Hyundai Creta Electric Long Term Report: హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్ మన మార్కెట్లోకి వచ్చినప్పటి నుంచి చాలా మంది దృష్టిని ఆకర్షించింది. ఈ ఎలక్ట్రిక్ SUVని 6000 km డ్రైవ్ చేసిన తర్వాత వచ్చిన రియల్ లైఫ్ అనుభవం ఎలా ఉంటుంది?. రోజువారీ ప్రయాణం, ఫెస్టివల్ ట్రాఫిక్, కుటుంబ సభ్యుల అభిప్రాయాలు, మొదటిసారి చూసే వారి స్పందనలు.. అన్నీ ఈ రిపోర్ట్‌లో ఉన్నాయి. పేపర్‌పై ఉన్న ఫీచర్లతో పోలిస్తే రియల్ యూజ్ ఎలా ఉందో తెలుసుకోవాలనుకునే వారికి ఈ లాంగ్ టర్మ్ రివ్యూ చాలా ఉపయోగపడుతుంది.
కుటుంబ సభ్యుల స్పందన: కంఫర్ట్‌లో టాప్
ఈ దీపావళి సెలవుల్లో, రచయిత (హ్యుందాయ్ క్రెటా ఓనర్) తన కుటుంబ సభ్యులు, స్నేహితులందరితో కలిసి Creta Electricను డ్రైవ్ చేశారు. అందులో, ముఖ్యంగా ఆయన తల్లి, తరచూ ప్రయాణించే వారు కాబట్టి, ఈ కారుకు బాగా అలవాటు పడ్డారు. ప్యాసింజర్ డోర్‌ను లాక్ తీయడానికి హ్యాండిల్ లాగడం మాత్రమే సరిపోదని, లోపల మాన్యువల్‌గా అన్‌లాక్ చేయాల్సిందేనని ఆమె చెప్పారు. ఈ చిన్న ఫీచర్ చాలా కార్లలో ఉన్నా, కొన్నింటిలో లేనందుకు ఆశ్చర్యం కలిగించిందన్నారు. అయితే, తెలుపు రంగులోని ఇంటీరియర్ అప్‌హోల్స్టరీ మాత్రం నాలుగు నెలల్లోనే బ్రౌన్ షేడ్‌లోకి మారటం ఆమె గుర్తించారు. ఇది క్లీనింగ్ విషయంలో కాస్త బ్యాడ్ న్యూస్.
కారు ఎత్తుగా ఉండటం వల్ల "సీట్ బిఫోర్ ఫీట్" టెక్నిక్ ద్వారా సీనియర్ సిటిజన్లు కూడా సులభంగా ఎక్కగలరు.
ఫ్రెండ్స్ ఫస్ట్ ఇంప్రెషన్: స్టైల్ కన్నా ఫంక్షనాలిటీ బెటర్
చాలా మంది ఫ్రెండ్స్, ఈ కారు మొదటి చూపులోనే క్రెటా అని గుర్తించారు. కానీ, అది ఎలక్ట్రిక్ అన్న విషయం మాత్రం దాని సైలెన్స్ వలనే తెలిసింది. ఎలక్ట్రిక్ SUV కొనాలనుకునే కొందరికి దీనిని చూపించినప్పుడు, మిక్స్‌డ్ రియాక్షన్ ఇచ్చారు. ఎఫిషియెన్సీ, ఫీచర్లు, పెద్ద కేబిన్, కంఫర్ట్, బోస్ సౌండ్ సిస్టమ్ వంటివాటిని మెచ్చుకున్నారు. అయితే, అందరూ ఒకే పాయింట్ దగ్గరా ఆగారు & అడిగారు, అది - “₹26 లక్షల కారు అయితే, ఔట్‌సైడ్‌లో కాస్త స్పెషల్‌గా కనిపించాలి కదా?”.
చుట్టుపక్కల వాళ్లు, చుట్టాల దగ్గర కూడా ఈ మాట చాలా సార్లు వినిపించింది. అంతేకాదు, ఇంటీరియర్ కూడా వారికి కాస్త ప్లాస్టిక్‌గా అనిపించింది. ఆసక్తికరంగా, రచయిత చెప్పిన ఎర్గోనామిక్స్, స్టోరేజ్ స్పేస్ లాంటి ఫంక్షనల్ విషయాలను వాళ్లు పెద్దగా పట్టించుకోలేదు. దీని అర్ధం.. కొత్తగా SUV కొనే కుటుంబానికి క్రెటా క్లాసీగా కనిపిస్తుంది. కానీ రెండో లేదా మూడో కారు కొనేవారికి ఇది చాలా సాధారణంగానే అనిపించవచ్చు.
కంఫర్ట్ & బోస్ సౌండ్ – ఎవ్వరూ తిరస్కరించని అంశాలు
ఎవరైనా కారు లోపల కూర్చునగానే "ఎంత కంఫర్ట్‌గా ఉందో!" అని చెప్పకుండా ఉండలేకపోయారు. బోస్ సౌండ్ సిస్టమ్ మ్యూజిక్ ఆన్ చేస్తే, ఈ కారులోని చిన్నపాటి లోపాలన్నీ మర్చిపోయేలా చేసిందని అందరూ ఒప్పుకున్నారు. ఈ మ్యూజిక్ సిస్టమ్ Creta Electric పెద్ద బలంగా చెప్పాలి.
ప్రాక్టికల్ పాయింట్: చిన్న లోపాలు మాత్రం ఉన్నాయి
బూట్‌లో చిన్న బ్యాగులు పెట్టేందుకు హుక్‌లు లేకపోవడం ఒక చిన్న అసౌకర్యం. బంజీ స్ట్రాప్ టెథర్లు ఉన్నా, హ్యాంగింగ్ హుక్‌లు లేకపోవడం కొన్ని సందర్భాల్లో ఇబ్బందిగా ఉంటుంది.
క్రీమ్ కలర్ రీసైకిల్డ్ ప్లాస్టిక్ ఇంటీరియర్ చాలా త్వరగా మురికిగా మారటం కూడా అసహనానికి గురిచేస్తుంది.
కొన్ని చిన్న లోపాలు ఉన్నప్పటికీ, మొత్తం మీద చూసుకుంటే, Hyundai Creta Electric చాలా బాగా పని చేసే SUV. క్రెటా EV అయినా, ICE అయినా... దీని కంఫర్ట్, ఫీచర్లు, ప్రశాంతమైన డ్రైవ్, మ్యూజిక్ క్వాలిటీ, స్పేస్ వంటివన్నీ దీనిని ఒక ‘నమ్మకమైన ఫ్యామిలీ కార్’గా నిలబెడతాయి.
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్‌డేట్స్ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.