How To Start Car With Dead Battery: ఉదయం ఆఫీస్‌కి బయల్దేరబోతున్నప్పుడు లేదా ఇంటికి తిరిగి వెళ్తున్నప్పుడు లేదా ఎప్పుడైనా జోరుగా కురుస్తున్న వర్షంలో ఒక్కసారిగా కారు ఆగిపోయి, తిరిగి స్టార్ట్ కాకపోవడం చాలా ఇబ్బందికరమైన విషయం. ఎక్కువగా, దీనికి కారణం కారు బ్యాటరీ డెడ్/డౌన్‌ కావడమే. చాలా మంది డ్రైవర్లు ఇలాంటి పరిస్థితుల్లో టెన్షన్‌ పడతారు. కానీ, నిజానికి టెన్షన్‌ అవసరం లేదు. కారు బ్యాటరీ డెడ్‌ అయినప్పటికీ, కొన్ని సింపుల్‌ చిట్కాలు తెలుసుకుంటే, మీరు ఎప్పుడైనా మీ కారును తిరిగి స్టార్ట్ చేయవచ్చు.

Continues below advertisement

జంప్ స్టార్ట్ - ఇది చాలా సులభమైన పరిష్కారం

బ్యాటరీ డెడ్ అయ్యినప్పుడు ఎక్కువగా వాడే పద్ధతి జంప్ స్టార్ట్‌. దీనికోసం, మీ దగ్గర జంపర్‌ కేబుల్స్‌ ఉండాలి. మీకు దగ్గరలో మరొక కార్‌ నుంచి సహాయం లభిస్తే చాలు, రెండు కార్ల బ్యాటరీలను సరిగ్గా కనెక్ట్ చేసి స్టార్ట్ చేస్తే మీ కారు మళ్లీ రన్నింగ్‌లోకి వస్తుంది. డ్రైవర్లు ఎప్పుడూ తమ వాహనంలో జంపర్‌ కేబుల్స్‌ పెట్టుకోవడం అలవాటు చేసుకోవాలి.

Continues below advertisement

పుష్ స్టార్ట్ - మాన్యువల్ కార్లకు మాత్రమే, గుర్తుంచుకోండి

మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌ ఉన్న కార్లకు పుష్ స్టార్ట్ మంచి ఆప్షన్‌. మీ కారును రెండో (2nd) గేర్‌లో పెట్టి, కొంతమందితో ముందుకు నెట్టించాలి. కారు కొద్దిుపాటి వేగంతో ముందుకు కదులుతున్నప్పుడు ఒక్కసారిగా క్లచ్‌ వదిలేస్తే ఇంజిన్‌ ఫైర్‌ అవుతుంది. ఎమర్జెన్సీ సిట్యుయేషన్లలో ఇది బాగా ఉపయోగపడుతుంది.

పోర్టబుల్ జంప్ స్టార్టర్‌తో ఉపయోగం

ఇప్పుడున్న టెక్నాలజీతో, మార్కెట్లో చిన్న పోర్టబుల్ జంప్ స్టార్టర్స్ అందుబాటులో ఉన్నాయి. ఇది మీ దగ్గర ఉంటే, మీరు ఏ పరిస్థితిలోనైనా, ఎవరి సాయం లేకుండా కారును స్టార్ట్‌ చేయవచ్చు. పోర్టబుల్ జంప్ స్టార్టర్స్, మొబైల్‌ ఫోన్‌ పవర్‌ బ్యాంక్‌ మాదిరిగానే పని చేస్తాయి. వీటిని ఒకసారి చార్జ్‌ చేసి మీ కారులో పెట్టుకుంటే, మీ కారును ఏ సమయంలోనైనా స్టార్ట్ చేయగలవు. తరచూ ఎక్కువ డ్రైవ్ చేసేవాళ్లు, దూర ప్రయాణాలు చేసేవాళ్లు ఒక పోర్టబుల్ స్టార్టర్ తప్పనిసరిగా వెంట పెట్టుకోవాలి.

హెడ్‌లైట్స్‌, మ్యూజిక్ సిస్టమ్‌ ఆఫ్ చేయాలిబ్యాటరీ వీక్‌గా ఉందనిపించినప్పుడు, కారును స్టార్ట్ చేయడానికి ముందు హెడ్‌లైట్స్‌, మ్యూజిక్ సిస్టమ్‌, ఎయిర్ కండిషనర్‌ వంటి అన్ని ఎలక్ట్రికల్‌ లోడ్స్‌ ఆఫ్‌ చేయాలి. ఇలా చేస్తే మొత్తం పవర్‌ ఇంజిన్‌ స్టార్ట్‌ చేయడానికి వెళ్తుంది.

బ్యాటరీ మెయింటెనెన్స్ తప్పనిసరిబ్యాటరీ డెడ్ అవ్వకుండా ఉండటానికి రెగ్యులర్‌ మెయింటెనెన్స్‌ చాలా ముఖ్యం. కనీసం ఆరు నెలలకు ఒకసారి బ్యాటరీ కండీషన్‌ చెక్ చేయించుకోవాలి. టెర్మినల్స్‌ దగ్గర రస్ట్‌ లేదా డస్ట్‌ ఉంటే, వాటిని శుభ్రం చేయాలి. అలాగే, లాంగ్ డ్రైవ్ చేసిన తర్వాత కూడా ఒకసారి బ్యాటరీని సర్వీస్ సెంటర్‌లో చెక్ చేయించుకోవడం మంచిది.

ముందుగానే జాగ్రత్తలు తీసుకోవాలిలాంగ్ ట్రిప్స్‌కి వెళ్తే జంపర్‌ కేబుల్స్‌, పోర్టబుల్ స్టార్టర్, టార్చ్‌లైట్, స్పానర్లు, స్క్రూడ్రైవర్‌ వంటి బేసిక్ టూల్స్‌ కారులో పెట్టుకోవాలి. ఇంకా, జాకీ, స్పేర్‌ టైర్‌ కూడా మీ దగ్గర ఉంటే ఎప్పుడు, ఎక్కడా ఇబ్బంది రాకుండా మీరు సేఫ్‌గా డ్రైవ్ చేయవచ్చు.

బ్యాటరీ డెడ్ అయ్యినప్పుడు టెన్షన్‌ అవసరం లేదు. సింపుల్‌ చిట్కాలతో, సరిగ్గా ముందుగానే జాగ్రత్తలు తీసుకుంటే, మీ కారు మళ్లీ సులభంగా రోడ్డుపై పరుగులు పెడుతుంది. డ్రైవింగ్‌లో సేఫ్టీ ఎంత ముఖ్యమో, వాహన మెయింటెనెన్స్ కూడా అంతే ముఖ్యమని గుర్తుంచుకోండి.