, Vijayawada) బెజవాడలో ఈ బండి కీ మీ చేతిలోకి వస్తుంది.
మీరు ఇంత బడ్జెట్ పెట్టలేకపోతే, ఒకేసారి చెల్లించడానికి బదులుగా, కారు లోన్‌పై కూడా మీ డ్రీన్ కారును కొనుగోలు చేయవచ్చు. తద్వారా, పెద్దగా ఆర్థిక భారం లేకుండా ప్రతి నెలా నిర్ణీత మొత్తాన్ని EMI రూపంలో చెల్లిస్తే సరిపోతుంది. అంటే, మీ డబ్బును పెద్ద మొత్తంలో కదిలించాల్సిన అవసరం లేకుండానే ఈ కారును సొంతం చేసుకునే వెసులుబాటు ఉంది.
హ్యుందాయ్ క్రెటా కోసం నెలకు ఎంత EMI చెల్లించాలి? ఉదాహరణకు, మీరు విజయవాడలో హ్యుందాయ్ క్రెటాను కార్ లోన్‌పై కొనాలనుకుంటే, ముందుగా కనీసం రూ. 2.60 లక్షలు డౌన్ పేమెంట్ చేయాలి. మిగిలిన రూ. 11.09 లక్షలను కార్ లోన్ తీసుకుని చెల్లించవచ్చు. బ్యాంక్, ఈ లోన్‌పై 9% వడ్డీ రేటు వసూలు చేస్తుందని అనుకుంటే...
7 సంవత్సరాల కోసం కార్ లోన్ తీసుకుంటే, మీరు ప్రతి నెలా రూ. 17,844 EMIని బ్యాంకులో డిపాజిట్ చేయాలి
6 సంవత్సరాల్లో లోన్ క్లియర్ చేయాలనుకుంటే, మీరు ప్రతి నెలా రూ. 19,992 EMIని బ్యాంకులో డిపాజిట్ చేయాలి
5 సంవత్సరాల రుణ కాలపరిమితిని ఎంచుకుంటే, మీరు ప్రతి నెలా రూ. 23,022 EMIని బ్యాంకులో డిపాజిట్ చేయాలి
4 సంవత్సరాల్లో అప్పు మొత్తం తీర్చేయాలంటే, మీరు ప్రతి నెలా రూ. 27,599 EMIని బ్యాంకులో డిపాజిట్ చేయాలి
మీ నెలవారీ జీతం రూ. 50,000 అయితే, ఈ కారు 7 సంవత్సరాల EMI ఆప్షన్ ఎంచుకోవచ్చు. మీ జీతం లేదా నెలవారీ ఆదాయం రూ. 50,000 కంటే ఎక్కువ ఉంటే, మీరు ఎక్కువ మొత్తాన్ని కార్ లోన్ కోసం మళ్లించగలిగితే, 5 లేదా 6 సంవత్సరాల EMI ఆప్షన్ ఎంచుకోవచ్చు.
మీరు ఎంత ఎక్కువ మొత్తాన్ని డౌన్ పేమెంట్ చేయగలిగితే, మీరు తీసుకునే కారు రుణం అంత తగ్గుతుంది, EMI మొత్తం కూడా తగ్గుతుంది.
హ్యుందాయ్ క్రెటా కొనడానికి కార్ లోన్ తీసుకునే ముందు అన్ని పత్రాలను జాగ్రత్తగా చదవడం ముఖ్యం. బ్యాంకుల విభిన్న విధానాల కారణంగా లోన్ EMI గణాంకాలలో తేడా ఉండవచ్చు.