Hyundai Alcazar Facelift: హ్యుందాయ్ త్వరలో భారత మార్కెట్లో కొత్త ఎస్‌యూవీని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. హ్యుందాయ్ కార్లకు దేశంలో మంచి స్పందన వస్తుంది. ఇదిలా ఉండగా కంపెనీ ఇప్పుడు తన కొత్త ఎస్‌యూవీ హ్యుందాయ్ అల్కాజర్ ఫేస్‌లిఫ్ట్‌ని (Hyundai Alcazar Facelift) విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ కారు ఇండియాలో చాలాసార్లు టెస్టింగ్‌లో కనిపించింది. ఈ కారు కూడా ఈ ఏడాదే మార్కెట్లో విడుదలయ్యే అవకాశం ఉంది.


హ్యుందాయ్ అల్కజార్ ఫేస్‌లిఫ్ట్ పవర్‌ట్రెయిన్ ఎలా ఉంది? (Hyundai Alcazar Facelift Engine)
ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం అల్కజార్ ఫేస్‌లిఫ్ట్ ఇంజిన్‌లో ఎటువంటి మార్పు ఉండదు. ఈ ఎస్‌యూవీలో 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్‌తో పాటు 1.5 లీటర్ టర్బో డీజిల్ ఇంజన్ అందించనున్నారు. ఇందులో 6 స్పీడ్ మాన్యువల్‌తో పాటు 6 స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్ కూడా అందించనున్నారు.


హ్యుందాయ్ అల్కజార్ ఫేస్‌లిఫ్ట్ డిజైన్ ఎలా ఉండనుంది? (Hyundai Alcazar Facelift Design)
కొత్త హ్యుందాయ్ అల్కజార్ ఫేస్‌లిఫ్ట్ డిజైన్ గురించి చెప్పాలంటే ఈ కారును కొత్త హ్యుందాయ్ క్రెటా తరహాలో లాంచ్ చేయవచ్చు. ఇది కొత్త ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్‌లతో కూడిన కొత్త గ్రిల్, కొత్త ఎల్ఈడీ డీఆర్ఎల్‌ని కూడా కలిగి ఉంటుంది. దీంతో పాటు డ్యూయల్ టోన్ అల్లాయ్ వీల్స్ కూడా కొత్త బంపర్‌తో చూడవచ్చు. ఈ రాబోయే ఎస్‌యూవీ కొత్త టెయిల్‌గేట్‌తో పాటు స్టైలిష్ టర్న్ ఇండికేటర్‌లను కూడా కలిగి ఉంటుంది.


Also Read: 4 లక్షల స్కూటర్లు వెనక్కి తీసుకుంటున్న సుజుకి- మీ దగ్గర ఉంటే వెంటనే షోరూమ్‌కి తీసుకెళ్లండి


హ్యుందాయ్ అల్కజార్ ఫేస్‌లిఫ్ట్ ఫీచర్లు ఎలా ఉంటాయి? (Hyundai Alcazar Facelift Features)
ఇప్పుడు దీని ఫీచర్ల గురించి చెప్పాలంటే... కొత్త హ్యుందాయ్ అల్కజార్ ఫేస్‌లిఫ్ట్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్‌తో కూడిన 10.25 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను కూడా కలిగి ఉంటుంది. ఇది ఏడీఏఎస్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లతో కూడిన డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను కూడా కలిగి ఉంటుంది. ఇది మాత్రమే కాకుండా 64 కలర్ల ఆంబియంట్ లైటింగ్, బోస్ సౌండ్ సిస్టమ్, ఎయిర్ ప్యూరిఫైయర్, పనోరమిక్ సన్‌రూఫ్, వైర్‌లెస్ ఛార్జింగ్ వంటి సౌకర్యాలు కూడా కారులో అందించనున్నారు.


హ్యుందాయ్ అల్కజార్ ఫేస్‌లిఫ్ట్ ధర ఎంత? (Hyundai Alcazar Facelift Expected Price in India)
హ్యుందాయ్ ఇంకా దీని ధరల గురించి ఎటువంటి సమాచారాన్ని షేర్ చేయలేదు. కానీ కంపెనీ హ్యుందాయ్ అల్కజార్ ఫేస్‌లిఫ్ట్‌ ప్రారంభ ఎక్స్ షోరూమ్ ధర రూ. 17 లక్షల నుంచి 21 లక్షల మధ్య ఉండనుందని తెలుస్తోంది. ఈ కారు 5 సీటర్, 7 సీటర్ రెండు వేరియంట్లలో లాంచ్ కానుంది. మార్కెట్లో టాటా హారియర్, ఎంజీ హెక్టర్, మహీంద్రా ఎక్స్‌యూవీ700 వంటి ప్రీమియం కార్లకు గట్టి పోటీని ఇవ్వడంలో కూడా ఈ కారు విజయవంతం అవుతుంది.



Also Read: మహీంద్రా థార్ 5 డోర్స్‌ వెర్షన్‌ ROXXలో అదిరిపోయే ఫీచర్ - సేల్స్ దుమ్ములేపాలని టార్గెట్