Car Fancy Numbers Online Booking Details: మన దేశంలోకి కార్లు వచ్చిన తొలినాళ్ల నుంచి ఇప్పటి వరకు, హోదాకు & దర్పానికి దర్పణంలా అవి మారాయి. కారును చూసి మనుషులను గౌరవించే రోజులు ఇప్పుడు నడుస్తున్నాయి. కాబట్టి, ప్రజలు తమ వాహనాలను స్టైల్ & షోఆఫ్‌లో భాగంగా చేసుకున్నారు. దీంతో పాటు.. ఫ్యాన్సీ రిజిస్ట్రేషన్‌ నంబర్‌ లేదా VIP నంబర్‌ ప్లేట్లకు క్రేజ్ కూడా పెరిగింది. ఇటీవల, హరియాణాకు చెందిన ఒక సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ తన లగ్జరీ కారు కోసం రూ. 10 లక్షలు ఖర్చు పెట్టి ఫ్యాన్సీ నంబర్‌ కొనుగోలు చేశారు. ఇలాంటి సంఘటనలు ఇప్పుడు సర్వసాధారణంగా మారాయి.

ప్రతి ఒక్కరూ, తాము ఎంతో ఇష్టపడి కొనుక్కున్న కార్‌, బైక్‌ లేదా మరేదైనా వాహనానికి ఫ్యాన్సీ నంబర్‌ లేదా ఇష్టమైన నంబర్‌ లేదా సెంటిమెంట్‌ నంబర్‌ వస్తే బాగుండు అనుకుంటారు. అయితే.. 0001, 0786, 9999, 0909, 0099, 1111, 3333, 6666 లేదా ఏదైనా ప్రత్యేక నంబర్‌లను అందరికీ కేటాయించరు. మీరు కోరుకుంటే, అలాంటి నంబర్ ప్లేట్‌ను దక్కించుకోవడం సులభం. దీనికోసం మీరు ఏ బ్రోకర్ లేదా ఏజెంట్‌ను సంప్రదించాల్సిన అవసరం లేదు. కేంద్ర ప్రభుత్వ పరివాహన్ సేవ (Parivahan Sewa) వెబ్‌సైట్‌లోకి వెళ్లి, దర్జాగా ఇ-వేలం (e-Auction) ప్రక్రియలో పాల్గొంటే చాలు.

VIP నంబర్ ప్లేట్ పొందడానికి ఈ సింపుల్‌ స్టెప్స్‌ ఫాలో అవ్వండి

1. ముందుగా, కేంద్ర ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్ https://parivahan.gov.in/parivahan/ లోకి వెళ్లండి.

2. Online Services సెక్షన్‌లోకి వెళ్లి Fancy Number Booking లింక్‌ మీద క్లిక్ చేయండి.

3. ఇక్కడ, మీరు పబ్లిక్ యూజర్‌గా కొత్త ఖాతా సృష్టించాలి. దీని కోసం, మీ మొబైల్ నంబర్ & ఇ-మెయిల్ ఐడీ అవసరం. OTP ద్వారా వాటిని ధృవీకరించండి.

4. ఖాతా యాక్టివేట్ అయిన తర్వాత లాగిన్ అవ్వాలి. మీరు మీ వాహనాన్ని ఎక్కడ రిజిస్టర్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ రాష్ట్రాన్ని ఎంచుకోండి.

5.  మీ వెహికల్‌ కేటరిగీని ఎంచుకోండి - ప్రైవేట్ కారు, బైక్ లేదా కమర్షియల్‌ వెహికల్‌ వంటి వివరాలు నమోదు చేయండి.

6. ఇప్పుడు, వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న VIP నంబర్‌ల లిస్ట్‌ కనిపిస్తుంది. మీరు Search by Number ఆప్షన్‌ కూడా ఉపయోగించి, మీరు కోరుకునే నంబర్ కోసం శోధించవచ్చు.

7. మీరు కోరుకున్న లేదా మీకు నచ్చిన నంబర్ అందుబాటులో ఉంటే రిజిస్ట్రేషన్ ఫీజ్‌ చెల్లించండి. ఆ నంబర్‌కు ఉన్న డిమాండ్‌ను బట్టి ఫీజ్‌ ఉంటుంది.

8. రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత మీరు ఆ నంబర్ కోసం ఇ-వేలంలో పాల్గొనాలి. అత్యధిక మొత్తానికి బిడ్ వేసిన వ్యక్తికి ఆ నంబర్ దక్కుతుంది.

9. మీరు వేసిన బిడ్ విజేతగా నిలిస్తే, అంటే అందరి కంటే ఎక్కువ మొత్తాన్ని మీరు ఆఫర్‌ చేస్తే ఆ నంబర్‌ మీ సొంతం అవుతుంది. 

10. కోరుకున్న నంబర్‌ను గెలిచిన తర్వాత అదే వెబ్‌సైట్‌ నుంచి పేమెంట్‌ పూర్తి చేయండి & Allotment Letter డౌన్‌లోడ్ చేసుకోండి. ఇది మీ వ్యాలిడ్‌ సర్టిఫికేట్ అవుతుంది.

ఇంత సింపుల్‌గా, ఇంట్లోనే కూర్చుని ఫ్యాన్సీ నంబర్ పొందొచ్చు, ఇప్పుడు అది కష్టమైన పని కాదు. ఫ్యాన్సీ నంబర్‌ పొందే ప్రక్రియను ప్రభుత్వం పూర్తిగా డిజిటల్‌గా & పారదర్శకంగా మార్చింది. మీ కార్‌తో పాటు నంబర్ ప్లేట్‌ కూడా ప్రజలకు ప్రత్యేకంగా కనిపించాలని మీరు కోరుకుంటే, ఇప్పుడే పరివాహన్ సేవ వెబ్‌సైట్‌ను సందర్శించండి.