Surekha Vani Comments On Her Second Marriage : టాలీవుడ్ సీనియర్ నటి సురేఖా వాణి ఒకప్పుడు తెలుగుతో పాటు తమిళ భాషల్లోనూ మూవీస్ చేశారు. బొమ్మరిల్లు మూవీతో ఫుల్ పాపులారిటీ సంపాదించుకున్నారు. ఆ తర్వాత కొంత గ్యాప్ తీసుకున్నా... ఇప్పుడు మళ్లీ అడపాదడపా మూవీస్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన కుమార్తె సుప్రీతతో కలిసి ఫోటో షూట్స్ చేస్తుంటారు.
తాజాగా, సురేఖా వాణి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ మూవీలో కీలకపాత్ర పోషిస్తున్నారు. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో ఆమె తన సెకండ్ మ్యారేజ్ గురించి రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం ఇవి వైరల్ అవుతున్నాయి.
పెళ్లిపై సురేఖా వాణి రియాక్షన్
'మా అమ్మ హ్యాపీగా ఉండాలి. సెకండ్ మ్యారేజ్ చేస్తానని మీ అమ్మాయి అన్నారు. దానికి మీరేమంటారు?' అంటూ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు... సురేఖా వాణి రియాక్ట్ అయ్యారు. 'ఆ ఆలోచనైతే లేదు. ఒకవేళ ఉండుంటే ఇన్ని రోజులు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ప్రస్తుతానికైతే నాకు అలాంటి ఆలోచనే లేదు. ఇకమీదట కూడా ఉండదనే అనుకుంటున్నా. మా అమ్మాయికి పెళ్లే చేసే వయసొచ్చింది. నేనేం పెళ్లి చేసుకుంటాను. అయినా, నా పెళ్లి ప్రెస్ వాళ్లు ఎప్పుడే చేసేశారు. రాసేశారు కూడా.' అంటూ సరదాగా కామెంట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.
కాగా, గతంలో ఓ మూవీ ప్రమోషనల్ ఇంటర్వ్యూలో సురేఖా వాణి కుమార్తె, హీరోయిన్ సుప్రీత తన తల్లికి మళ్లీ చేయడంపై కామెంట్ చేశారు. తన తల్లి సురేఖా వాణికి మళ్లీ పెళ్లి చేయాలనే ఆలోచన తనకు ఉందని అన్నారు. అమ్మ చాలా హ్యాపీగా ఉండాలని... ఆమెను ప్రశ్నించకుండా... ఆమె స్పేస్ ఆమెకు ఇవ్వాలని... అలాంటి వ్యక్తి దొరకాలని అన్నారు.
నిరమ్ మూవీ విషయానికొస్తే... ఈ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ సినిమాలో సురేఖా వాణి శకుంతల అనే కీలకపాత్రలో నటించారు. తమిళ బిగ్ బాస్ ఫేమ్ ముగెన్ రావు హీరోగా నటిస్తుండగా... ప్రీతి అశ్రాని, తాన్యా హోప్, నితిన్ సత్య, సురేష్ చక్రవర్తి తదితరులు కీలకపాత్రలు పోషించారు. ఈ మూవీకి కృష్ణ బాలకృష్ణ దర్శకత్వం వహించగా... డి. ఇమ్మాన్ మ్యూజిక్ అందించారు. తాజా ట్రైలర్ ఆకట్టుకుంటోంది. రియల్ సంఘటనల ఆధారంగా ఈ మూవీని రూపొందించారు. మహిళల కిడ్నాప్ అంశాలు, మాఫియా చుట్టూ ఈ స్టోరీ సాగుతోంది.
