Hyundai Creta Electric Price, Down Payment, Car Loan EMI Details: హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్‌ లుక్‌ చాలా స్టైలిష్‌గా ఉంటుంది, ప్రీమియం SUV ఫీలింగ్‌ ఇస్తుంది. కారు ముందు భాగంలో క్లోజ్డ్‌ గ్రిల్‌, షార్ప్‌ హెడ్‌ల్యాంప్స్‌, డే‌టైమ్‌ రన్నింగ్‌ లైట్స్‌ (DRLs) ఫ్యూచరిస్టిక్‌ లుక్‌ అందిస్తున్నాయి. సైడ్‌ ప్రొఫైల్‌లో ఏరోడైనమిక్‌ డిజైన్‌, అల్లాయ్‌ వీల్స్‌ ఈ SUV కి స్పోర్టీ అట్రాక్షన్‌ ఇస్తున్నాయి. వెనుక భాగంలో స్లీక్‌ టెయిల్‌ ల్యాంప్స్‌, క్లీన్‌ లైన్స్‌ వంటివి క్రెటా ఎలక్ట్రిక్‌ డిజైన్‌ను మరింత మోడ్రన్‌గా చూపిస్తున్నాయి.

తెలుగు రాష్ట్రాల్లో, హ్యుందాయ్ ఎలక్ట్రిక్ SUV 'క్రెటా' బేస్‌ వేరియంట్‌ (Executive 42KWh) ఎక్స్-షోరూమ్ ధర రూ. 18.02 లక్షలు. విజయవాడలో కొనుగోలు చేస్తే, దాదాపు రూ. 12,000 RTO ఛార్జీలు, దాదాపు రూ. 77,000 బీమా, దాదాపు రూ. 19,000 ఇతర ఛార్జీలు చెల్లించాలి. ఇవన్నీ కలిపితే, ఈ కారు ఆన్-రోడ్ ధర దాదాపు రూ. 19.10 లక్షలు అవుతుంది. హైదరాబాద్‌లో ఆన్‌-రోడ్‌ ధర దాదాపు రూ. 19.12 లక్షలు అవుతుంది.

మీరు, హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్ కారును కొనాలనుకుంటే, కేవలం రూ. 2 లక్షల డౌన్ పేమెంట్ చెల్లిస్తే చాలు. మిగిలిన మొత్తాన్ని కార్‌ లోన్‌గా తీసుకుని, ప్రతి నెలా EMI కట్టుకుంటే వెళితే సరిపోతుంది.

2 లక్షల డౌన్ పేమెంట్‌పై EMI ఎంత అవుతుంది?ఉదాహరణకు, మీరు విజయవాడలో హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్ కారులో  Executive 42KWh వేరియంట్‌ కొనాలనుకుంటే, రూ. 2 లక్షల డౌన్ పేమెంట్ చెల్లించిన తర్వాత, రూ. 17.10 లక్షలకు కార్‌ లోన్‌ తీసుకోవాలి. బ్యాంక్‌, మీకు ఈ రుణాన్ని 9% వార్షిక వడ్డీ రేటుతో మంజూరు చేసిందని అనుకుందాం. ఇప్పుడు EMI ఆప్షన్లు చూద్దాం.

7 సంవత్సరాల కాలానికి రుణం తీసుకుంటే, మీ నెలవారీ EMI రూ. 27,504 అవుతుంది. ఈ ఏడేళ్లలో మీరు మొత్తం రూ. 6,00,812 వడ్డీ చెల్లించాలి.

6 సంవత్సరాల కాల పరిమితితో అప్పు తీసుకుంటే, మీ నెలవారీ EMI రూ. 30,815 అవుతుంది. ఈ ఆరేళ్లలో మొత్తం రూ. 5,09,156 వడ్డీ చెల్లించాలి.

5 సంవత్సరాల్లో రుణం తీర్చేయాలనుకుంటే, మీ నెలవారీ EMI రూ. 35,486 అవుతుంది. ఈ ఐదేళ్లలో మొత్తం రూ. 4,19,636 వడ్డీ చెల్లించాలి.

4 సంవత్సరాల్లో లోన్‌ మొత్తం క్లియర్‌ చేయాలనుకుంటే, మీ నెలవారీ EMI రూ. 42,541 అవుతుంది. ఈ నాలుగేళ్లలో మొత్తం రూ. 3,32,444 వడ్డీ చెల్లించాలి.

హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్ పోటీ కార్లు క్రెటా ఎలక్ట్రిక్, ప్రస్తుతం, MG Windsor Pro EV & Tata Curvv EV తో నేరుగా పోటీ పడుతోంది. రాబోయే కాలంలో, ఇది Maruti Suzuki E Vitara, Toyota Electric Hyryder & Tata Harrier EV వంటి ఎలక్ట్రిక్ SUVల నుంచి గట్టి పోటీని ఎదుర్కోవలసి ఉంటుంది. 

మీరు ఎలక్ట్రిక్ SUV కొనాలని ఆలోచిస్తుంటే, ప్రస్తుతం ఉన్న కార్లలో, హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్ మీకు మంచి ఎంపిక. ఈ కారు ధర కాస్త ఎక్కువ అనిపించినప్పటికీ... ఫీచర్లు & ఎలక్ట్రిక్ డ్రైవింగ్ అనుభవాన్ని పరిగణనలోకి తీసుకుంటే, ఈ SUV ప్రాక్టికల్‌ & ప్రీమియం ఆప్షన్‌గా నిలుస్తుంది.