Maruti Brezza Hyderabad On Road Price:హైదరాబాద్‌లో రోడ్లపై సొంత కారు డ్రైవ్ చేయాలనే కోరిక ప్రతి ఉద్యోగికి, వ్యాపారవేత్త, మధ్యతరగతి వ్యక్తికి ఉంటుంది. కంపాక్ట్ ఎస్‌యూవీ విభాగంలో మార్కెట్‌ను శాసిస్తున్న మారుతి సుజుకి బ్రెజ్జా ఎప్పటికప్పుడు భారతీయుల ఫేవరెట్ ఛాయిస్‌గా నిలుస్తోంది. అయితే షోరూమ్‌లో చూస్తే ఎక్స్‌షోరూమ్ ధర ఒకటైతే, మన చేతికి వచ్చేసరికి పడే ఆన్‌రోడ్ ప్రైస్ మరొకటి. హైదరాబాద్‌లో బ్రెజ్జా వేరియంట్ల అసలు ఆన్‌రోడ్ ధర ఎంత? నెలకు ఎంత ఈఎమ్‌ఐ పడుతుంది? మిమ్మల్ని ఆర్థికంగా ఇబ్బంది పెట్టకుండా ఈ కారు సేఫ్‌గా కొనుగోలు చేయాలి అంటే మీ నెలవారీ శాలరీ లేదా ఆదాయం ఎంత ఉండాలి?
హైదరాబాద్‌లో మారుతి బ్రెజ్జా అన్‌రోడ్ ప్రైస్
హైదరాబాద్‌లో కారు కొనేటప్పుడు కేవలం ఎక్స్‌షోరూమ్ ధర చూసి బడ్జెట్ ఫిక్స్ చేసుకుంటే పొరపాటే. తెలంగాణ రాష్ట్రంలో లైఫ్ ట్యాక్స్, ఇన్సూరెన్స్, డిజిటల్ రిజిస్ట్రేషన్, టీడీఎస్, ఇతర ఫాస్టాగ్ ఫీజులు కలిపితే ఆన్‌రోడ్ ప్రైస్ గణనీయంగా మారుతుంది. ప్రస్తుతం మారుతి బ్రెజ్జా ఎక్స్-షోరూమ్ ధర 7.40 లక్షల నుంచి ప్రారంభమై టాప్ ఎండ్ వేరియంట్‌కు 13. 71లక్షల వరకు ఉంటుంది. కానీ మన హైదరాబాద్ పరిధిలో బేస్ వేరియంట ఎక్స్ షోరూమ్ ధర 7.40 లక్షలు కాగా తెలంగాణ ఆర్టీవో పన్నులు, ఇన్సూరెన్స్ కలిపి ఆన్‌రోడ్ ధర 8.80 లక్షల వరకు చేరుకుంటుంది. మిడ్ వేరియంట్ ఆన్‌రోడ్ ధర 10.95లక్షల నుంచి 11.80 లక్షల మధ్య ఉంటుంది. టాప్ ఎండ్ వేరియంట్ ఆన్‌రోడ్ రేటు 16.85 లక్షల నుంచి 17.04లక్షల వరకు ఉంటుంది.
ఈఎంఐ, డౌన్‌పేమెంట్ వివరాలు ఇవే
కారును పూర్తిగా క్యాష్‌తో కంటే 80 శాతం 90 వరకు బ్యాంక్‌లోన్ ద్వారా కొనుగోలు చేయడానికి ఎక్కువ మంది మొగ్గు చూపుతారు. సాధారణంగా బ్యాంకులు 8.5 నుంచి 9.5 శాతం వరకు వడ్డీ రేటు ఆఫర్ చేస్తున్నాయి. బేస్ వేరియంట్ తీసుకుంటే డౌన్‌పేమెంట్ దాదాపు 1.76 లక్షలు చెల్లించాలి. అప్పుడు 7.04 లక్ష రూపాయల రుణం పొందవచ్చు. దీనికి వడ్డీ రేటు 9శాతం ఉంటే, ఐదేళ్ల కాలపరిమితికి తీసుకుంటే నెలు 14, 613 పడుతుంది. ఏడేళ్ల కాలపరిమితికి తీసుకుంటే 11, 310 రూపాయల ఈఎంఐ చెల్లించాలి.
టాప్ వేరియంట్ లోన్‌పై తీసుకుంటే డౌన్‌పేమెంట్ 3.37 లక్షలు చెల్లించాలి. మిగతా 13. 48 లక్షలు రుణం రూపంలో తీసుకోవాల్సి ఉంటుంది. దీనికి వడ్డీ 9 శాతం ఉంటే ఐదేళ్ల కాలపరిమితికి నెలకు 27, 980 చెల్లించాలి. ఏడేళ్ల టెన్యూర్‌కు నెలకు 21, 650 రూపాయలు కట్టాలి.
నెలకు ఎంత ఆదాయం/శాలరీ వస్తే బ్రెజ్జా కొనడం మంచిది?
ఫైనాన్షియల్ ఎక్స్‌పర్ట్స్ ప్రకారం కారు కొనుగోలు చేసేటప్పుడు 20/4/10 సూత్రాన్ని పాటించాలి. అంటే ఆన్‌రోడ్ ధరలో 20 శాతం డౌన్‌పేమెమంట్ చెల్లించాలి. దీనికి సొంత నిధులు ఉండాలి. నాలుగేళ్ల గడువు లోన్ క్లియర్ చేయించాలి. మీ నెలవారీ ఆదాయంలో కారు EMI వాటా 15శాతానికి మించకూడదు. పెట్రోల్/ సీఎన్జీ రన్నింగ్ ఖర్చులు, మెయింటెనెన్స్ కలిపినా మీ టెక్ హోమ్ శాలరీలో 20 శాతం లోపే ఉండాలి.
ఈ లెక్కల ప్రకారం బేస్ వేరియంట్ కొనుగోలు చేయాలంటే మీకు కనీసం 65 వేల నుంచి 75వేల జీతం వస్తూ ఉండాలి. మిడ్ వేరియంట్ కొనుగోలు చేయాలంటే మీ నెల జీతం 90 వేల నుంచి లక్షా పదివేల వరకు ఉండాలి. టాప్ వేరియంట్ కొనుగోలు చేయాలంటే మీ నెల వారీ సంపాదన లక్షా 30 వేల నుంచి 1 లక్షా 50 వేల వరకు ఉండాలి.
కారు అనేది డిప్రిషియేటింగ్ అసెట్. కాబట్టి షోరూమ్ లోన్ తీసుకునే ముందు మీ వద్ద ఉన్న పాత కారు ఎక్స్చేంజ్ బోనస్, పండుగ ఆఫర్లు, కార్పొరేట్ డిస్కౌంట్‌లను క్లెయిమ్ చేయండి.
