Skoda Kylaq Automatic Price, Mileage And Features In Telugu: భారతీయ మార్కెట్లో సబ్-4 మీటర్ SUVలకు సూపర్ డిమాండ్ ఉంది, ఈ సెగ్మెంట్ కార్లు హాట్‌కేకుల్లా అమ్ముడవుతున్నాయి. వీటిలోనూ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఉన్న వాహనాలను పట్టణ/నగర వినియోగదారులు బాగా ఇష్టపడుతున్నారు. ఎందుకంటే, ఆటోమేటిక్ వేరియంట్ డ్రైవర్ శ్రమను తగ్గిస్తుంది. బ్-4 మీటర్ SUV సెగ్మెంట్‌లో తన పట్టును మరింత బిగించడానికి, స్కోడా ఆటో ఇండియా, కైలాక్ ఆటోమేటిక్‌ను ప్రవేశపెట్టింది.
ఏ ఆటోమొబైల్ కంపెనీ అయినా, తన కార్లకు సాటి లేదంటూ ఊదరగడొతుంది. స్వయంగా టెస్ట్ రైడ్ చేసి, ఆ బండిలోని అనుకూలతలు & ప్రతికూలతలు తెలుసుకోవడం తెలివైన పని. కంపెనీ చెప్పినట్లు స్కోడా కైలాక్ ఆటోమేటిక్ కారు స్టైలిష్‌గా ఉందా, లేదా?, పనితీరు & మైలేజ్ పరంగా కస్టమర్లకు బెస్ట్ ఆప్షన్ అవుతుందా అని తెలుసుకోవడానికి రోడ్ టెస్ట్ చేశారు. ఆ టెస్ట్ రిజల్ట్స్ గురించి తెలుసుకుందాం.
ట్రాన్స్‌మిషన్ & పెర్ఫార్మెన్స్‌కైలాక్ ఆటోమేటిక్ 1.0-లీటర్ TSI టర్బోచార్జ్‌డ్ పెట్రోల్ ఇంజిన్‌తో పని చేస్తుంది, ఇది 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో యాడ్ అయింది. ఈ ట్రాన్స్‌మిషన్‌తో డ్రైవింగ్ అనుభవం చాలా సున్నితంగా & సమతుల్యంగా ఉంటుంది. AMTకి బదులుగా నిజమైన ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ కారణంగా, గేర్‌లు మార్చేటప్పుడు చిన్న కుదుపులు కూడా లేకుండా చేస్తుంది.
డ్రైవింగ్‌ను సరదాగా మార్చేందుకు, కారు స్టీరింగ్‌పై ప్యాడిల్ షిఫ్టర్స్ కూడా ఉన్నాయి. సిటీ ట్రాఫిక్‌లో డ్రైవ్ చేసినా లేదా హైవే మీద లాంగ్ డ్రైవ్‌కు వెళ్లినా ఈ ఇంజిన్ అలసిపోయినట్లు లేదా బలహీనపడినట్లు ఎక్కడా అనిపించదు. దీని మిడ్ రేంజ్ టార్క్వీ ఓవర్‌టేకింగ్స్‌ను చాలా ఈజీగా మారుస్తుంది.
డైనమిక్ పెర్ఫార్మెన్స్‌కైలాక్ ఆటోమేటిక్ స్టీరింగ్ అనుభూతి చాలా ఖచ్చితంగా & ప్రతిస్పందనతో కూడి ఉంటుంది. స్పోర్టియర్ సస్పెన్షన్ సెటప్ భారతీయ రోడ్ పరిస్థితులకు తగ్గట్లు కఠినంగా ఉంటుంది, అందుకే ఇది ఈ క్లాస్‌లో అత్యుత్తమం అనిపిస్తుంది. 189 mm గ్రౌండ్ క్లియరెన్స్ వల్ల గుంతలు & స్పీడ్ బ్రేకర్ల వద్ద కూడా మీరు నమ్మకంగా డ్రైవ్ చేయవచ్చు.
మైలేజ్ ఎలా ఉంది?కైలాక్ ఆటోమేటిక్ మైలేజ్ కూడా చాలా బాగుంది, లీటరుకు 10 కి.మీ.ల నుంచి 14 కి.మీ.ల మధ్య మైలేజీ ఇస్తుందని పరీక్షలో తేలింది, ఇది మాన్యువల్ వేరియంట్‌కు సమానం. సాధారణంగా, ఏ కారులోనైనా, మాన్యువల్‌తో పోలిస్తే ఆటోమేటిక్ వెర్షన్‌లో మైలేజీ కొద్దిగా ఎక్కువగా ఉంటుంది.
కైలాక్ ఆటోమేటిక్‌ను ఎందుకు ఎంచుకోవాలి?కైలాక్ ఆటోమేటిక్ సరైన టార్క్ కన్వర్టర్ ట్రాన్స్‌మిషన్‌తో వస్తుంది, ఇది AMT కంటే చాలా సున్నితమైన & నమ్మదగిన డ్రైవింగ్ అనుభవాన్ని ఇస్తుంది. దీని TSI ఇంజిన్ బెస్ట్ పెర్ఫార్మ్ చేస్తుంది, దాని థ్రోటిల్ రెస్పాన్స్ కూడా చాలా షార్ప్‌గా ఉంటుంది, నగరం & హైవే డ్రైవింగ్‌లో ఫన్‌ను యాడ్ చేస్తుంది.