Tata Nexon 2025 Price, Mileage And Features In Telugu: మీ కుటుంబానికి ఒక గొప్ప కారును గిఫ్ట్‌గా ఇవ్వాలని మీరు ప్లాన్ చేస్తుంటే, టాటా నెక్సాన్ మీకు మంచి ఎంపిక కావచ్చు. అయితే, ఇంత మంచి కారును కొనడానికి సరిపడా బడ్జెట్ మీ దగ్గర లేకపోతే, మీరు మీ ఆలోచనను తుంచేయాల్సిన అవసరం లేదు. కారు లోన్ తీసుకుని టాటా నెక్సాన్‌ను ఖరీదు చేయవచ్చు. బ్యాంక్ లేదా ఫైనాన్స్ కంపెనీ మీకు రుణం ఇవ్వడానికి రెడీగా ఉంటుంది. అయితే, లోన్ తీసుకునే ముందు మీరు ఈ కారు ఆన్-రోడ్ ధర, డౌన్ పేమెంట్ & లోన్ EMI వంటి కొన్ని కీలక విషయాలను వివరంగా తెలుసుకోవాలి.
కారు కొనడానికి మీకు ఎంత డౌన్ పేమెంట్ చేయాలి? టాటా నెక్సాన్ బేస్ వేరింయట్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 8 లక్షలు. మీరు కొనుగోలు చేసే వేరియంట్‌ను బట్టి ఈ రేటు మారుతుంది, టాప్-ఎండ్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 15.60 లక్షలు. హైదరాబాద్ లేదా విజయవాడలో, ఈ కారు బేస్ వేరియంట్ రిజిస్ట్రేషన్ కోసం దాదాపు 1.15 లక్షలు; ఇన్సూరెన్స్ కోసం దాదాపు రూ. 40,000; ఇతర ఖర్చులు దాదాపు రూ. 2 వేలు అవుతాయి. ఈ మొత్తం కలిపి, తెలుగు రాష్ట్రాల్లో టాటా నెక్సాన్ బేస్ వేరియంట్ ఆన్-రోడ్ ధర (Tata Nexon 2025 on-road price) దాదాపు రూ. 9.56 లక్షలు అవుతుంది. మీరు ఈ బండిని కొనడానికి కేవలం 1.56 లక్షలు డౌన్ పేమెంట్ చేయగలిగితే, మిగిలిన రూ. 8 లక్షలు కార్ లోన్ రూపంలో లభిస్తుంది. మీరు ఈ రుణాన్ని 9 శాతం వడ్డీ రేటుతో పొందారని అనుకుందాం. ఇప్పుడు EMI లెక్క చూద్దాం.
టాటా నెక్సాన్ ఫైనాన్స్ ప్లాన్
రుణం - రూ. 8 లక్షలు; వడ్డీ రేటు - 9%
7 సంవత్సరాల్లో రుణం తీర్చేయాలనుకుంటే ప్రతి నెలా రూ. 12,871 EMI చెల్లించాలి.
6 సంవత్సరాల రుణ కాలపరిమితి పెట్టుకుంటే నెలకు రూ. 14,420 EMI చెల్లించాలి.
5 సంవత్సరాల్లో లోన్ క్లియర్ చేయాలని ప్లాన్ చేస్తే నెలకు రూ. 16,607 EMI చెల్లించాలి.
4 సంవత్సరాల లోన్ టెన్యూర్ పెట్టుకుంటే నెలకు రూ. 19,908 EMI చెల్లించాలి.
మీరు ఎంత ఎక్కువ డౌన్ పేమెంట్ చేయగలిగితే, బ్యాంకుకు చెల్లించాల్సిన వడ్డీ మొత్తం అంత తగ్గుతుంది. రుణం & వడ్డీ రేటు వివిధ బ్యాంకులు & మీ క్రెడిట్ స్కోర్‌ను బట్టి మారుతుంది.
మీ జీతం రూ. 60,000 కంటే ఎక్కువగా ఉంటే, టాటా నెక్సాన్ కొనడానికి మీరు 5 లేదా 6 లేదా 7 సంవత్సరాల లోన్ టెన్యూర్‌తో కార్ లోన్ తీసుకోవచ్చు.
టాటా నెక్సాన్ పవర్‌ట్రెయిన్ ఆప్షన్స్ టాటా నెక్సాన్ పెట్రోల్, డీజిల్ & CNG ఇంజిన్ ఎంపికతో లభిస్తోంది. ఈ కారులో 1.2-లీటర్ టర్బోచార్జ్‌డ్ రెవోట్రాన్ ఇంజిన్ బిగించారు. ఈ ఇంజిన్ 5,500 rpm వద్ద 88.2 PS పవర్‌ను & 1,750 నుంచి 4,000 rpm వద్ద 170 Nm టార్క్‌ను జనరేట్ చేస్తుంది. నివేదికల ప్రకారం, టాటా నెక్సాన్ 17 kmpl నుంచి 24 kmpl మైలేజీ (Tata Nexon Mileage) ఇస్తుంది.